Low Investment Business: మీరు తక్కువ పెట్టుబడితో తక్కువ పని ఉన్న వ్యాపారం చేయాలని ఆలోచిస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. అంతేకాదు ఈ వ్యాపారానికి అన్ని సీజన్లలో కూడా డిమాండ్ ఉంటుంది. అదే కార్ లేదా బైక్ వాషింగ్ సర్వీస్ సెంటర్. దీనికి నగరాల్లో మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో బిజినెస్ కూడా పెరుగుతుంది. అయితే దీనిని ఎలా ప్రారంభించాలి, లాభాలు ఎలా ఉంటాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఎక్కడ ప్రారంభించాలి..
ఈ వ్యాపారాన్ని చిన్న పెట్టుబడితో ప్రారంభించవచ్చు. కార్లు లేదా బైక్‌ల కోసం వాష్ సెంటర్ ప్రారంభించాలంటే సరైన స్థలం అవసరం. మీరు నగరంలోని రోడ్డుకు సమీపంలో లేదా ప్రజలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో చిన్న షాపు లేదా స్థలంలో దీనిని ప్రారంభించుకోవచ్చు. ఎక్కువ వాహన రద్దీ ఉండే ప్రాంతాలను ఎంచుకోవడం మంచిది. రహదారి పక్కన, ఫ్యూయల్ స్టేషన్ల దగ్గర, బస్తీల దగ్గర, అపార్ట్మెంట్ల సమీపంలో ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి లాభాలు వస్తాయి. దీని కోసం నీటి వసతి ఉండాలి.
పెట్టుబడి ఎంత
దీంతోపాటు వాహనాలు శుభ్రం చేయడానికి హై ప్రెజర్ వాటర్ జెట్, కార్ షాంపూ & క్లీనింగ్ కెమికల్స్, వాక్యూమ్ క్లీనర్, మైక్రోఫైబర్ క్లాత్‌లు, ఎయిర్ కంప్రెసర్ (డ్రైయింగ్ కోసం) వంటివి కొనుగోలు చేయాలి. ఈ విధంగా చూసినా కూడా మీకు షాపు కిరాయి లేకుంటే, పెట్టుబడి 20 వేల రూపాయలలోపు అవుతుందని చెప్పవచ్చు.
Read Also: Merge PF Accounts: మీ ఎక్కువ పీఎఫ్ ఖతాలను ఇలా ఈజీగా
వాష్ వ్యాపారం ఎందుకు ప్రారంభించాలి?
వాహన యజమానులు తమ కార్లు, బైక్‌లు శుభ్రంగా ఉంచుకోవాలనుకుంటారు. వేడి, దుమ్ము కారణంగా ఎక్కువగా వాహనాలను క్లినింగ్ చేయించుకోవాలని ఓనర్లు భావిస్తారు. దీంతో ఈ వ్యాపారానికి డిమాండ్ ఎక్కువ. మీరు వచ్చిన కస్టమర్లకు ప్రొఫెషనల్‌గా క్లిన్ చేసి, వారికి వాహనాలను అందిస్తే, కస్టమర్లు తిరిగి మిమ్మల్ని మళ్లీ వెతుక్కుంటూ వస్తారు.
మార్కెటింగ్ & ప్రచారం
కొత్త వ్యాపారం ప్రారంభించినప్పుడు ప్రచారం చాలా అవసరం. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్ ద్వారా మీ సేవలను ప్రమోట్ చేసుకోండి. మొదటిసారి వచ్చే కస్టమర్లకు డిస్కౌంట్లు ఇవ్వండి. నెలవారీ లేదా వార్షిక మెంబర్‌షిప్ ప్లాన్ తీసుకున్నవారికి ప్రత్యేక తగ్గింపులు అందించండి. కస్టమర్ ద్వారా మరొక కస్టమర్ వస్తే అదనపు రాయితీ ఇస్తామని చెప్పండి.
లాభనష్టాల విశ్లేషణ
లాభాలు
-తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు
-రోజుకు స్థిరమైన ఆదాయం
-ఎప్పటికీ డిమాండ్ తగ్గని వ్యాపారం
-ఈజీగా వ్యాపారాన్ని పెంచుకునే అవకాశం
నష్టాలు
-నీటి వినియోగం ఎక్కువగా ఉండొచ్చు
-సరైన మయింటెనెన్స్ లేకుంటే నష్టపోవచ్చు
-పోటీ అధికంగా ఉండొచ్చు
ఆదాయం
-రోజుకు కనీసం 20-30 వాహనాలు వాష్ చేస్తే మంచి ఆదాయాన్ని పొందవచ్చు
-రోజుకు 20 కార్లు/బైక్‌లు వాష్ చేస్తే
-ఒకటి వాష్ చేయడానికి రూ. 200 – 500 చార్జ్ చేసినట్లయితే
-రోజుకి రూ. 5,000 – 10,000 ఆదాయం
-ఖర్చులు పోయినా కూడా నెలకు రూ. 1,00,000 పైగా లాభం సంపాదించవచ్చు