BigTV English

Singer Sunitha: ప్రెగ్నెంట్ వార్త‌ల‌పై సింగ‌ర్ సునీత్ రియాక్ష‌న్‌

Singer Sunitha: ప్రెగ్నెంట్ వార్త‌ల‌పై సింగ‌ర్ సునీత్ రియాక్ష‌న్‌

Singer Sunitha:సింగ‌ర్ సునీత మ‌ళ్లీ త‌ల్లి కాబోతున్నారా? ఏమో ఈ విష‌యం ఆమెకే తెలియ‌ద‌ట‌. అస‌లు ఏం జ‌రిగింది? సునీత ప్రెగ్నెంట్ అంటూ వార్త‌ల‌ను ఎవ‌రు జ‌న‌రేట్ చేశారు? దానికి ఆమె ఎలా రియాక్ట్ అయ్యార‌నే వివ‌రాల్లోకి వెళితే.. కొన్ని రోజుల ముందు సింగ‌ర్ సునీత ప్రెగ్నెంట్ అంటూ నెట్టింట కొంద‌రు వార్త‌ల‌ను ప్ర‌చారం చేశారు. ఆ వార్త నిజంగానే సునీత‌కు తెలియ‌దు. రీసెంట్‌గా ఆమె చెన్నైలో మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా లైవ్ క‌న్‌స‌ర్ట్‌కి వెళ్లిన‌ప్పుడు అక్క‌డున్న మీడియా ప్ర‌తినిధి అడిగారు. మీపై స్ప్రెడ్ అవుతున్న రూమ‌ర్‌పై ఎలా రియాక్ట్ అవుతారంటూ సునీత‌ను ప్ర‌శ్నించగా ఆమె ఏంటా రూమ‌ర్ అని అన్నారు. మీరు ప్రెగ్నెంట్ అని వార్త‌లు వ‌చ్చాయి క‌దా! అని అడిగితే.. దానికి ఆమె స్పందిస్తూ.. ‘‘నేను ప్రెగ్నెంటా? ఆ విష‌యం నాకు తెలియ‌దే. అయినా ఆ వార్త‌.. రూమ‌ర్ క్రియేట్ చేసిన వ్య‌క్తి ఆలోచ‌న స్థాయిని తెలియచేస్తుంది. నాకు లైఫ్‌కు సంబంధించిన వార్త కాదు’’ అని సింపుల్‌గా ఆమె సమాధానం చెప్పేశారు.


సునీత్ ఉన్న‌ది ఉన్న‌ట్లుగా స‌మాధానం చెప్పేయటంతో ఆమెపై వ‌సున్న రూమ‌ర్స్‌కి బ్రేక్ ప‌డ్డ‌ట్లు అయ్యింది. వాలెంటైన్స్ డేను ఎలా సెల‌బ్రేట్ చేసుకుంటార‌ని ప్ర‌శ్నిస్తే దానికి ఆమె స్పందిస్తూ ప్ర‌తిరోజు లాగానే వాలెంటైన్స్ డే జ‌రుగుతుంది. మా ఆయ‌నే నాకు ఫ్ల‌వ‌ర్ బోకే ఇవ్వాల‌ని నేను కోరుకోవ‌టం లేదు. కుదిరితే నేను ఆయ‌న‌కు బోకే ఇస్తాను. జెంట్స్ మాత్ర‌మే లెడీస్‌కు ఫ్ల‌వ‌ర్స్ ఇవ్వాల‌ని ఎందుకు అనుకోవాలి.. దాన్ని మార్చేద్దాం అంటూ ఆమె రియాక్ట్ అయ్యింది.

ఇదే సంద‌ర్బంలో ఇళయ రాజా లైవ్ క‌న్‌స‌ర్ట్ గురించి ఆమె మాట్లాడుతూ రాజాగారికి 80 వ‌సంతాలు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న మ‌న‌కు వెయ్యేళ్ల‌కు స‌రిప‌డే సంగీత సంప‌ద‌ను ఇచ్చారు. ఆయ‌న అభిమానిగా లైవ్ క‌న్‌స‌ర్ట్‌లో పాల్గొన‌టం ఎంతో ఆనందంగా ఉందంటూ ఆమె త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేశారు.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×