BigTV English

Sharmila: కల్లు తాగిన షర్మిల.. టేస్ట్ ఎలా ఉందంటే…

Sharmila: కల్లు తాగిన షర్మిల.. టేస్ట్ ఎలా ఉందంటే…

Sharmila: రాజకీయ నేతల అవస్థలు అన్నీఇన్నీ కావు. ఎన్నికల ప్రచారం, పాదయాత్ర తదితర సందర్భాల్లో ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ సీన్లు. మిర్చి బజ్జీలు వేయడం, ఇస్త్రీ చేయడం, పిల్లలకు స్నానాలు చేయించడం.. ఇలాంటి ఆసక్తికర దృశ్యాలన్నీ కనిపిస్తుంటాయి. ఓటరు దేవుడ్ని ప్రసన్నం చేసుకునేందుకు నానాతంటాలు పడుతుంటారు పొలిటికల్ లీడర్లు.


లేటెస్ట్ గా వైఎస్ షర్మిల పాదయాత్రలో అలాంటి సీనే కనిపించింది. షర్మిలకు ఓ కల్లు గీత కార్మికుడు అభిమానంతో కల్లు ఆఫర్ చేశాడు. ఆ గౌడన్న రిక్వెస్ట్ ను షర్మిల కాదనలేక పోయారు. వెంటనే షర్మిల చేతికి తాటి ఆకు ఇచ్చాడు.. అదెలా పట్టుకోవాలో చూపించాడు.. అందులో కల్లు పోయగా.. షర్మిల రెండు సిప్పులు టేస్ట్ చూశారు.

కల్లు మొదటి సిప్ తాగగానే.. షర్మిల ముఖం వెరైటీగా పెట్టారు. బహుషా పుల్లగా ఉన్నట్టుంది.. ఫేస్ ఎక్స్ ప్రెషన్ మారిపోయింది. గీత కార్మికుడు మరోసారి లొట్టిలోని కల్లు.. షర్మిలకు పోయగా.. మరోసారి టేస్ట్ చూశారు. ఈసారి కూడా అదే ఎక్స్ ప్రెషన్. మొదటిసారి తాగారో ఏమో.. ఆమెకు కల్లు టేస్ట్ వింతగా అనిపించినట్టుంది. బాగుంది.. అంటూనే.. ఇక చాలు చాలు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు షర్మిల. ఆమె కల్లు తాగిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. గౌడన్నకు గౌరవం ఇస్తూ కల్లు తాగినందుకు షర్మిలను అభినందిస్తున్నారు గీత కార్మికులు.


Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×