E-Paper
Advertisement

రూ.50 వేల బడ్జెట్.. చేతినిండా ఆదాయం.. 2026లో టాప్ బిజినెస్ ఐడియాస్ ఇవే!

రూ.50 వేల బడ్జెట్.. చేతినిండా ఆదాయం.. 2026లో టాప్ బిజినెస్ ఐడియాస్ ఇవే!
Advertisement

Business Ideas: దేశంలో నిరుద్యోగ సమస్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున యువత.. సరైన ఉద్యోగం లేక నిరాశ, నిస్పృహలో మునిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగం కోసం ఎదురుచూడకుండా.. సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచన ఉన్న వారి కోసం ఈ ప్రత్యేక కథనం అందించడం జరుగుతోంది. రూ.50,000 లేదా అంతకంటే తక్కువ పెట్టుబడితో ప్రారంభించగల టాప్-5 సక్సెస్ ఫుల్ బిజినెస్ ఐడియాలపై ఓ లుక్కేయండి.

టిఫిన్ సర్వీస్

ఇంట్లోని కిచెన్ ను ఆధారంగా రూ. 10,000 నుండి రూ. 20,000 పెట్టుబడితో ఈ టిఫిన్ సర్వీస్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మంచి నాణ్యత, శుభ్రత కలిగిన ఆహారాన్ని అందిస్తూ.. నెలవారీ సబ్ స్క్రిప్షన్ పద్దతిని తీసుకొస్తే.. తక్కువ సమయంలోనే పాపులర్ అవ్వొచ్చు.

విజ్ఞానాన్ని పంచే ట్యూటరింగ్

Advertisement

చదువుకు ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఏదైనా సబ్జెక్టుపై మంచి పట్టు ఉంటే ఇంట్లోనే ఉంటూ ఆన్‌లైన్ ద్వారా ట్యూషన్లు చెప్పవచ్చు. దీనికి అస్సలు పెట్టుబడి అవసరం లేదు. ఏదైనా ప్రకటనల కోసం కావాలంటే రూ.10-15 వేలు ఖర్చు చేస్తే సరిపోతుంది. డిజిటల్ లెర్నింగ్ మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ ఐడియాతో నెలకు రూ.వేలల్లో సంపాదించొచ్చు.

సృజనాత్మకతతో కూడిన ఫోటోగ్రఫీ

ఈ రోజుల్లో ప్రతి చిన్న ఈవెంట్‌ను కూడా కెమెరాలో బంధించడం ఒక ట్రెండ్‌గా మారిపోయింది. కాబట్టి ఫోటోగ్రఫీపై ఆసక్తి ఉంటే ఒక మంచి సెకండ్ హ్యాండ్ డీఎస్‌ఎల్‌ఆర్ (DSLR) కెమెరాను తీసుకోండి. దీనికి రూ. 40,000 వరకు ఖర్చు కావొచ్చు. కొనుగోలు అనంతరం బర్త్‌డే పార్టీలు, చిన్నపాటి ఫంక్షన్లు, ఇన్స్టాగ్రామ్ రీల్స్, ప్రొడక్ట్ షూట్స్ చేయడం ద్వారా క్రమంగా గుర్తింపు సంపాదించొచ్చు. ఈ ఫీల్డ్ కు మీ ప్రతిభే పెద్ద ఎత్తున ఆదాయాన్ని తీసుకొస్తుంది.

ఫ్రాంచైజ్ బిజినెస్

Advertisement

సాధారణంగా ఫ్రాంచైజ్ అనగానే రూ.లక్షల్లో పెట్టుబడి అవసరమని చాలా మంది భావిస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్లో టీ స్టాళ్లు, లోకల్ ఐస్‌క్రీమ్ బ్రాండ్లు, కొరియర్ సర్వీస్ లు అందుబాటులోకి వచ్చాయి. రూ. 50,000 లోపు సెటప్ కాస్ట్‌తో ఫ్రాంచైజీని పొందొచ్చు. అప్పటికే మీరు పొందిన బ్రాండ్ కు మార్కెట్లో మంచి ఉండటం వల్ల.. మార్కెటింగ్ కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండానే కస్టమర్లను ఆకర్షించొచ్చు.

Also Read: కిటికీలకు అల్యూమినియం ఫాయిల్.. నిజంగానే ఇల్లు చల్లబడుతుందా? సైన్స్ ఏం చెబుతోంది?

కోడింగ్ సేవలు

ప్రస్తుతం కోడింగ్ ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. వెబ్ డిజైనింగ్, యాప్ డెవలప్‌మెంట్ వంటి వాటి కోసం కోడింగ్ వస్తే.. ఒక లాప్‌టాప్, ఇంటర్నెట్ కనెక్షన్‌తో ఫ్రీలాన్స్ వ్యాపారాన్ని ప్రారంభించొచ్చు. చిన్న వ్యాపారాల కోసం వెబ్‌సైట్లు తయారు చేయడం, యాప్స్ రూపకల్పన చేయడం ద్వారా భారీగా సంపాదించవచ్చు. ఇందుకోసం ఎలాంటి ఆఫీస్ స్పేస్ అవసరం లేకుండా ఇంటినే మీ వర్క్ స్పేస్ గా మార్చేయండి.

Also Read: 5G వద్దు.. 4Gనే ముద్దు అనుకునేవారికి.. జియో అదిరిపోయే బడ్జెట్ ప్లాన్స్ ఇవే!

Related News

పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. EPFO ​ఎందుకు ​సలహా ఇచ్చింది?

సెప్టెంబరు నెలలో బ్యాంకులకు సెలవులే సెలవులు, మూడు రోజుల సమ్మె కూడా

సినిమా థియేటర్లలో కునుకు సేవలు.. ఉద్యోగులను ఆకట్టుకున్న స్కీమ్, అన్నీ ఉచితంగానే

మోదీ ప్రభుత్వం రూ. 5 లక్షల క్రెడిట్ కార్డు ఆఫర్.. ప్రయోజనాలు తెలుసా? ఎవరు పొందుతారు?

డిగ్రీ లేకపోయినా రూ.1 లక్షకు పైగా జీతం.. ఎలా సంపాదిస్తున్నాడంటే

లారీ డ్రైవర్ కుమారుడు.. కాలేజీ చదువులో ఫెయిల్.. కట్ చేస్తే రూ.800 కోట్ల కంపెనీ ఓనర్

లోన్ యాప్‌లో అప్పు తీసుకుంటున్నారా? జాగ్రత్త ఫేక్ యాప్స్‌తో ప్రమాదం.. ఈ జాగ్రత్తలు పాటించండి

ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై ఇక హెచ్చరిక లేబుల్స్.. కీలక ప్రతిపాదన చేసిన FSSAI!

Big Stories

Advertisement
×