BigTV English

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

– హన్మకొండలో బీఆర్ఎస్ నేత శంకర్ నాయక్ భూ దందా
– రాంపూర్ శివారులో దళితుల భూములపై కన్ను
– వరంగల్, హైదరాబాద్ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న భూములు
– పెట్రోల్ బంక్ కోసం దళితుల భూముల ఆక్రమణ
– ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు దిగిన శంకర్ నాయక్
– గతంలో పోలీసులకు బాధితుల ఫిర్యాదు
– కక్షగట్టి ఇళ్లు కూల్చేయడంతో రోడ్డునపడ్డ దళితులు


Land Encroachment: బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ భూదందా బాగోతాలు అన్నీ ఇన్నీ కావు. పదేళ్లు అధికారంలో ఉండి దళితుల భూములపై కన్నేసి వాటిని చెరపట్టారు. ఇప్పుడు ప్రభుత్వం మారాక, బాధితులందరూ ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. తమ భూములను, మమ్మల్ని కాపాడండి అంటూ కన్నీరుమున్నీరవుతున్నారు.

దళితుల భూముల్లో పాగా


వరంగల్, హైదరాబాద్ జాతీయ రహదారికి ఆనుకుని రాంపూర్ శివారులో కొంతమంది దళితుల భూములు ఉన్నాయి. వీటిపై శంకర్ నాయక్ కన్నుపడింది. అప్పట్లో అధికారం తమదే కదా అని చెలరేగిపోయారు. 20 ఏళ్లుగా అక్కడ ఉంటున్న స్థానికుల భూములు లాగేసుకున్నారు. మరికొందరికి డబ్బు ఆశ చూపి భూములు లాక్కున్నారు. డబ్బులు అడిగితే బెదిరింపులకు దిగారు. ఇలా శంకర్ నాయక్ దౌర్జాన్యానికి బలైన బాధితులు బయటకు వస్తూ తమ గోడు వెల్లబోసుకుంటున్నారు.

మాయ మాటలతో రోడ్డున పడేసిన శంకర్ నాయక్

ప్రసన్న కుమారి అనే మహిళకు మరో భూమి ఇప్పిస్తానంటూ ఇంటిని కూలగొట్టారు. డబ్బులు ఇవ్వలేదు సరికదా ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారంటూ భాధితులు వాపోతున్నారు. ఇళ్లు లేక రోడ్డుపై గుడిసెల్లో నివసిస్తున్నారు. రాంపూర్‌కి చెందిన మునిగల రాజుకు 339/7 సర్వే నెంబర్‌లో 20 గంటల భూమి ఉంది. ఆ భూమిని ఆక్రమించి, సర్వే నెంబర్ సైతం ధరణిలో లేకుండా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన భూమిని ఆక్రమించి పెట్రోల్ బంక్ నిర్మాణం చేస్తున్నారని బాధితుడు చెబుతున్నాడు. గతంలో ఈ వ్యవహారంపై శంకర్ నాయక్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా కూడా పోలీసులు పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Also Read: Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

ఇళ్లు కూల్చేసి దందా

ముత్యాలు అనే దళిత కుటుంబానికి గతంలో కాంగ్రెస్ సర్కార్ 80 గజాల ఇంటి స్థలం ఇచ్చింది. ఆ భూమిపైనే ఆ కుటుంబం కాలం వెల్లదీస్తోంది. ఇప్పుడు దానిని కూడా చెరబట్టారు శంకర్ నాయక్. ప్రశ్నిస్తే చంపేస్తానని బెదిస్తున్నారని బాధితుడు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి ఎలాగైనా తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. శంకర్ నాయక్ ఆక్రమణ ఎలా ఉందంటే, భర్త, కొడుకును పొగొట్టుకున్న వృద్ధురాలిపై కూడా కనికరం చూపలేదు. యాక్సిడెంట్‌లో భర్తను కోల్పోయి పుట్టెడు దుఖంలో ఉన్న నాగమ్మ ఇంటిని కూల్చేశారు. దీంతో మనస్తాపం చెందిన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. భర్తను, కొడుకును పొగొట్టుకున్న నాగమ్మ తమకు న్యాయం చేయాలని కోరుకుంటోంది.

రోడ్ సైడ్ స్థలం కోసం స్కెచ్

నిజానికి సర్వే నెంబర్ 340లో శంకర్ నాయక్‌కి పట్టా భూమి ఉంది. కానీ, మెయిన్ రోడ్ సైడ్ తనకి ల్యాండ్ లేదు. అయితే, శంకర్ నాయక్ కట్టాలనుకుంటున్న పెట్రోల్ బంక్‌కు మెయిన్ రోడ్ పక్కన స్థలం కావాలి. దీంతో సర్వే నెంబర్ 339 లోని భూములపై కన్నేశారు. ఇంకేముంది, అప్పట్లో ప్రభుత్వం తమదే అని రెచ్చిపోయారు. ఆ సర్వే నెంబర్లు తనవే అని చెప్తూ బాధితుల నెంబర్లు ధరణిలో లేకుండా చేశారు. దర్జాగా కబ్జా చేయడమే కాకుండా ఆ స్థలాల్లో అనుచరులను దింపి పనులు చేయించుకుంటున్నారు. ఇదేంటని ప్రశ్నించిన బాధితులపై బెదిరింపులకు దిగారు శంకర్ నాయక్, ఆయన అనుచరులు.

Related News

Padi Kaushik Reddy: అమ్మతోడు వెయ్యి మందితో దాడి చేస్తా.. సొంత పార్టీ నేతలకు పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్

Breakfast: విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. సర్కార్ బడుల్లో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌

BJP Candidate: జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి ఎవరంటే..?

Naveen Yadav: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. నవీన్ యాదవ్‌కు అనుకూల అంశాలేంటి..? గెలుపు శాతమెంత..?

CM Revanth: ప్రభుత్వ వెల్ఫేర్ సొసైటీలకు.. రేవంత్ సర్కార్ స్పెషల్ ఫండ్

Telangana Maoist Surrender: ముగ్గురు మావోయిస్టులు లొంగిపోయారు-డీజీపీ

Jubilee Hills bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. బీజేపీ అభ్యర్థి బిఆర్ఎస్సే, డీల్ మామూలుగా లేదుగా

Hyderabad News: హైదరాబాద్‌‌‌ను వణికిస్తున్న జంతువులు.. మొన్న కొండ చిలువ, ఇప్పుడు 12 అడుగుల భారీ మొసలి

Big Stories

×