Gold Rate Today: సాధారణంగా యుద్ధాలు, గ్లోబల్ ఉద్రిక్తతలు, ఆర్థిక అస్థిరతలు పెరిగితే బంగారం ధరలు పెరగడం సహజం. ఎందుకంటే గోల్డ్‌ను సురక్షితమైన ఆస్తులుగా భావిస్తారు. కానీ ఇప్పటికే ఇజ్రాయెల్ ఇరాన్, ఉక్రెయిన్ రష్యా వంటి ఘర్షణల మధ్య ఉన్నా కూడా, బంగారం ధరలు ఇటీవల తగ్గడం గమనార్హం. దీని వెనుక కొన్ని కీలకమైన ఆర్థిక కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం బంగారం ధరలు చూస్తే.. 22 క్యారెట్ల తులం బంగారానికి రూ.600 తగ్గింది. దీంతో.. రూ.92,100 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00, 480 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఫెడరల్ రిజర్వ్ రేట్లు ఇంకా ఎక్కువగానే ఉంచే సూచనలతో గోల్డ్‌పై ఒత్తిడి పెరిగింది. వడ్డీ రేట్లు అధికంగా ఉంటే, పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడి పెట్టడాన్ని తగ్గిస్తారు. డాలర్ బలపడితే, ఇతర కరెన్సీలో బంగారం ఖరీదుగా కనిపిస్తుంది. అందువల్ల డిమాండ్ తగ్గుతుంది. గ్లోబల్ మార్కెట్లు తిరిగి పుంజుకోవడంతో.. రిస్క్ ఆసెట్‌లవైపు పెట్టుబడిదారుల దృష్టి మళ్లింది. గతంలో భారీగా పెరిగిన ధరల నేపథ్యంలో, కొన్ని ఇన్వెస్టర్లు లాభాలను తీసుకోవడానికి గోల్డ్ అమ్మకాలు ప్రారంభించారు.
ఇదిలా ఉంటే.. ఇజ్రాయెల్, ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఈ యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు అమెరికా సిద్ధం అవుతుంది. అణు కార్యక్రమాన్ని చూపుతూ.. ఇరాన్‌పై సైనిక చర్య చేపట్టేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలో ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై యుద్ధం చేయడంపై రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ తెలిపారు. ఇరాన్‌తో త్వరలో చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయా, లేవా అనే అంశాన్ని బట్టి ట్రంప్ నిర్ణయం తీసుకోనున్నారు.
ఇరాన్‌పై ప్రత్యక్ష దాడి ప్రణాళికలకు ట్రంప్ మద్దతు తెలిపినా.. తుది ఉత్తర్వులు ఇంకా ఇవ్వలేదు. టెహ్రాన్ అణు కార్యక్రమం అవుతుందో లేదో అని ట్రంప్ వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదివరకు దీనిపై స్పందిచిన ట్రంప్ వచ్చేవారం చేసే ప్రకటన చాలా కీలకం అన్నారు. చాలా పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా సైనిక జోక్యానికి దిగడం సరికాదని, ఇది అత్యంత ప్రమాదకరమని రష్యా హెచ్చరించింది.
బంగారం ధరలు ఇలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.92,100 పలుకుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00, 480 వద్ద ట్రేడ్ అవుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.92,100 ఉండగా.. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,480 వద్ద కొనసాగుతోంది.
వైజాగ్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.92,100 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,480 ఉంది.
రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.92,250 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,630 వద్ద కొనసాగుతోంది.
చెన్నైలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.92,100 కి చేరుకుంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,480 వద్ద కొనసాగుతోంది.
ముంబై, కేరళ, కోల్ కత్తాలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.92,100 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1,00,480 వద్ద ట్రేడింగ్‌లో ఉంది.
Also Read: రియల్ ఎస్టేట్ రంగానికి బూమ్.. ఒక్కో ఫ్లాట్ 10 కోట్లు, వారంలో 1164 ఫ్లాట్లు అమ్మకం
వెండి ధరలు ఇలా..
బంగారం ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి.. వెండి ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. ఈరోజు వెండి ధరలు చూస్తే.. చెన్నై, హైదరాబాద్, కేరళ, వైజాగ్‌లో కిలో వెండి ధర రూ.1,20,000 కి చేరుకుంది.
ముంబై, కోల్ కత్తా, బెంగళూరు, ఢిల్లీలో కిలో వెండి ధర రూ.1,10, 000 వద్ద ట్రేడ్ అవుతోంది.