BigTV English

Former SIB Prabhakar Rao: ఏ తప్పూ చేయలేదు.. ముందస్తు బెయిలివ్వండి

Former SIB Prabhakar Rao: ఏ తప్పూ చేయలేదు.. ముందస్తు బెయిలివ్వండి
 

Former SIB Prabhakar Rao: చాలా రోజుల తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో విదేశాల్లో ఉన్న ప్రభాకర్ రావు.. ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తాను ఏ తప్పు చెయ్యలేదని, ఈ కేసులో తనను కావాలనే అక్రమంగా ఇరికించారని పేర్కొన్నారు. 30 ఏళ్లకు పైగా పోలీస్ అధికారిగా ఉండి.. వివిధ హోదాల్లో అంకితభావంతో పనిచేశానని తెలిపారు. వామపక్ష తీవ్రవాదం, ఇస్లామిక్ టెర్రరిజంను కట్టడి చేయడంలో కీలకపాత్ర పోషించినట్లు వెల్లడించారు. తన ప్రతిపని చూసే SIB పోస్టింగ్ ఇచ్చారు.. కానీ కులంపరంగా కాదు అంటున్నారు. తనకు అసాంఘిక శక్తుల నుంచి త్రెట్ ఉందని.. గత ప్రభుత్వంలోనే భద్రత పెంచారని ప్రభాకర్ రావు చెబుతున్నారు. తన సర్వీసు మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా సార్లు ప్రశంసలు కూడా అందుకున్నాని తెలిపారు.


తాను క్యాన్సర్‌తో పాటు లంగ్స్ ఇన్పెక్షన్లతో బాధపడుతున్నాను. అమెరికాకు వచ్చింది పారిపోవడం కోసం కాదు.. చికిత్స కోసం వచ్చానని ప్రభాకర్ రావు పిటిషన్‌లో తెలిపారు. తాను పారిపోయానంటూ తనపై ముద్రవేయడం సరికాదు.. ఎక్కడికి పోలేదు అంటూ స్పష్టం చేషారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో గత ఏడాది ఏప్రిల్‌లో నిందితుడిగా చేర్చారు కానీ.. మార్చి 11నే అమెరికాకు వచ్చానని తెలిపారు. పోలీసులు తన ఇంట్లో తనిఖీ చేసిన ఒక్క ఆధారం దొరకలేదు. నిందితుల కనిఫిషెన్స్ స్టేట్మెంట్లు తప్పా.. తనకు వ్యతిరేఖంగా ఒక్క ఎవిడెన్స్ లేదంటున్నారు ప్రభాకర్ రావు. ఇప్పటికే పలుమార్లు దర్యాప్తు అధికారులను సంప్రదించాను. కాంటాక్ట్ డిటైల్స్ ఇచ్చాను. ఇ మెయిల్ ద్వారా, ఫోన్ల ద్వారా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్‌తో అప్రోచ్ అయ్యాను. కానీ తనను విచారించలేందన్నారు.

దర్యాప్తుకు సహకరిస్తానని చెప్పిన కూడా.. కావాలని తన పేరును ఛార్జ్ షీట్‌లో మెన్షన్ చేశారని పేర్కొన్నారు. తనను విచారణ చేయడానికి ఏ విషయం లేదు.. ఆల్రెడీ విచారణ అయిపోయింది. ఎక్కడా కూడా పొలిటికల్‌గా ఎవరు ఫోన్లు ట్యాప్ చెయ్యలేదని పేర్కొన్నారు.  తనకు 65 ఏళ్ల వయసు ఉందని అనారోగ్యంతో బాధపడుతున్నానని పిటిషన్ లో పేర్కొన్నారు. తాను వైద్యం కోసమే అమెరికా వెళ్లానని.. నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశానని తెలిపారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవని స్పష్టం చేశారు.


Also Read: క్లిష్టంగా మారిన బెట్టింగ్ యాప్స్ నియంత్రణ.. లోకల్ ఇన్‌ఫ్లూయెన్సర్లు, విదేశీ నిర్వహకులే కారణం

తాను అమెరికా వెళ్లినప్పటికీ దర్యాప్తు అధికారితో టచ్‌లో ఉన్నానంటున్నాని వెల్లడంచారు. ఈ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు కాబట్టి.. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నానని తెలిపారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ సోమవారం హైకోర్టులో జరగనుంది. మొదటిసారి తెలంగాణ హైకోర్టులో.. ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్ ధాఖలు చేయడంతో విచారణ కొంత కీలకంగా మారింది.

 

Related News

Jewelers robbery case: జ్యువెలర్స్ దోపిడీ కేసులో పురోగతి.. హైదరాబాద్ శివారులో ఈ డేంజర్ దొంగలు?

Holidays: ఈ వారంలో మళ్లీ వరుసగా 3 రోజులు సెలవులు.. ఇదిగో హాలిడేస్ లిస్ట్

Weather News: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండు రోజులు ఈ జిల్లాల్లో కుండపోత వర్షం

Hyderabad Rains: రైన్ అలర్ట్.. ఆఫీసుల నుంచి త్వరగా ఇంటికి వెళ్లిపోండి, లేకుంటే చిక్కుకుపోతారు!

Telangana: అడ్వకేట్ వామనరావు దంపతుల కేసు.. ఇకపై సీబీఐ చేతికి, సుప్రీంకోర్టు ఆదేశం

KTR Vs Sanjay: బండి సంజయ్‌కు కేటీఆర్ నోటీసులు.. కేవలం వారం గడువు

Big Stories

×