E-Paper
Advertisement

జైలుకెళ్లినా సీటు కదలదు.. కలెక్టర్‌నే బురిడీ కొట్టించిన డెమోల దందా..!

జైలుకెళ్లినా సీటు కదలదు.. కలెక్టర్‌నే బురిడీ కొట్టించిన డెమోల దందా..!
Advertisement

DMHO Officials: స్వేచ్ఛ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ లోని హైదరాబాద్, రంగారెడ్డి డీఎమ్ హెచ్ వో కార్యాలయాలు ఇప్పుడు వివాదస్పదమయ్యాయి. ఈ కార్యాలయాల్లో పనిచేసే డెమోలు(డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ అండ్ మీడియా ఆఫీసర్స్) చక్రం తిప్పుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఏళ్ల తరబడి పాతుకుపోయి ఈ కార్యాలయాలకు చెడ్డపేరును తీసుకువస్తున్నారు. డీఎమ్ హెచ్ వోలు మారినా.. ఈ ఆఫీసర్స్ తమకు ఉన్న పలుకుబడిని ఉపయోగించి తిష్ట వేశారు. కార్యాలయాల్లోనే సీనియర్లు కావడంతో వాళ్లు చెప్పిందే వేదంగా కొనసాగుతున్నది.

జైలుకు వెళ్లిన చరిత్ర..

అనుమతుల నుంచి అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీస్ వరకు వీరి కనుసన్నల్లోనే కొనసాగుతుంది. వీరి హిస్టరీలో చార్జ్ మెమోలు, సరెండర్ లు ఉన్నా..ఉన్నతాధికారులు కూడా ఏమీ చేయలేని సిచ్వేషన్ నెలకొన్నది. ఇందులో ఓ ఆఫీసర్ పై జైలుకు వెళ్లిన చరిత్ర కూడా ఉన్నట్లు రంగారెడ్డి కార్యాలయంలోని ఓ ఉద్యోగి చెప్పారు. ట్రాన్స్ ఫర్స్ సమయంలోనూ వీళ్లు సీటు నుంచి కదలరు.ఉద్యోగ సంఘాలు అని చెప్పుకుంటూ పైరవీలతో ఇక్కడే మకాం వేశారు.ఈ ఇద్దరు ఆఫీసర్స్ రెండు జిల్లాల డీఎమ్ హెచ్ వో కార్యాలయాలను తమ సైగలతో శాసిస్తున్నారని స్వయంగా ఆయా ఆఫీస్ లలో పనిచేసే ఉద్యోగులే చెప్పడం విశేషం.

రంగారెడ్డి శ్రీనివాస్ బిగ్ హిస్టరీ..

Advertisement

రంగారెడ్డి డీఎమ్ హెచ్ వో కార్యాలయంలో ప్రస్తుతం డెమోగా పనిచేస్తున్న కే శ్రీనివాస్ 1992లో హెల్త్ అసిస్టెంట్ గా ప్రభుత్వ సర్వీస్ లోకి వచ్చారు. 2005–2006లోనే ఓ కీలక అంశంలో సస్పెండ్ అయినట్లు సమాచారం. ఇక 2016 మెదక్ లో డిప్యూటీ డెమో గా జాయిన్ అయ్యారు.కొద్ది రోజుల్లోనే డిప్యూటేషన్ పై రంగారెడ్డికి వచ్చారు. డిప్యూటీ డెమో హోదాలోనే ఐదేళ్ల పాటు అక్కడే ఇన్ చార్జ్ డెమోగా విధులు నిర్వ ర్తించారు. ఆ తర్వాత 2020న హెచ్ ఈఈవోగా ప్రమోషన్ పొంది మళ్లీ ఇక్కడే పర్మినెంట్ పోస్టింగ్ తీసుకున్నారు. కానీ ఇన్ చార్జ్ డెమో విధులనే నిర్వర్తిస్తూ వస్తున్నారు. అప్పటికే తిరుపతయ్య అనే ఉద్యోగి సీనియర్ గా ఉన్నప్పటికీ, రెండు సార్లు ఛార్జ్ ఇవ్వకుండా శ్రీనివాస్ అడ్డుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో గతంలో తిరుపతయ్య రంగారెడ్డి కలెక్టర్ కు కూడా నాలుగు సార్లు కంప్లైంట్స్ ఇచ్చారు. కానీ చార్జ్ ఇవ్వలేదు. ఆ తర్వాత తిరుపతయ్య 2020–2021 డెమోగా ప్రమోషన్ పొంది మహబూబ్ నగర్ కు వెళ్లారు. ఆ తర్వాత తానే బాస్ గా వ్యవహరించిన శ్రీనివాస్ కు మళ్లీ షాక్ తగిలింది.

Also read: వాషింగ్ మెషిన్‌లో బట్టలు కొత్త మెరవాలంటే.. లిక్విడ్ డిటెర్జెంట్‌తో పాటు ఈ 2 వేయండి

కలెక్టర్ కు కూడా తెలియకుండా..

Advertisement

2024 లో జరిగిన సాధారణ బదిలీల్లో తిరుపతయ్య మళ్లీ రంగారెడ్డికి డెమోగా వచ్చారు. వచ్చిన కొద్ది రోజుల్లోనే తిరపతయ్యను సరెండర్ చేపించి మళ్లీ శ్రీనివాసే ఇన్ చార్జ్ డెమోగా కంటిన్యూ అవుతున్నారని ఉద్యోగులు చెప్తున్నారు. పైగా సరెండర్ విషయం కలెక్టర్ కు కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఇలా 2016 నుంచి 2026 వరకు శ్రీనివాసే ఇన్ చార్జ్ డెమోగా వర్క్ చేస్తున్నారు. డీఎమ్ హెచ్ వోలు మారినా..ఈయన మాత్రం ఆ పోస్టును సేఫ్​ గా ఉంచుకుంటున్నట్లు తెలుస్తున్నది. మరోవైపు శ్రీనివాస్ సర్వీస్ హిస్టరీలో ఇల్లీగల్ ప్రమోషన్ లు చేయించారనే ఉద్దేశ్యంతో మెమోలు కూడా ఉన్నట్లు రంగారెడ్డిలోని ఓ అధికారి తెలిపారు. గతంలో జైలుకు వెళ్లిన చరిత్ర కూడా ఉన్నట్లు రంగారెడ్డి కార్యాలయంలోని ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు. ఆయన పోస్టును కాపాడుకునేందుకు శ్రీనివాస్ ఇతరులను కావాలనే ఇరకాటంలో పడేస్తారనే చర్చ కూడా ఉన్నది.

రాములపై ఏకంగా ప్రభుత్వానికే ఫిర్యాదు..

ఇక హైదరాబాద్ జిల్లా డెమో గా పనిచేస్తున్న రాములపై కూడా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఈయన గడిచిన తొమ్మిదిన్నర ఏళ్ల నుంచి హైదరాబాద్ డీఎమ్ హెచ్ వో కార్యాలయాన్ని వదలట్లేదు. ట్రాన్స్ ఫర్స్ సమయంలో తెలంగాణ గజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నుంచి స్టేట్‌ ట్రెజరర్ అనే లెటర్ తీసుకుంటున్నారు. కానీ ఆ యూనియన్ లో మరో వ్యక్తి ట్రెజరర్ గా ఉన్నట్లు లెటర్ ఫ్యాడ్ లోనే ఉన్నది. ఇది ఎలా సాధ్యమనే ప్రశ్న ఇప్పుడు స్వయంగా హైదరాబాద్ జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం ఉద్యోగులే అవాక్కవుతున్నారు.బదిలీల సమయంలో ఈయన చేసిన తప్పిదాలు, నిర్లక్ష్యంపై లోకాయిక్తో కూడా ఫిర్యాదు నమోదైంది. అంతేగాక ప్రజావాణిలోనూ కంప్లైంట్ చేయడం గమనార్హం.

Also read: ఈఎంఐ కట్టలేదని భార్య భర్తలపై భౌతిక దాడి కలకలం

ఇద్దరిదీ సేమ్ రూట్..

సుదీర్ఘకాలం ఒకే సీట్లో కూర్చోని ఈ ఇద్దరు ఆఫీసర్లు అందిన కాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేట్ హాస్పిటళ్లను వేధించడం తో పాటు వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారట. సుమారు పదేళ్ల పాటు ఒకే సీట్లు కూర్చోని కోట్ల రూపాయలకు పడగలు ఎత్తినట్లు కూడా ఆరోపణలు కూడా ఉన్నాయి.వీరి ఇద్దరి ఆస్తుల వివరాలపై ఏసీబీకి కూడా ఫిర్యాదు చేసేందుకు కొందరు ఉద్యోగులు రెడీ అయ్యారు. ఇక డాక్టర్లను బెదిరించడం.. కార్పొరేట్ హాస్పిటళ్లతో కుమ్మక్కై చిన్న హాస్పిటళ్లను ఇబ్బందులకు గురి చేయడం.. తమమాట వినని డీఎంహెచ్‌వోలపై ఆరోపణలు చేయడం, ప్రమోషన్లు ఇప్పిస్తానను పైసలు వసూలు చేయడం వీరిద్దరికీ పరిపాటిగా మారిపోయిందనే ఆరోపణలు ఉద్యోగుల నుంచే వినిపిస్తున్నాయి.

వీరు ఆడిందే ఆట..

హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో వీళ్లు ఎంత చెబితే, అంత ప్రైవేట్ ఆసుపత్రులు ముట్టజెప్పాల్సిందేనని ఓ ఉద్యోగి తెలిపారు. చిన్న క్లినిక్ లు, ల్యాబ్ లు ఏ ఒక్క ఇనిస్టిట్యూట్ ను కూడా వీళ్లిద్దరు వదలరనే అనే చర్చ ఉన్నది. అనుమతులు, రెన్యువల్స్ నుంచి షోకాజ్ నోటీసులు వరకు అంతా వీరే క్రీయాశీలకమై చక్రం తిప్పుతున్నారనే చర్చ ఆయా డీఎమ్ హెచ్ వో కార్యాలయాల్లో ఉన్నది. వీరు ఆడిందే ఆట..పాడిందే పాట వంతుగా వైద్య కార్యాలయాలు ఉన్నాయి. వీరు చేస్తున్న నిర్లక్ష్​యానికి డీఎమ్ హెచ్ వోలకూ మరక అంటే పరిస్థితి వచ్చింది. పై నుంచి సపోర్టు లేనిదే వీళ్లు ఈ స్థాయిలో వ్యవహరిస్తారా? అనే చర్చ కూడా ఉద్యోగుల్లో ఉన్నది.

Also read: మీ ఆరోగ్యానికి గ్యారెంటీ.. 5 బెస్ట్ వాటర్ ప్యూరిఫైయర్స్ లిస్ట్ మీకోసం!

Related News

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మాయగాళ్లను నమ్మొద్దు.. మేకతోలు కప్పుకున్న తోడేళ్లు.. బీఆర్‌ఎస్‌పై సీఎం రేవంత్ నిప్పులు

KBR Python: హైదరాబాద్ కేబీఆర్ పార్క్‌లో భారీ కొండ చిలువ హల్ చల్..!

Second Hand Mobile: సెకండ్‌హ్యాండ్ మొబైల్ కొంటున్నారా?.. అయితే ఇవి తప్పని సరి!

Big Stories

Advertisement
×