BigTV English

Street Dogs: దిల్‌సుఖ్‌నగర్‌లో వీధికుక్కల వీరంగం.. బాలుడికి తీవ్రగాయాలు

Street Dogs: దిల్‌సుఖ్‌నగర్‌లో వీధికుక్కల వీరంగం.. బాలుడికి తీవ్రగాయాలు

Street Dogs: దిల్‌సుఖ్‌నగర్‌లో వీధికుక్కలు వీరంగం సృష్టించాయి. ఇంటి బయట ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులపైకి ఒక్కసారిగా అక్కడున్న కుక్కలు ఎగబడ్డాయి. భయపడి ఇద్దరు పిల్లలు ఇంట్లోకి పారిపోగా.. మరో బాలుడు వాటి నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తే సమయంలో కిందపడిపోయాడు.


దీంతో.. ఆ బాలుడిపై కుక్క దాడిచేసింది. బాలుడి మీదపడి కరిచింది. వెంటనే ఇంట్లో వాళ్లు రావడంతో కుక్క పారిపోయింది. కుక్క కరవడంతో.. నొప్పికి బాలుడు అల్లాడిపోయాడు. కిందపడి గిలగిలాకొట్టుకున్నాడు. వీధికుక్క దాడి దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. బాలుడికి మాత్రం తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు బాలుడికి చికిత్స చేశారు.

నగరంలో వీధికుక్కల బెడద రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఉదయమైనా, రాత్రైనా రోడ్లపై నడవాలంటే పెద్దవాళ్లు సైతం వీధికుక్కలను చూసి జంకుతున్నారు. ఏ కుక్క ఏ క్షణంలో ఎలా దాడి చేస్తుందోనని భయపడుతున్నారు. జీహెచ్ఎంసీ వీధికుక్కలను కట్టడి చేయాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు.


Related News

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Big Stories

×