Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేక మలుపులు తిరుగుతోందా? ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోందా? అప్పటి ప్రభుత్వ పెద్దలు బాగోతాలు ఒకొక్కటిగా బయట పడుతున్నాయా? ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల చేసిన కామెంట్స్ ఆ రెండు పార్టీ నేతల్లో గుబులు మొదలైందా? రేపో మాపో వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు ఇవ్వడం ఖాయమా? దీనికోసం సిట్ రెడీ అవుతున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది.
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్-వైసీపీ నేతలకు చెమటలు పడుతున్నాయి. ఎప్పుడు ఎవరి పేరు బయటకు వస్తుందేమోనని బెంబేలెత్తుతున్నారు. గడిచిన రెండు రోజులుగా ఈ వ్యవహారంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రియాక్టు అయ్యారు. కచ్చితంగా తన ఫోన్ ట్యాపింగ్ అయ్యిందని చెప్పకనే చెప్పారు.
దానికి సంబంధించి ఆడియో వైవీ సుబ్బారెడ్డి తనకు వినిపించారని ఓపెన్‌గా బయటపెట్టారు. అయితే ఆ ఆడియో ఎక్కడ నుంచి వచ్చిందనేది కీలకంగా మారింది. దీంతో ఈ వ్యవహారంతో వైసీపీ ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనేది అసలు ప్రశ్న. ఫోన్ ట్యాప్ బాధితులను ప్రస్తుతం సిట్ విచారణ చేస్తోంది. వారి తర్వాత ట్యాపింగ్‌కు పర్మీషన్ ఇచ్చిన అధికారులను విచారించనున్నారు.
వారిచ్చిన సమాచారం ఆధారంగా అప్పుడు ఏపీ కాంగ్రెస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై దృష్టి పెట్టే అవకాశముందని ప్రభుత్వ అధికారుల మాట. వైవీ ఆడియో వినిపించారంటే కచ్చితంగా షర్మిల ఫోన్ ట్యాప్ అయ్యిందని అంటున్నారు. ఆయనకు ఆడియో క్లిప్పింగ్ ఎరవిచ్చారు? అప్పటి బీఆర్ఎస్ పెద్దలు ఇచ్చారు? లేకుంటే వైసీపీ పెద్దల నుంచి తీసుకున్నారా?
ALSO READ: జూబ్లీహిల్స్ బైపోల్.. రేసులో అజార్‌తోపాటు ముగ్గురు, బీఆర్ఎస్ దూరం?
ఆయన ఫోన్ చెక్ చేస్తే డీటేల్స్ బయటపడడం ఖాయమని అంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమె ఫోన్‌ని ట్యాప్ చేసిందా? లేకుంటే వైసీపీ సర్కార్ చెబితే చేసిందా? అనేది తేలనుంది. ఇప్పటికే చంద్రబాబు, లోకేష్, అచ్చెన్నాయుడు, పవన్ కల్యాణ్ ఫోన్లు ట్యాప్ అయినట్టు వార్తలు వచ్చాయి.
అంతేకాదు వారి అనుచరులను సైతం ట్యాపింగ్ చేస్తున్నట్లు వార్తలు హంగమా చేస్తున్నారు. రేపటి రోజున ఇంకెన్ని కొత్త విషయాలు బయటకు వస్తాయో చూడాలి. వచ్చేవారంలో ఫోన్ ట్యాపింగ్ గురించి కీలక విషయాలతోపాటు కొందరికి నోటీసులు ఇచ్చేందుకు దర్యాప్తు అధికారులు రెడీ అయినట్టు తెలుస్తోంది.