BigTV English

Athram Sakku: కేటీఆర్‌పై గరం.. కాంగ్రెస్ లోకి ఆత్రం సక్కు?

Athram Sakku: కేటీఆర్‌పై గరం.. కాంగ్రెస్ లోకి ఆత్రం సక్కు?

Athram Sakku: అధికారంలో ఉన్నంత కాలం బీఆర్ఎస్‌లో బాసుల పెత్తనమే నడిచింది. అయితే పెద్ద బాస్ కేసీఆర్.. లేకపోతే చిన్నబాస్ కేటీఆర్ అన్నట్లు కారు పార్టీలో వ్యవహారాలు నడిచాయి.. అయితే ఓటమి తర్వాత సీన్ మారిపోయింది. ఒకవైపు వలసలు పెరిగిపోతున్నాయి. మరోవైపు పార్టీలో తిరుగుబాట్లు మొదలయ్యాయి. ఆ క్రమంలో కేటీఅర్ పై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు తిరుగుబాటు చేసి షాక్ ఇచ్చారు. కేటీఅర్ ఆదిలాబాద్ పర్యటనకు ఆత్రం సక్కు దూరంగా ఉండిపోయారు. అసలు కేటీఅర్ పై ఆత్రం సక్కు అసంతృప్తికి కారణమేంటి? ఆయన కూడా కారు దిగడానికి రెడీ అయ్యారా?


రైతుల సమస్యలపై బీఅర్‌ఎస్ పోరుబాట పట్టింది. ఆ పోరాటంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పర్యటిస్తున్నారు. రైతుపోరులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో‌‌‌ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన దీక్ష చేపట్టాయి. ఆ సభకు కేటీఅర్ హజరయ్యారు. జిల్లాలోని ఇద్దరు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కార్యక్రమానికి వచ్చారు. అదేవిధంగా ఇతర జిల్లాల ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్కారుపై సమరం ప్రారంభించామని కేటీఆర్ ప్రకటించారు. ‌ఇక రాబోయే రోజుల్లో అధికారంలో రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

అయితే గులాబీ పార్టీకి అధికారం దక్కుడు దేవుడేరుగు. పార్టీలో అనైక్యత మాత్రం స్పష్టమైంది. కేటీఅర్ హాజరైన దీక్షకు అదివాసీ నాయకుడు బిఅర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అత్రం సక్కు డుమ్మా కొట్టారు.. సక్కు దీక్షకు దూరంగా ఉండటం పార్టీలో తీవ్రమైన దుమారం రేపుతుందట. గత కొన్ని రోజులుగా ఆత్రం సక్కు కేటీఅర్ పై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట. అందుకే కేటీఅర్ పర్యటనకు దూరంగా ఉన్నారట‌‌. అయితే కేటీఅర్‌పై సక్కుతిరుగుబాటు చేయడానికి కారణాలు ఉన్నాయట.


Also Read:  డీజీపీ సంచలన నిర్ణయం.. 39 మంది కానిస్టేబుల్స్ సస్పెండ్

2018 అసెంబ్లీ ఎన్నికలలో సక్కు అసిఫాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత బీఅర్ ఎస్ పార్టీలో చేరారు.‌ కాని 2023 అసెంబ్లీ ఎన్నికలలో సక్కు టిక్కెట్ దక్కలేదు.. సిట్టింగులందరికీ టికెట్లు అన్న గులాబీబాస్ ఆయనకు మొండి చేయి చూపారు. ఆ టిక్కెట్‌ను మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మికి కేటాయించారు. ఆమె విజయానికి ఆత్రం సక్కు కృషి చేశారు .. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో సక్కు బీఅర్ఎస్ ఎంపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఆ ఓటమితో సక్కు తీవ్ర నిరాశకు గురయ్యారు. తాను అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసుంటే.. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే అవకాశం ఉండేదని.. కాని ‌కేటీఅర్ వల్లే తనకు ఎమ్మెల్యే టిక్కెట్ దక్కలేదని ఆయన అంటున్నారంట. పార్టీ మారి వచ్చిన తనకు టిక్కెట్ ఇవ్వకపోవడానికి కారణం కేటీఆర్‌ అని సక్కు ఆగ్రహంతో ఉన్నారంట. పోని ఎంపిగా పోటీ చేసినప్పుడు కూడా కేటీఅర్ అసలు పట్టించుకోలేదని..‌ ప్రచారంలో చేతులేత్తేశారని అందుకే ఓటమి పాలయ్యానని బావిస్తున్నారట.

నమ్మి పార్టీలో చేరితే కేటీఅర్ ముంచారని సక్కు సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. ఇక అలాంటి పార్టీ లో ఉండనని నిర్ణయించుకున్న సక్కు కాంగ్రెస్‌లో చేరడానికి రెడీ అయ్యారంటున్నారు. అదివాసీ నాయకుడు కావడంతో కాంగ్రెస్ పార్టీ కూడా రీజాయిన్ చేసుకోవడానికి సుముఖంగానే ఉందంట. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఆత్రం సక్కు పార్టీ కండువా మార్చేయడం ఖాయమంటున్నారు.

 

Related News

Bagram Air Base: బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇచ్చేయండి.. లేదంటే రక్తపాతమే..

US Army in Bangladesh: బంగ్లాలో సీక్రెట్ మిషన్..! రంగంలోకి యూఎస్ ఆర్మీ..

Amit Shah: మావోయిస్టుల రూట్ చేంజ్! కొత్త వ్యూహం ఇదేనా?

Telangana Sports: టార్గెట్ 2036 ఒలింపిక్స్..! గోల్డ్ తెచ్చిన వారికి రూ.6 కోట్ల నజరానా

Telangana BJP MP’s: మారకపోతే అంతే.. బీజేపీ ఎంపీలకు ఢిల్లీ పెద్దల వార్నింగ్

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్‌పై.. వైసీపీ పొలిటికల్ గేమ్

Kakinada: కాకినాడ రూరల్ సెగ్మెంట్‌పై ఫోకస్ పెట్టని టీడీపీ పెద్దలు

Hyderabad Metro: మెట్రో ప్లాన్..! అప్పుల నుంచి బయటపడాలంటే ఇదొక్కటే మార్గం..!

Big Stories

×