E-Paper
Advertisement

SSC Exams 2026: ఈ సారీ పది పరీక్షలు రాసే విద్యార్ధుల సంఖ్య ఎంతో తెలుసా..!

SSC Exams 2026: ఈ సారీ పది పరీక్షలు రాసే విద్యార్ధుల సంఖ్య ఎంతో తెలుసా..!
Advertisement

SSC Exams 2026: రాష్ట్రంలో మార్చి 14 నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి వార్షిక పరీక్షకి 5,28,239 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వారికి సంబంధించిన హాల్ టికెట్లను గురువారం నుంచే ఎస్ఎస్‌సీ బోర్డు వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్టు పాఠశాల విద్య డైరెక్టర్ నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్ఎస్‌సీ వార్షిక పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు కొనసాగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఎస్ఎస్‌సీ పరీక్షలకు 5,28,239 మంది పరీక్షలకు హాజరవ్వనుండగా వారిలో రెగ్యులర్ విద్యార్థులు 5,17,727 మంది విద్యార్థులని, 10,512 మంది ప్రైవేట్ విద్యార్థులుగా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా 5.28.239 మంది విద్యార్థుల్లో బాలురు 2,67,954 మంది, బాలికలు 2,60,285 మంది ఉన్నట్లు చెప్పారు. ఇకపోతే 5,17,727 మంది రెగ్యులర్ విద్యార్థుల్లో బాలురు 2,60,916 మంది, బాలికలు 256811 మంది ఉన్నట్లు స్పష్టంచేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 11,674 స్కూల్స్..

10.512 ప్రైవేట్ విద్యార్థుల్లో ఒకసారి విఫలమైనవారు కాగా, వారిలో బాలురు 7038 మంది, బాలికలు 3474 మంది ఉన్నట్లు నవీన్ నికోలస్ వెల్లడించారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ పాఠశాలల నుంచి 2,07,573 మంది, గురుకుల పాఠశాలలు నుంచి 60,139 మంది, ప్రైవేట్ పాఠశాలల నుంచి 2,50,015 మంది విద్యార్థులు టెన్త్ ఎగ్జామ్ కు హాజరుకానున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 11,674 స్కూల్స్ నుంచి టెన్త్ పరీక్షలకు విద్యార్థులు హాజరు కానున్నారు. వాటిలో ప్రభుత్వ జిల్లా పరిషత్ స్కూల్స్ 6386 ఉండగా, ప్రైవేట్ స్కూల్స్ 5288 నుంచి విద్యార్థులు టెన్త్ పరీక్షలకు హాజరు కానున్నారు. పది పరీక్షలకు హాజరయ్యే వారిలో ప్రత్యేక అవసరాలు ఉన్న విద్యార్థులు 1408 మంది ఉన్నారని డైరక్టర్ నవీన్ నికోలన్ తెలిపారు. ఎస్ఎస్‌సీ వరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 2676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు నవీన్ నికోలస్ తెలిపారు. వాటిలో 1582 ప్రభుత్వ స్కూల్స్ ఉండగా, 1094 ప్రైవేటు స్కూల్స్ ఉన్నాయి. ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు 4.70 లక్షల మంది ఉండగా.. తెలుగు మీడియం విద్యార్థులు 44,881 మంది, 3,720 మంది ఉర్దూ మీడియం విద్యార్థులు ఉన్నట్లు వివరించారు.

Advertisement

Also Read: Fire Accident: సోమాజిగూడలో భారీ అగ్నిప్రమాదం.. వైన్ షాప్ పూర్తిగా దగ్ధం

వ్యాట్సాప్ నంబర్‌కు హాయ్..

విద్యార్థులు తమ హాల్ టికెట్లను ఎస్ఎస్‌సీ బోర్డు వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులకు జారీ చేసే హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ఉండనుంది. తమ హాల్ టికెట్లుపై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి వారి పరీక్షా కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చని, వారికి ఎంత దూరంలో ఉందో కూడా తెలుస్తుందన్నారు. తద్వారా వారు ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ముందుగానే ప్లాన్ చేసుకునే వెలుసుబాటు కలగనుందని వివరించారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను పొందడం కోసం 8096958096 వ్యాట్సాప్ నంబర్ కు హాయ్ అని టైప్ చేసి.. వెంటనే ఎస్ఎస్‌సీ హాల్ టికెట్ మార్చి-2026 అని మెసేజ్ వేస్తే, హాల్ టికెట్ సెండ్ చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పరీక్షల డైరక్టర్ కార్యాలయంలో 24 గంటలపాటు అందుబాటులో ఉండేలాగా 040-23230942 నంబర్ అందుబాటులో ఉంచినట్టు నవీన్ నికోలస్ వెల్లడించారు.

Advertisement

Also Read: RBI Recruitment: నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. ఆర్బీఐలో 650 ఉద్యోగాలు, క్వాలిఫికేషన్ ఇదే

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×