Zelenskyy Not Wearing Suit| ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ల మధ్య వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ లో జరిగిన సమావేశంలో మీడియా ముందే తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ట్రంప్ మరియు వాన్స్ లు, అమెరికా నుంచి సహాయం పొందినప్పటికీ జెలెన్‌స్కీ కృతజ్ఞత చూపడం లేదని మండిపడ్డారు. ప్రపంచాన్ని మూడో ప్రపంచ యుద్ధం వైపు తీసుకువెళ్తున్నారని ట్రంప్ జెలెన్స్కీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సూట్ ఎందుకు ధరించరు జెలెన్‌స్కీ?
ఈ సందర్భంగా ఒక విలేకరి జెలెన్‌స్కీని, “మీరు సూట్ ఎందుకు ధరించలేదు? అమెరికా అధ్యక్షుడితో భేటీ సందర్భంగా సూట్ ధరించాలి కదా.. మీకు అమెరికా అంటే గౌరవం లేదా?.. అధ్యక్ష భవనానికి వచ్చేటప్పుడు డ్రెస్ కోడ్ పాటించకపోతే ఎలా?” అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సమాధానంగా జెలెన్‌స్కీ సమాధానమిస్తూ.. “యుద్ధం ముగిసిన తరువా నేను ఓ మంచి కాస్ట్యూమ్ ధరిస్తాను. బహుశా మీరు వేసుకున్న సూటే ధరిస్తాను కావచ్చు. లేదా ఇంకా మంచిదాన్నే ధరిస్తాను కావచ్చు. నాకు తెలియదు. చూద్దాం. కుదరకపోతే చౌకగా లభించేదైనా కావచ్చు” అని బదులిచ్చారు.
ఈ సమావేశం తర్వాత, జెలెన్‌స్కీకి అమెరికా పట్ల ‘గౌరవం లేదు’ అని కొందరు విమర్శించారు. ట్రంప్ తో భేటీ సమయంలో జెలెన్స్కీ నల్ల స్వెట్టర్ ధరించారు. సాధారణంగా జెలెన్‌స్కీ క్యాజువల్ వస్త్రధారణతోనే ఉంటారు. ఇతర దేశాల అధినేతలతో సమావేశం అయిన సందర్భాల్లో కూడా ఆయన సాధారణ వస్త్రధారణతోనే హాజరవుతారు.
Also Read: జెలెన్‌స్కీ యుద్ధాన్నే కోరుకుంటున్నారు.. వైట్ హౌస్ వాగ్వాదం వైరల్ వీడియో
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడుజెలెన్‌స్కీ మధ్య ఉక్రెయిన్ యుద్ధం శాంతి చర్చలు విఫలమయ్యాయి. వైట్ హౌస్ లో జరిగిన భేటీ వాగ్వాదంతో ముగిసింది. ఎలాంటి ఒప్పందం లేకుండానే జెలెన్‌స్కీ వైట్ హౌస్ ను వీడారు. ఈ ఘటన తర్వాత, యూరోపియన్ యూనియన్ దేశాలు, ఇతర మిత్రదేశాలు జెలెన్‌స్కీకి మద్దతు తెలిపాయి. పోలిష్ ప్రధాన మంత్రి డొనాల్డ్ టస్క్, బ్రిటన్ ప్రధాన మంత్రి కీర్ స్టార్మర్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, యూరోపియన్ యూనియన్ చీఫ్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ మొదలైన నేతలు ఉక్రెయిన్ కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
మరోవైపు.. రష్యా మాజీ అధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ ఈ ఘటనపై వ్యాఖ్యానిస్తూ, ఇది ఉక్రెయిన్ కు చెంపదెబ్బ లాంటిదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్రంప్, జెలెన్‌స్కీ మధ్య వాగ్వాదం సమయంలో, ఉక్రెయిన్ తీరు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చని ట్రంప్ హెచ్చరించారు. జెలెన్‌స్కీ మాత్రం ట్రంప్ బెదిరింపులకు లొంగేది లేదని చెప్పారు. ట్రంప్ శాంతి ఒప్పందానికి జెలెన్స్కీ సుముఖంగా లేరని ఆరోపించగా.. పుతిన్ శాంతి కోసం ప్రయత్నిస్తున్నారని చెప్పారు.
Q: "Why don't you wear a suit?"
Ukrainian President Zelenskyy: "I will wear costume after this war will finish." pic.twitter.com/FzJqjIAQHa
— CSPAN (@cspan) February 28, 2025