Big Stories

Revanthreddy : పంచాయతీల నిధుల కోసం కాంగ్రెస్ పోరాటం..రేవంత్ అరెస్ట్..

Revanthreddy : పంచాయతీల నిధుల కోసం కాంగ్రెస్ పార్టీ.. హైదరాబాద్ ఇందిరా పార్క్‌ వద్ద తలపెట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. నిరసనలో పాల్గొనేందుకు ఇంటి నుంచి బయలుదేరిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో కొద్దిసేపు రేవంత్‌ రెడ్డి, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత రేవంత్‌ను బలవంతంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ చేసి జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అలాగే కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలను అరెస్టులు చేసి వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.

- Advertisement -

ఇంటి నుంచి బయలుదేరే ముందు కాంగ్రెస్ ధర్నా విషయంపై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. సర్పంచ్‌ నిధులను ప్రభుత్వమే అపహరించిందని ఆరోపించారు. నిధులు కాజేసిన ప్రభుత్వంపై కేసు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -

మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచే కాంగ్రెస్‌ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గ్రామ సర్పంచ్‌ల సమస్యలపై అనేక ప్రాంతాల్లో టీకాంగ్రెస్ నేతలు చేపట్టిన నిరసనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. సర్పంచ్‌లకు మద్దతుగా ఆందోళన వ్యక్తం చేసేందుకు ధర్నాచౌక్‌కు వెళ్తున్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు.

గాంధీ భవన్ నుంచి ధర్నా చౌక్ కు వెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో వారిని పోలీసులు నిలువరించారు. గాంధీభవన్ గేట్ వద్దే కాంగ్రెస్ నేతలను , కార్యకర్తలను నిర్బంధించారు. దీంతో ప్రభుత్వం, పోలీసుల తీరును నిరసిస్తూ..కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు హస్తం నేతలు. గేటు ఎక్కి బయటకు దూకేందుకు యత్నించారు. ఈ సమయంలో పోలీసులకు కాంగ్రెస్ నేతలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. కాసేపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. అటు ధర్నా చౌక్ వద్ద పలువురు సర్పంచులను అరెస్ట్ చేశారు. ప్రభుత్వ తీరుపై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News