BigTV English

YCP: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వల్లే నా భార్య ప్రెగ్నెంట్.. అధికారిణి భర్త ఫిర్యాదు

YCP: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వల్లే నా భార్య ప్రెగ్నెంట్.. అధికారిణి భర్త ఫిర్యాదు

Adultery: వైసీపీ సీనియర్ లీడర్, ఎంపీ విజయసాయి రెడ్డిపై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. దేవాదాయ శాఖ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తించి ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న ఓ అధికారిణి భర్త వైసీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. తాను విదేశాల్లో ఉన్నప్పుడు తన భార్య గర్భం దాల్చిందని, తన భార్య ప్రెగ్నెంట్‌కు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కారణం అంటూ దేవాదాయ శాఖ కమిషనర్‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక సారి విజయసాయి రెడ్డి కారణం అని, మరోసారి ప్రభుత్వ ప్లీడర్ కారణం అని, ఇంకోసారి వేరొకరు కారణం అని తన భార్య రకరకాలుగా చెబుతున్నదని తెలిపారు. పవిత్రమైన దేవాదాయ శాఖలో ఇలాంటివి జరుగుతాయని తాను ఊహించలేదని, దయచేసి ఈ వ్యవహారంలో దర్యాప్తు చేసి పుట్టిన బాబుకు తండ్రి ఎవరో గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.


తను పీహెచ్‌డీ పూర్తి చేయడానికి గత సంవత్సరం జనవరి నుంచి సెప్టెంబర్ వరకు అమెరికాలో ఉన్నానని, కానీ, తాను తిరిగి స్వదేశానికి వచ్చిన తర్వాత దారుణమైన విషయం తెలుసుకున్నానని ఆ అధికారిణి భర్త తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భార్య గతేడాది జులైలో గర్భం దాల్చిందని మెడికల్ రిపోర్టుల ద్వారా తెలిసిందని, ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో బాబుకు జన్మనిచ్చిందని వివరించారు. ఈ బాబుకు తండ్రి ఎవరని ప్రశ్నించగా తొలుత తానేనని బుకాయించిందని, ఆ తర్వాత ఐవీఎఫ్‌కు వెళ్లినట్టు చెప్పిందని, ఇంకోసారి మాట్లాడుతూ వి విజయసాయి రెడ్డి పేరు చెప్పిందని, ఆ తర్వాత మరెవరి పేరో చెప్పిందని పేర్కొన్నారు.

తమ దాంపత్యం బంధం ఉండగానే, తాను అధికారికంగా విడాకులు ఇవ్వకుండానే తన భార్యతో లైంగిక సంబంధం పెట్టుకోవడం, అదీ దేవాదాయ శాఖలో పని చేస్తున్న తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని తాను ఊహించలేకున్నానని సదరు వ్యక్తి వాపోయారు. తమకు 2015లో ఇద్దరు ఆడ కవల పిల్లలు జన్మించారని వివరించారు. దయచేసి ఈ వ్యవహారంలో దర్యాప్తు చేసి ఈ ఏడాది ఏప్రిల్‌లో తన భార్యకు పుట్టిన బాబుకు తండ్రి ఎవరో గుర్తించాలని ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో రచ్చ జరుగుతున్నది. నిజానిజాలు ఇంకా తెలియరాలేదు. ఈ వ్యవహారంపై ఇటు విజయసాయి రెడ్డి, అటు సదరు అధికారిణి అధికారికంగా స్పందించలేదు.


Tags

Related News

Nara Lokesh: హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పట్టింది.. విశాఖకు పదేళ్లు చాలు: లోకేష్

Anantapur: దారుణం.. ఇంటి ముందు క్రికెట్ ఆడొద్దన్నందుకు.. మహిళపై కానిస్టేబుల్ దంపతులు దాడి

YSRCP vs TDP: బొత్స ‘అంతం’ మాటలు.. జగన్ ప్లాన్‌లో భాగమేనా?

Nara Lokesh: విశాఖలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు నారా లోకేష్ శంకుస్థాపన

AP Govt: ఏపీలో నకిలీ మద్యానికి చెక్.. కొత్తగా యాప్ తీసుకురానున్న ప్రభుత్వం, అదెలా సాధ్యం

Vijayawada Singapore Flight: విజయవాడ-సింగపూర్ మధ్య ఇండిగో కొత్త విమాన సర్వీస్.. ఎప్పటి నుంచంటే?

Lulu Mall: లులూ మాల్‌పై పవన్ ఫైర్.. సీఎం చంద్రబాబు స్పందన ఇదే, ఇక లేనట్లేనా?

AP Fire Crackers: బాణసంచా తయారీలో ఈ నిబంధనలు తప్పనిసరి.. లేదంటే?

Big Stories

×