BigTV English

Sir CV Raman Olympiad: విద్యార్థుల మెదుడుకు పదునుపెట్టే సర్ సివి రామన్ అంతర్జాతీయ ఒలింపియాడ్ టాలెంట్ ప‌రీక్ష..

Sir CV Raman Olympiad: విద్యార్థుల మెదుడుకు పదునుపెట్టే సర్ సివి రామన్ అంతర్జాతీయ ఒలింపియాడ్ టాలెంట్ ప‌రీక్ష..

Sir CV Raman Olympiad: పిల్లల మేధస్సును మెరుగుపరచడానికి ఎప్పటికప్పుడు పరీక్షలు అవసరం. అలాగే సుచిరిండియా కూడా ఒక కొత్త పరీక్షతో విద్యార్థుల ఐక్యూను టెస్ట్ చేయడానికి సిద్ధమయ్యింది. సుచిరిండియా ఆధ్వ‌ర్యంలో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన స‌ర్ సివి రామ‌న్ ఒలింపియాడ్ పేరుతో పరీక్ష జరిగింది. ఈ పరీక్షలో 1వ త‌ర‌గ‌తి నుండి 10వ త‌ర‌గ‌తి వ‌ర‌కు గ‌ల విద్యార్థుల‌కు ప‌రీక్ష నిర్వ‌హించింది. సర్ సివి రామన్ ఒలింపియాడ్‌కు మంచి ఆదరణ లభించింది. దేశవ్యాప్తంగా దాదాపు 560 కేంద్రాల నుంచి 75 వేల మంది విద్యార్థులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ పరీక్షలో గెలిచిన వారికి కూడా అవార్డులు కూడా అందజేయనున్నారు.


గత 30 ఏళ్లుగా

సర్ సివి రామన్ ఒలింపియాడ్‌లో పాల్గొని గెలిచిన విద్యార్థుల‌కు యంగ్ జీనియ‌స్ అవార్డుల‌ను అందించనున్నారు. ఆ అవార్డులను ఫిబ్ర‌వ‌రి 16న నాంప‌ల్లిలోని ల‌లిత క‌ళా తోర‌నంలో అందించ‌నున్న‌ట్లు సుచిరిండియా సంస్థ వ్య‌వ‌స్థాప‌కులు ల‌య‌న్ డాక్ట‌ర్ వై కిర‌ణ్ తెలిపారు. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని, సృజ‌నాత్మ‌క‌త‌ను వెలికి తీయడమే ఈ ఒలింపియాడ్ లక్ష్యమని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు వారిని సిద్ధం చేసే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు సుచిరిండియా ఫౌండేషన్ ఈ పరీక్షలను నిర్వహిస్తోందని అన్నారు. గత 30 ఏళ్లుగా ప్రతి ఏటా ఈ పరీక్షలు జరుగుతుండడం విశేషం.


Also Read: శాసనసభ ప్రత్యేక సమావేశం, ఏర్పాట్ల పరిశీలనలో స్పీకర్

అందరికీ కృతజ్ఞతలు

శనివారం సర్ సి వి రామన్ ఒలింపియాడ్ పరీక్షను దేశవ్యాప్తంగా 560 కేంద్రాల్లో నిర్వహించింది సుచిరిండియా. ఈ పరీక్షకు 75వేలకు పైగా విద్యార్థులు హాజరయ్యి, తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు సాధించిన వారికి గోల్డ్ మెడల్స్, మెమెంటోలు, నగదు పురస్కారాలు, సర్టిఫికేట్లు అందిస్తామ‌న్నారని నిర్వహకులు తెలిపారు. సుచిరిండియా ఫౌండేషన్ తరపున నిర్వహించిన సర్ సి.వి రామన్ ఒలింపియాడ్ పరీక్షకు హైజరైన విద్యార్థులందరికీ, పరీక్షకు విద్యార్థులను తీసుకొచ్చిన విద్యా సంస్థలకు ఫౌండేషన్ చైర్మన్ లయన్ డాక్టర్ వై. కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఉత్తమ ర్యాంకు సాధించి, గోల్డ్ మెడల్స్ పొందే విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×