Rapido Rider: సాధారణంగా నగరాల్లో ప్రయాణాలు సులువు కావడానికి చాలా మంది ర్యాపిడో, బైక్ టాక్సీలను ఆశ్రయిస్తుంటారు. ఎండనక, వాననక కష్టపడి పని చేసే రైడర్లు.. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తుంటారు. కానీ, కొందరు చేసే పనులు మొత్తం వ్యవస్థకే మచ్చ తెస్తున్నాయి. కేవలం వంద రూపాయల కోసం ఒక యువతి.. కష్టపడి పనిచేసుకునే ర్యాపిడో రైడర్‌ను నడిరోడ్డుపై వేధించిన వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. పైగా తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి సదరు రైడర్‌పైనే తప్పుడు ఆరోపణలు చేస్తుంది.
అసలు ఏం జరిగిందంటే..?
ఒక యువతి తన గమ్యస్థానానికి చేరుకోవడానికి ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంది. రైడర్ ఆమెను ఆర్డర్ ప్రకారం కరెక్ట్ లొకేషన్‌లో డ్రాప్ చేశాడు. ప్రయాణం ముగిశాక యాప్ చూపించిన రూ. 100 ఛార్జీని ఇవ్వాల్సిందిగా రైడర్ సదరు యువతిని అడిగాడు. అక్కడే అసలు కథ మొదలైంది. ఆ వంద రూపాయలు ఇవ్వడానికి నిరాకరించిన యువతి.. రైడర్‌తో తీవ్రమైన గొడవకు దిగింది. అంతటితో ఆగకుండా నడిరోడ్డుపై అందరి ముందు అతడిని బూతులు తిడుతూ రెచ్చిపోయింది.
తప్పుడు కేసు పెడతానంటూ బెదిరింపులు
డబ్బులు అడిగినందుకు సదరు యువతి డిఫెన్స్‌లో పడకుండా అటాకింగ్ మోడ్‌లోకి వెళ్ళిపోయింది. రైడర్‌పై తీవ్రమైన తప్పుడు ఆరోపణలు చేయడం ప్రారంభించింది. “నువ్వు నాతో అసభ్యంగా ప్రవర్తించావు.. నిన్ను వదిలిపెట్టను” అంటూ బెదిరింపులకు దిగింది. కేవలం రూ. 100 ఎగ్గొట్టడం కోసమే.. ఆ రైడర్‌పై వేధింపుల కేసు పెడతానంటూ, పోలీసులకు పట్టిస్తానంటూ బ్లాక్‌మెయిల్ చేయడానికి ప్రయత్నించింది. ఈ కాలంలో అన్యాయంగా మహిళలపై జరిగే దాడుల గురించి వింటుంటాం, కానీ ఇక్కడ ఒక పురుషుడిపై మహిళే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం అక్కడున్న వారిని ఆశ్చర్యపరిచింది.
పోలీస్ స్టేషన్‌కు రమ్మన్నా వినకుండా..
యువతి ప్రవర్తనతో విసిగిపోయిన రైడర్, ఆమె డబ్బులు ఇవ్వకుండా పారిపోతుండటంతో వెంబడించాడు. “నేను తప్పు చేయలేదు.. నీకు అంతగా అనుమానం ఉంటే పోలీస్ స్టేషన్‌కు రా, అక్కడే తేల్చుకుందాం” అంటూ సవాల్ విసిరాడు. కానీ, తప్పు తన వైపే ఉండటంతో ఆ యువతి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోలేదు. అటు డబ్బులు ఇవ్వకుండా, ఇటు పోలీస్ స్టేషన్‌కు రాకుండా.. రైడర్‌ను తిడుతూనే అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయింది.
సోషల్ మీడియాలో వీడియో వైరల్
ఈ మొత్తం వ్యవహారాన్ని సదరు ర్యాపిడో రైడర్ తన మొబైల్‌లో రికార్డ్ చేశాడు. “నువ్వు నన్ను ఎందుకు తిడుతున్నావు? నా డబ్బులు నాకు ఇవ్వకుండా ఎందుకు వెళ్తున్నావు?” అని ప్రశ్నిస్తూ ఆమె వెనకాలే వెళ్ళి వీడియో తీశాడు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియా వేదికగా బయటకు రావడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ యువతి తీరుపై తీవ్రంగా మండిపడుతున్నారు. “రూ. 100 కోసం ఒకరి జీవితంతో, గౌరవంతో ఆడుకుంటారా?” అంటూ నెటిజన్లు సదరు యువతిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కష్టపడి పనిచేసే వారిని ఇలా వేధించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నారు.
Also Read: అస్సాంలో డ్రగ్స్ వేట.. రూ.472 కోట్ల మత్తు సామ్రాజ్యాన్ని తొక్కిపారేసిన సీఎం!
Peak Female Empowerment:
A Rapido rider in Hyderabad chased a woman who allegedly skipped the fare, abused him & threatened fake harassment. He calmly recorded & asked her to head to the police station. pic.twitter.com/VLaXxOvWtO
— VOICE FOR JUSTICE (@OfVoice8691) July 13, 2026