OTT Movie : నడిరాత్రి… న్యూ మెక్సికో ఎడారిలో ఒక రహదారి. దానిపై ఒక ఒంటరి యువతిని హెడ్‌లైట్లు ఆన్ చేసి ఉన్న కారు ఆమెను వెంబడిస్తుంటే, భయంతో పరిగెత్తుతోంది. ఆమె చేతిలో ఒక గన్, కానీ బుల్లెట్ ఒక్కటే. దూరంగా ఒక షెరీఫ్ కారు సైరన్ శబ్దం వినిపిస్తోంది. ఇంతకీ ఆ కారు ఆమెను ఎందుకు వెంబడిస్తోంది? ఆమె బతుకుతుందా, లేక ఈ ఎడారి ఆమెను మింగేస్తుందా? ఈ రాత్రి ఆమెకు తెలిసిన భయంకరమైన రహస్యం ఏంటి? ఈ సైకలాజికల్ సైకో థ్రిల్లర్ మూవీ ఏ ఓటీటీలో ఉంది? అనే వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి.
కథలోకి వెళ్తే…
బాబీ టోర్రెస్ (బ్రిట్నీ కామాచో) ఒక చిన్న దొంగ. 1977 ఫోర్డ్ మస్టాంగ్ కారులో న్యూ మెక్సికో ఎడారి గుండా తన టాక్సిక్ ప్రియుడు రెట్ వద్దకు తిరిగి వెళ్తుంది. ఆమె సోదరి అన్నా (వ్యోమి రీడ్) ఆమెను ఈ సంబంధం నుండి బయటపడమని హెచ్చరిస్తుంది. కానీ బాబీ తన గతాన్ని వదిలిపెట్టడానికి సంకోచిస్తుంది. ఇక ఈ ప్రయాణంలో ఒక రిమోట్ గ్యాస్ స్టేషన్ వద్ద, ఆమె షెరీఫ్ బిల్‌స్టీన్ (జాన్ ష్వాబ్)ను కలుస్తుంది. అతను చూడడానికి చాలా ఫ్రెండ్లీగా కనిపిస్తాడు. కానీ త్వరలోనే అతని నిజ స్వరూపం ఏంటో బయట పడుతుంది. బిల్‌స్టీన్ ఒక సైకోపాతిక్ షెరీఫ్, తన అధికారాన్ని ఉపయోగించి ఒంటరి యువతులను టార్గెట్ చేస్తాడు.
అలాగే ఇప్పుడు బాబీని స్పీడ్ గా వెళ్తోంది అనే ఆరోపణతో ఆపి, ఆమె ఫోన్ ను తీసుకుంటాడు. అంతేకాదు ఆమె కారు లైట్లను షూట్ చేస్తాడు. దీనితో ఆమె ఎడారిలో చిక్కుకుంటుంది. ఈ క్రమంలోనే బాబీ ఒక డైనర్‌కు చేరుకుంటుంది. అక్కడ వెయిట్రెస్ అమీ (సిడ్నీ బ్రమ్‌ఫీల్డ్) ఆమెకు సహాయం చేస్తుంది. కానీ మరోవైపు బిల్ స్టీన్ ఆమెను వెంబడిస్తాడు. దీంతో ఆమె తన ప్రియుడు రెట్ కు ఫోన్ చేస్తుంది. కానీ అతను ఆమెను తప్పుగా అర్థం చేసుకుని సహాయం చేయడానికి నిరాకరిస్తాడు.
ఈ నేపథ్యంలోనే కథ ఇంట్రెస్టింగ్ మలుపు తిరుగుతుంది. బిల్ స్టీన్ ఆమెను ఒక హత్యకు ఫ్రేమ్ చేస్తాడు. చూస్తుండగానే ఆమెను మరింత గందరగోళంలో పడేస్తాడు. ఎలాగోలా అతని నుంచి తప్పించుకుని బాబీ ఒక స్క్రాప్ యార్డ్‌కు చేరుకుంటుంది. అక్కడ ఆమె ఎడ్ అనే అటెండెంట్‌ను కలుస్తుంది. కానీ షెరీఫ్ ఆమెను మళ్లీ కనిపెడతాడు. ఈ భయంకరమైన వేటలో బాబీ తన గత జీవితంలోని రాబరీ స్కిల్స్ ను ఉపయోగించి, ఈ క్రూరమైన షెరీఫ్‌తో పోరాడటానికి సిద్ధం అవుతుంది. ఎడారి నేపథ్యంలో ఉత్కంఠభరితంగా సాగే ఈ ఛేజ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లవర్స్ కు మంచి థ్రిల్ ఇస్తుంది. ఇంతకీ ఆ షరీఫ్ కు అమ్మాయిలంటే చంపే అంత ద్వేషం ఎందుకు? చివరికి హీరోయిన్ అతని నుంచి తప్పించుకోగలిగిందా లేదా? అనేది మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : దెయ్యం సాయంతో వందల కోట్లు… కానీ చివరికి అడిచ్చే ట్విస్టుకు గుండె గుభేల్
ఏ ఓటీటీలో ఉందంటే?
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు ‘The Blood Star’. 2024లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం Apple TV లో అందుబాటులో ఉంది. ఈ ఓటీటీలో ఈ మూవీ రెంట్ కి అవైలబుల్ గా ఉంది. లారెన్స్ జాకోమెల్లి ఈ మూవీతోనే దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో జాన్ ష్వాబ్, బ్రిట్నీ కామాచో మెయిన్ లీడ్స్ గా నటించారు.