BigTV English

Attack on Babar Azam: పాక్‌ లో కలకలం… బాబర్‌ అజాం ఇంటిపై దాడి…?

Attack on Babar Azam: పాక్‌ లో కలకలం… బాబర్‌ అజాం ఇంటిపై దాడి…?

Attack on Babar Azam: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో అతిథ్య పాకిస్తాన్ ప్రస్థానం ముగిసింది. పాకిస్తాన్ తన రెండవ మ్యాచ్ భారత్ తో తలపడాల్సి ఉండగా.. మ్యాచ్ కి ముందు అందరిలో టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా ప్లేయింగ్ 11 పై పాకిస్తాన్ జట్టు మల్లగుల్లాలు పడింది. ఎట్టి పరిస్థితులలోనూ భారత్ పై మ్యాచ్ గెలవాలంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోహ్సీన్ రాజా నఖ్వి పట్టుదలతో సెలక్టర్లు జట్టులో కీలక మార్పులు చేశారు. పాకిస్తాన్ సెలక్షన్ కమిటీ పై నమ్మకం లేక నఖ్వి స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు కోచ్ జావేద్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలిపాడు.


Also Read: Vintage Dhoni: వేట మొదలుపెట్టిన ధోని..ప్ట్రాక్టీస్ లో కూడా అన్ని సిక్సులే !

ఇక డూ ఆర్ డై మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో రంగంలోకి దిగిన పాకిస్తాన్ జట్టుకి ఓటమి ఎదురైంది. దీంతో పాకిస్తాన్ జట్టు సెమీస్ చేరలేకపోయింది. తొలి రెండు మ్యాచ్లు న్యూజిలాండ్, టీమిండియా చేతిలో ఓడిపోవడంతోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆ తరువాత బంగ్లాదేశ్ తో మిగిలిన నామమాత్రపు మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఒక్క విజయం కూడా లేకుండానే ఈ ప్రతిష్టాత్మక ఛాంపియన్ ట్రోఫీని ముగించాల్సి వచ్చింది.


చాలా సంవత్సరాల తర్వాత ఒక ఐసీసీ ఈవెంట్ ని నిర్వహించే అవకాశం రావడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎంతో సంతోష పడింది. తమ దేశంలో మళ్ళీ క్రికెట్ కి పూర్వ వైభవం రాబోతుందని కలలు కంది. ఆ దేశ క్రికెట్ అభిమానులు కూడా జట్టు పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. తమ జట్టు కప్పు గెలుస్తుందని భావించారు. కానీ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే పాకిస్తాన్ నిష్క్రమించింది. దీంతో చెత్త ప్రదర్శనతో దేశం పరువు తీశారు అంటూ ఆటగాళ్లపై దుమ్మెత్తిపోస్తున్నారు పాకిస్తాన్ క్రీడాభిమానులు.

ముఖ్యంగా బాబర్ అజామ్ ని ఏకిపారేస్తున్నారు. తాము బాబర్ అజామ్ ని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పోల్చామని.. కానీ అతడికి అంత సీన్ లేదని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు బాబర్ అజామ్ వల్లే పాకిస్తాన్ ఓడిపోయిందని అతడి ఇంటిపై పాకిస్తాన్ అభిమానులు దాడి చేసినట్లు పాక్ క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ కూడా బాబర్ అజాం పై తీవ్ర విమర్శలు చేశాడు. అతడు ఓ మోసగాడని, పాకిస్తానీలు తప్పుడు వ్యక్తిని తమ హీరోగా ఎంచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

 

పాకిస్తాన్ క్రీడాభిమానులు మొదటి నుండి ఓ మోసగాడిని నమ్ముతున్నారని.. పాకిస్తాన్ క్రికెట్ జట్టు గురించి మాట్లాడడానికి కూడా నేను ఇష్టపడడం లేదన్నాడు. మరోవైపు బంగ్లాదేశ్ తో మ్యాచ్ రద్దు అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ మాట్లాడుతూ.. అభిమానులు జట్టుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని.. కానీ దురదృష్టవశాత్తు వాటిని మేము అందుకోలేకపోయాం అన్నాడు. కానీ ఆటలో ఇలాంటి వాటిని సహజం అని, ఓటములనుండి, తప్పిదాల నుండి మేము నేర్చుకుంటామని తెలిపాడు.

Related News

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Haris Rauf: రఫేల్ కూల్చేశామంటూ హ‌రీస్ ర‌ఫ్ సెలబ్రేషన్..ఆడుకున్న ఫ్యాన్స్‌

Ind Vs Pak: చ‌ల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్‌…సిక్స్ కొట్టి మ‌రీ

Big Stories

×