E-Paper
Advertisement

షాబాద్ ఆరుగురి హత్య కేసు.. నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య!

షాబాద్ ఆరుగురి హత్య కేసు.. నిందితుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య!
Advertisement

Shabad Murder: రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో ఆరుగురిని అతి దారుణంగా హత్య చేసి పరారైన నిందితుడు రాజ్ కుమార్ కథ విషాదాంతమైంది. స్థానికుల నుంచి అందిన సమాచారంతో పోలీసులు అతని మృతదేహాన్ని కొత్తూరు సమీపంలో కనుగొన్నారు. కొత్తూరు మండలం పంజర్ల పరిధిలోని ఒక ఓపెన్ వెంచర్‌లో రాజ్ కుమార్ శవమై కనిపించాడు. మృతదేహం పక్కనే పురుగుల మందు బాటిల్ లభ్యం కావడంతో, అతడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

పంజర్ల వెంచర్‌లో ఒక వ్యక్తి మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే ‘డయల్ 100’ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, అది షాబాద్ హంతకుడు రాజ్ కుమార్ దేనని అధికారికంగా ధ్రువీకరించారు. ఆరుగురి ప్రాణాలను బలిగొన్న నిందితుడు, పోలీసులకు దొరకకుండా ఇలా చనిపోవడం స్థానికంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.

Related News

భక్తి ముసుగులో రక్తి క్రీడ.. జూబ్లీహిల్స్‌లో గురూజీల నిజస్వరూపం బట్టబయలు!

హైటెక్స్ వేదికగా ‘సమాఖ్య-2026’ బిజినెస్ మీట్ ప్రారంభించిన సీఎం రేవంత్!

మందుబాబులకు బిగ్ షాక్.. మద్యం ధరలు పెంపు.. అధికారిక ఉత్తర్వులు జారీ!

2 లక్షల మందితో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ.. ఎందుకో క్లారిటీ ఇచ్చిన మహేష్ కుమార్ గౌడ్!

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

Big Stories

Advertisement
×