SLBC Tunnel Collapsed: SLBC టన్నెల్లో జరిగిన ఘటన విషాదాంతమైంది. వారం రోజులుగా టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులు సజీవ సమాధి అయ్యారు. సరిగ్గా గత శనివారం ఉదయం పనులు చేస్తుండగా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పైకప్పు కొన్ని మీటర్ల మేర కూలిపోయింది. 42 మంది బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకోగా, 8 మంది మాత్రం లోపల చిక్కుకున్నారు. దీంతో అప్పటి నుంచి రంగంలోకి దిగిన NDRF, SDRF, ఇండియన్ ఆర్మీ, నేవీ టీమ్స్, సింగరేణి టీమ్స్, పోలీసులు, ర్యాట్ హోల్ మైనర్స్ టీమ్స్ కార్మికులకు కాపాడేందుకు ఎంతగానో ప్రయత్నించినా లోపల చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడలేకపోయాయి.
సరిగ్గా గత శనివారం రోజు ఘటన జరిగింది. అంటే అల్మెస్ట్ 8 రోజులు. ఈ వారం పాటు రెస్క్యూ టీమ్స్…కార్మికులను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. డే అంట్ నైట్ షిఫ్ట్‌ల వారిగా పని చేశారు. ఎలాగైనా కార్మికులను కాపాడేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందుకోసం కావాల్సిన పరికారాలు, కొత్త కొత్త మిషన్లను తెప్పించి రెస్క్యూ చేశారు. గంటల కాస్తా రోజులు…రోజులు దాటినా వారం పూర్తయింది. సరిగ్గా 8 రోజుల పాటు టన్నెల్లో కార్మికులు.. వీరిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు…చేయాల్సిన ప్రయత్నం…పెట్టాల్సిన ఎఫర్ట్స్ గట్టిగా పెట్టారు. కానీ చివరికి సొరంగంలోనే 8 మంది కార్మికులు సమాధి అయ్యారు.
నల్గొండ జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకు, వందల గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రాజెక్టు 2005లో వైఎస్సార్ సీఎంగా ఉన్న టైంలో ప్రారంభించారు. మొత్తం 44 కిలోమీటర్ల టన్నెల్ ప్రాజెక్టు చేపట్టగా, కొన్ని కారణాలతో పనులు నిలిచిపోయాయి. దాదాపు 35 కిలోమీటర్ల మేర టన్నెల్ పనులు పూర్తయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ టన్నెల్ నిర్మాణం త్వరగా పూర్తిచేసి సాగునీరు, తాగునీరు అందించాలని పనులు వేగవంతం చేసింది. ఫిబ్రవరి 18న SLBC టన్నెల్ పనులు తిరిగి చేపట్టగా, ఫిబ్రవరి 22న ఉదయం 14వ కిలోమీటర్ దగ్గర పైకప్పు కూలిపోవడంతో విషాదం నెలకొంది. నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలో టన్నెల్ పైకప్పు కూలిపోయింది.
టన్నెల్ పైకప్పు కూలిన టైంలో లోపల 50 మంది వరకు ఉండగా, టన్నెల్ బోరింగ్ మెషిన్ కు ఇవతల వైపున ఉన్న 42 మంది ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. 3, 3 కిలోమీటర్లు పరిగెత్తిన తర్వాత లోకో ట్రైన్లో ప్రయాణించి టన్నెల్ నుంచి బయటకు వచ్చారు. అయితే ఇక్కడే టన్నెల్ బోరింగ్ మెషిన్ కు అవతల వైపున చిక్కుకున్న వారు బురదలో చిక్కుకుపయారు. దీంతో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ సిబ్బంది, సింగరేణి టీమ్స్, పోలీసులు, ఆఖరికి ర్యాట్ హోల్ మైనర్లను సైతం తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దించింది. వారం రోజుల నుంచి ఆపరేషన్ కొనసాగించినా ప్రయోజనం లేకపోయింది.
Also Read: ఎనిమిది మంది ఆనవాళ్లు దొరికాయి.. ఇక ఏ క్షణమైనా బయటకు
మరోవైపు టన్నెల్‌లో ఉన్న మృతదేహాల వెలికితీ పనులు దాదాపు పూర్తవుతున్నాయి. మృతదేహాలను నేరుగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. ఇందుకోసం అంబులెన్స్‌లు కూడా సిద్ధం చేశారు. దాదాపు 8 రోజులు కావడంతో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కుళ్లిపోయే అవకాశం ఉంటుంది. దీంతో గాంధీ ఆస్పత్రి తరలించి డీఎన్‌ఏ టెస్ట్‌లు తర్వాత కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటికే రెస్క్యూ టీమ్స్.. మూడు మృతదేహాలను వెలికితీశారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ దగ్గరకు జేపీ కంపెనీ చైర్మన్, అడ్మినిస్ట్రేషన్ ముఖ్యులు చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం, ఇన్స్యూరెన్స్ విషయంలో స్పష్టత రానుంది. టెస్టుల తర్వాత మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపేందుకు అంబులెన్స్‌లను కూడా అధికారులు సిద్ధం చేశారు. ఇటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తెలంగాణ సీఎస్ శాంతికుమారి టన్నెల్ దగ్గరకు చేరుకోనున్నారు. ఇప్పటికే చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటించారు.