BigTV English

Junior Doctors Strike : రిమ్స్ లో జూనియర్‌ వైద్యులపై దాడి ఘటన.. అసిస్టెంట్ ప్రొఫెసర్ పై వేటు.. ఐదుగురిపై కేసు..

Junior Doctors Strike : రిమ్స్ లో జూనియర్‌ వైద్యులపై దాడి ఘటన.. అసిస్టెంట్ ప్రొఫెసర్ పై వేటు.. ఐదుగురిపై కేసు..

Junior Doctors Strike : ఆదిలాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RIMS)కి చెందిన ఆరుగురు జూనియర్ వైద్యులపై బుధవారం రాత్రి క్యాంపస్‌లోకి చొరబడిన అసిస్టెంట్ ప్రొఫెసర్‌తో సహా ఐదుగురు వ్యక్తులు దాడి చేశారు.


అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతి కిరణ్, అతని స్నేహితులు వసీం, శివ, మరో ఇద్దరు దాడి చేయడంతో జూనియర్ డాక్టర్లు టి. కవిరాజ్, భరత్, పి. నవీన్, అభిషేక్, విజయ్ గాయపడ్డారని ఆదిలాబాద్ టౌన్ సబ్ ఇన్‌స్పెక్టర్ జి. ప్రదీప్ కు తెలిపారు. కవి రాజ్ ఫిర్యాదు మేరకు క్రాంతి కిరణ్, వసీం, శివ, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ సహా మరో ఇద్దరిపై ఐపీసీ 337, 447, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. క్రాంతి కుమార్, వసీం, శివలను అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. క్రాంతి కిరణ్, వసీం, శివతో కలిసి అర్ధరాత్రి క్యాంపస్‌లోకి వెళ్లారు. దీంతో వారు ఐదుగురు జూనియర్ డాక్టర్లతో వాగ్వాదానికి దిగి వారిని కొట్టారు. ఆ తర్వాత క్రాంతి కిరణ్ తన కారు బానెట్‌పై అభిషేక్‌ను 500 మీటర్ల దూరం లాక్కెల్లాడు. జూనియర్ డాక్టర్‌ను గేటు వద్ద పడేసి అక్కడి నుంచి పరారయ్యాడు.


దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు ధర్నాకు దిగారు. వసీమ్‌తో పాటు మరో ముగ్గురు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటన డైరెక్టర్‌కు తెలుసని ఆరోపించారు. బాధితులకు మాజీ మంత్రి జోగు రామన్న సంఘీభావం తెలిపారు.

ఘర్షణలో పాత్ర ఉన్న కారణంగానే అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ క్రాంతి కిరణ్ తొలగించామని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. విద్యార్థుల ఆరోపణలను ఆయన ఖండించారు. తాను విద్యార్థులను ఎప్పుడూ టార్గెట్ చేయలేదని స్పష్టం చేశారు. నేరం రుజువైతే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్న‌ట్లు తెలిపారు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×