BigTV English

Hyderabad: పబ్లిక్ ప్లేసుల్లో రొమాస్స్.. జంటలను అదుపులోకి తీసుకున్న షీ టీమ్..

Hyderabad: పబ్లిక్ ప్లేసుల్లో రొమాస్స్.. జంటలను అదుపులోకి తీసుకున్న షీ టీమ్..
romance in public places in hyderabad
romance in public places in hyderabad

Romance In Public Places In Hyderabad: హైదరాబాద్‌లోని పలు పబ్లిక్ పార్కుల్లో చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఓ సమస్యపై పోలీసులు నిఘా పెట్టారు. సాయంత్రం సమయంలో సేద తీరేందుకు, తల్లిదండ్రులు తమ చిన్నారులతో సరదాగా గడిపేందుకు వెళ్తుంటారు. అయితే చాలా మందికి అక్కడి వచ్చే జంటలు చేస్తున్న పనులు తీవ్ర ఇబ్బందికరంగా మారాయి.


తమను ఎవరు చూస్తారులే అనే ధైర్యమో లేక ఎవరు చూసినా ఏం పర్లేదులే అనే తెగింపో తెలియదు గానీ.. నేటి యువ జంటలు పార్కుల్లో రెచ్చిపోతున్నారు. బెంచీల మీద కూర్చుంటూ, పొదల సమీపంలో పబ్లిక్ గానే రొమాన్స్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా నగరంలోని ఇందిరా పార్క్, కృష్ణకాంత్‌పార్క్‌, నెక్లెస్ రోడ్ ప్రాంతాల్లో ఇలాంటి దృశ్యాలు మనకి తరచూ కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఆ ప్రేమ మైకంలో తేలిపోతున్న జంటలకు మామూలుగానే కనిపిస్తాయి.

Read More: కవిత మెడకు బిగుస్తున్న లిక్కర్ కేసు ఉచ్చు.. ఢిల్లీ వెళ్తే ఇక అరెస్టేనా ?


కానీ చూసేవారికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ముఖ్యంగా ఆ దృశ్యాలు చిన్నారుల కంట పడితే వారికి లేనిపోని ఆలోచనలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆఫీసుల్లో పనులు పూర్తి చేసుకొని వాకింగ్ చేసేందుకు వచ్చే పెద్ద వారికి కూడా ఇది కాస్త ఇబ్బంది కగిలించే విషయమే.

అయితే దీనిని కట్టడి చేసేందుకు గతంలో ఇందిరా పార్క్ యాజమాన్యం కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ.. అది వివాదస్పదంగా మారింది. పార్కులో ప్రశాంత వాతావరణం దెబ్బతినకుండా ఉండేందుకు పార్క్ యాజమాన్యం 2021 ఆగస్టులో ‘పెళ్లి కాని జంటలకు ప్రవేశం లేదు’ అని పార్క్ బయట బోర్డు పెట్టింది. కాని ఇది వివాదంగా మారడంతో.. పార్కు యాజమాన్యం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

దీని వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని గ్రహించిన షీ టీమ్స్.. ఫిబ్రవరి 23న రంగంలోకి దిగాయి. పార్కులతో పాటు ఇతర బహిరంగ ప్రదేశాల్లో అనుచితంగా ప్రవర్తిస్తున్న 12 మందిని షీ టీమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్, కృష్ణకాంత్ పార్క్‌తో పాటు పలు పబ్లిక్ ప్లేసుల్లో జంటలను అధికారులు పట్టుకున్నారు.

బహిరంగ ప్రదేశాల్లో మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని కౌన్సిలింగ్ ఇచ్చారు. 12 మందికి ఫైన్ వేసి పంపించారు. పబ్లిక్ ప్లేసుల్లో సామాన్యులకు ఇబ్బంది కలిగించే పనులు చేయకూడదని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పబ్లిక్ ప్లేసుల్లో ఇక నుంచి తమ నిఘా ఉంటుందని షీ టీమ్ అధికారులు వెల్లడించారు.

Tags

Related News

Telangana New Liquor Shop: తెలంగాణలో కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే!

Srushti Hospital: సృష్టి ఫెర్టిలిటీ వ్యవహారంలోకి ఈడీ ఎంట్రీ

IAS Smita Subraval: చర్యలు తీసుకోవద్దు!! హైకోర్టులో స్మితా సబర్వాల్‌కు ఊరట

CBI ON Kaleshwaram: రంగంలోకి దిగిన సీబీఐ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రాథమిక విచారణ

Indigo Flight: శంషాబాద్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం.. గాల్లో ఉండగా

Hyderabad News: తెలుగు తల్లి కాదు.. ఇకపై తెలంగాణ తల్లి ఫ్లైఓవర్, పేరు మార్చిన జీహెచ్ఎంసీ

Group-1 Result: తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు విడుదల.. టాప్-10 అభ్యర్థులు, వారికే ఆర్డీవో పోస్టులు

Keesara News: సినిమా స్టైల్‌లో ఇంట్లోకి వెళ్లి.. నవవధువును ఈడ్చుకుంటూ కారులోకి..? వీడియో వైరల్

Big Stories

×