Bigg Boss 8 Telugu Latest Updates: బిగ్ బాస్ సీజన్ 8లో రేషన్ కోసం టాస్కులు పూర్తయిన తర్వాత ఎగ్స్ టాస్క్ మొదలుపెట్టాడు బిగ్ బాస్. ఆ టాస్క్ మొదలయినప్పటి నుండి బిగ్ బాస్ హౌస్.. ఒక WWE సెట్‌లాగా మారిపోయింది. సమయానుసారం హౌస్‌లోకి కొన్ని ఎగ్స్ వస్తాయి. ఎవరి టీమ్స్ సంపాదించుకున్న ఎగ్స్‌ను ఆయా టీమ్స్ కాపాడుకోవాలి, దాచిపెట్టుకోవాలి. దాంతో ఒక టీమ్ సంపాదించుకున్న ఎగ్స్ కోసం మరొక టీమ్ పోటీపడడం మొదలయ్యింది. నిఖిల్, పృథ్వి.. ఇద్దరూ విచక్షణ కోల్పోయారు. ముఖ్యంగా నిఖిల్ అయితే సోనియా చేతిలో కీలుబొమ్మగా మారి ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితికి వచ్చేశారు.
ప్రతాపం చూపించాడు
ఎగ్స్ టాస్క్‌లో మొదటి రౌండ్ పూర్తయ్యే సమయానికి నిఖిల్ టీమ్ గెలిచింది. దీంతో అభయ్ టీమ్‌లో నుండి ఒక సభ్యుడిని తీసేసే అవకాశమిచ్చారు బిగ్ బాస్. నిఖిల్ టీమ్ అంతా కలిసి నబీల్‌ను తొలగించగా తను సంచాలకుడిగా మారాడు. రెండో రౌండ్ పూర్తయ్యే సమయానికి అభయ్ టీమ్ ఎక్కువ ఎగ్స్‌ను సంపాదించుకోగలిగింది. కానీ మూడో రౌండ్‌లో మళ్లీ రచ్చ మొదలయ్యింది. ఒకరి టీమ్ దగ్గర ఉన్న ఎగ్స్‌ను మరొక టీమ్ లాక్కోవద్దు అని చెప్పినా కూడా సోనియా వెళ్లి అభయ్ టీమ్ దగ్గర ఉన్న ఎగ్స్‌ను లాక్కుంది. దీంతో గొడవ మొదలయ్యింది. సోనియా ఏం చెప్పినా వింటూ అభయ్ టీమ్‌పై తన ప్రతాపం చూపిస్తున్నాడు నిఖిల్. దీంతో అలా చేయడం కరెక్ట్ కాదని నిఖిల్‌ను హెచ్చరించాడు అభయ్.
Also Read: సోనియా లవర్ గురించి బయట పడ్డ నిజం.. ఆల్రెడీ పెళ్లి అయిపోయిందా?
ప్రేరణను తప్పించారు
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న అబ్బాయిలు అందరితో పోలిస్తే నాగ మణికంఠ కాస్త వీక్. దీంతో నిఖిల్, పృథ్వి కలిసి తనను ఎగ్స్ కలెక్ట్ చేయనివ్వకుండా ఒక్క చేతితోనే కంట్రోల్ చేస్తున్నారు. అదే క్రమంలో నిఖిల్ వల్ల మణి తలకు గాయం కూడా జరిగింది. తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో తన ప్రతాపం అంతా మణిపై చూపించాడు పృథ్వి. దీంతో మణి ఏడ్చాడు. అమ్మాయిలాగా ఏడవకు అంటూ మణికంఠను పర్సనల్ అటాక్ చేశాడు పృథ్వి. అయినా కూడా తను వెనక్కి తగ్గకుండా ఆడాడు. నిఖిల్ టీమ్ చేస్తున్న అన్యాయం చూసి అభయ్‌తో సహా తన టీమ్ సభ్యులంతా ఆట ఆడకూడదని డిసైడ్ అయ్యారు. దీంతో తరువాతి రౌండ్‌లో కూడా వారు ఓడిపోయారు. అప్పుడు ప్రేరణను ఆట నుండి తప్పించాలని నిఖిల్ టీమ్ నిర్ణయించారు.
కిచెన్ కష్టాలు
సోనియా చేతిలో నిఖిల్ కీలుబొమ్మగా మారాడని హౌస్‌మేట్స్ అందరికీ అర్థమయ్యింది. సోనియా కాస్త డల్‌గా ఉండగానే అన్నింటిని పక్కన పెట్టేసి వెళ్లి తనను ఓదార్చడమే పనిగా పెట్టుకుంటున్నాడు నిఖిల్. తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో ఎవరి టీమ్ సభ్యులు వారి టీమ్ కోసమే వంట చేయాలని, అది కూడా ముగ్గురే చేయాలని, దానికి కూడా టైమ్ లిమిట్ ఉంటుందని తెలిపారు బిగ్ బాస్. దీంతో నిఖిల్ టీమ్ ముందుగా టిఫిన్, లంచ్ ఒకేసారి చేయాలని నిర్ణయానికి వచ్చింది. తర్వాత సోనియా చెప్పిన మాట విని తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు నిఖిల్. దీంతో తాను ఎంత చెప్తున్న నిఖిల్ వినడం లేదని, సోనియా చెప్పినట్టే చేస్తున్నాడని అభయ్ వ్యాఖ్యలు చేశాడు.