E-Paper
Advertisement

India’s Cable-Stayed Bridge: అంజి ఖాడ్ కేబుల్ బ్రిడ్జిపై రైల్వే లోడ్ టెస్ట్, వీడియో చూస్తే వావ్ అనాల్సిందే!

India’s Cable-Stayed Bridge: అంజి ఖాడ్ కేబుల్ బ్రిడ్జిపై రైల్వే లోడ్ టెస్ట్, వీడియో చూస్తే వావ్ అనాల్సిందే!
Advertisement

Indian Railways: భారతీయ రైల్వే సంస్థ అత్యాధునిక టెక్నాలజీ సాయంతో తన నెట్ వర్క్ ను శరవేగంగా విస్తరిస్తున్నది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఎన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేట్టింది. రామేశ్వరంలోని వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే సీ బ్రిడ్జ్ మొదలుకొని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఉధంపూర్-బారాముల్లా-శ్రీనగర్ రైల్ లింక్ ప్రాజెక్టును సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసింది. వంతెనలు, సొరంగాలను పూర్తి చేసింది. త్వరలోనే జమ్మూకాశ్మీర్ తో దేశంలోని ఇతర ప్రాంతాలకు  రైల్వే కనెక్టివిటీ పెరగనుంది. కొత్త సంవత్సరంలో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు చేస్తున్నది.

అంజి ఖాన్ కేబుల్ బ్రిడ్జిపై రైల్వే లోడ్ టెస్ట్

Advertisement

ఉధంపూర్- బారాముల్లా- శ్రీనగర్ రైల్ లింక్ ప్రాజెక్టులో భాగంగా అంజి సెక్షన్ లో తొలి రైల్వే కేబుల్ బ్రిడ్జి నిర్మించారు. తాజాగా ఈ అంజి ఖాడ్ కేబుల్ వంతెనపై లోడ్ టెస్ట్ మొదలు పెట్టారు. తాజాగా ఈ ట్రైయల్ రన్ కు సంబంధించిన వీడియోను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇందులో ఓ గూడ్స్ రైలు కంకరతో వెళ్తుండగా, మరోవైపు బ్రిడ్జి మీద ట్రక్కులను నిలబెట్టి ఈ ట్రయర్స్ నిర్వహించారు.

Advertisement

నార్త్ రైల్వేలోని కత్రా- బనిహాల్ విభాగంలో ఈ కేబుల్ వంతెనను నిర్మించారు. ఈ బ్రిడ్జి పొడవు 473.25 మీటర్లు కాగా, వెడల్పు 15 మీటర్లు. వంతెన మధ్యలో 193 మీటర్ల ఎత్తులో ఒకే పైలాన్‌ ను నిర్మించారు. ఈ బ్రిడ్జిపై ఇప్పటికే  సంగల్దాన్ నుంచి రియాసి స్టేషన్ వరకు ఇంజిన్ తో పాటు గూడ్స్ రైళ్లను నడుపుతూ ట్రయల్స్ నిర్వహించారు. ఇప్పటికే పలు పరీక్షలను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు.

ట్రాక్‌పై లోడ్ టెస్ట్ ఎలా చేశారంటే?  

తొలుత అంజి ఖాడ్ రైల్వే కేబుల్ బ్రిడ్జి మీద మొదట ఇంజిన్ తో గంటకు 20 కి.మీ వేగంతో కత్రా నుంచి రియాసి స్టేషన్‌ వరకు నడిపారు. ఆ తర్వాత గంటకు 30 కి. మీ వేగంతో రియాసి నుంచి కత్రాకు తిరిగి వచ్చింది. ఆ తర్వాత  కంకరతో లోడ్ చేసిన 32 ర్యాక్‌ లతో కూడిన గూడ్స్ రైలు కత్రా నుండి రియాసి స్టేషన్‌కు చేరుకుంది. టెస్ట్ సందర్భంగా గూడ్స్ రైలుకు రెండు ఇంజన్లు, రెండు ప్రత్యేక బ్రేక్ కోచ్‌ లను అధికారులు అమర్చారు.

2008 నుంచి అంజిఖాడ్ రైల్వే వంతెన నిర్మాణానికి ప్రణాళికలు   

ఇక ఈ అంజి ఖాడ్ కేబుల్ వంతెన నిర్మాణం 2008లో ప్రారంభించారు. అయితే, కొన్ని ఇబ్బందులు ఎదురుకావడంతో   ముందుగా అనుకున్న ట్రాక్ డిజైన్‌ ను రద్దు చేసి  కేబుల్  వంతెనను నిర్మించాలని భావించారు. 2015లో శ్రీధరన్ కమిటీ స్పాట్ కు చేరుకుని పరిస్థితిని అంచనా వేసింది. అనంతరం కేబుల్‌ బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. 2017లో అంజి ఖాడ్‌పై కేబుల్‌-స్టేడ్‌ బ్రిడ్జి నిర్మాణాన్ని మొదలు పెట్టి తాజాగా పూర్తి చేశారు.

Read Also: ప్రారంభానికి రెడీ అవుతున్న వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే సీ బ్రిడ్జ్, దీని ప్రత్యేకతలు ఎంతో తెలుసా?

Related News

దేశంలోని 5 అద్భుతమైన వైల్డ్‌లైఫ్ సఫారీలు.. వన్య ప్రాణులు చూడాలనుకుంటే జూలై బెస్ట్

వేముల‌వాడ రాజ‌న్న‌కు అస‌లు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ? దీని ర‌హ‌స్యం ఇదే

లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

పాకిస్తాన్ లో జగన్నాథుడి రథయాత్ర.. చూసేందుకు రెండు కళ్లు చాలవనుకోండి!

వర్షాకాలంలో మాత్రమే పరుగులు తీసే హెరిటేజ్ రైలు.. ప్రకృతి ఒడిలో అద్భుత ప్రయాణం!

Big Stories

Advertisement
×