Sathi Leelavathi Teaser:..ప్రముఖ హీరోయిన్, మెగా ప్రిన్స్ హీరో వరుణ్ తేజ్ (Varun Tej) భార్య లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) తాజాగా నటిస్తున్న చిత్రం సతీ లీలావతి (Sathi Leelavathi). ఒకవైపు ప్రెగ్నెన్సీ మాధుర్యాన్ని అనుభవిస్తున్న ఈమె.. మరొకవైపు తన సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ (Dev Mohan) ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ చిత్రానికి.. ‘భీమిలి కబడ్డీ జట్టు’ , ‘ఎస్ఎంఎస్’ చిత్రాలకు దర్శకత్వం వహించిన తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్ పై నాగ మోహన్ నిర్మిస్తున్నారు. ముఖ్యంగా భార్య, భర్త మధ్య ఉండే అనుబంధాన్ని ఎమోషనల్ టచ్ తో నే కాకుండా కాస్త ఎంటర్టైనింగ్ గా కూడా ఈ చిత్రంలో చూపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుండి విడుదల చేసిన టీజర్ లో లావణ్య తన పర్ఫామెన్స్ తో అదరగొట్టేసిందని చెప్పవచ్చు.
సతీ లీలావతి టీజర్ ఎలా ఉందంటే?
ఇక టీజర్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే.. టీజర్ ప్రారంభంతోనే మంచి పెళ్లి వైబ్ తో ప్రారంభం అవుతుంది. అటు లావణ్య త్రిపాఠి, ఇటు దేవ్ మోహన్ ఇద్దరూ పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు గెటప్ లో ఆకట్టుకున్నారు. ఇక పెళ్లయిన తర్వాత.. అందరి మధ్య వచ్చే సమస్యలే వీరిమధ్య వచ్చినట్టు చూపించారు.” నాకెందుకో పెళ్లయిన తర్వాత ఇలా గొడవలు వస్తుంటే కలిసి ఉండటం కంటే విడిపోవడమే బెటర్” అని దేవ్ మోహన్ లావణ్య తో వాదిస్తూ ఉంటాడు. కట్ చేస్తే తన భర్తను వీర కుమ్ముడు కుమ్మేసి కుర్చీలో కట్టేసి ఉంటుంది లావణ్య. స్పృహలోకి వచ్చిన దేవ్ “నన్ను కొట్టావా?” అని అడుగుతాడు.
కామెడీ డైలాగ్స్ తో ఆకట్టుకుంటున్న టీజర్..
“ఐదు రూపాయలు పెన్నే కదా అని చీప్ గా చూడకు.. దాంతో ఐదు కోట్ల చెక్ పైన సంతకం పెడతామని” హీరో డైలాగ్ విసరగా.. “ఏదైనా ఆయిలే కదా అని బెంజ్ కార్ లో కోకోనట్ ఆయిల్ పోసుకోకూడదంటూ” లావణ్య కూడా పంచు డైలాగ్ తో రెచ్చిపోతుంది. తర్వాత ఈ సినిమాలో నటీనటుల మధ్య వచ్చే సన్నివేశాలు టీజర్ కే హైలెట్ గా నిలిచాయి. మొత్తానికైతే కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ టీజర్ ఇప్పుడు సినిమాపై అంచనాలు పెంచేసింది.
సతీ లీలావతి నటీనటులు..
లావణ్య త్రిపాఠి లీడ్ రోల్ పోషిస్తున్న చిత్రం సతీ లీలావతి. ఉదయ్ పొట్టిపాడు రచన సారధ్యంలో తాతినేని సత్య (Tatineni Sathya) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో దేవ్ మోహన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. వీరితోపాటు ప్రముఖ సీనియర్ నటుడు వీకే నరేష్, ప్రముఖ నటుడు సప్తగిరి, ప్రముఖ కమెడియన్ కం విలన్ మొట్ట రాజేంద్రన్, జైలర్ నటుడు జాఫర్ సాదిక్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తూ ఉండగా.. బినేంద్ర మీనన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
Also read: Raviteja: రవితేజ ART థియేటర్ ప్రారంభం.. ప్రదర్శించబోయే మొదటి సినిమా ఆ హీరోదే!