BigTV English

Bengaluru North Indians Instagram: ‘నార్త్ ఇండియన్స్ లేకపోతే బెంగుళూరు ఖాళీనే’.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పై వివాదం

Bengaluru North Indians Instagram: ‘నార్త్ ఇండియన్స్ లేకపోతే బెంగుళూరు ఖాళీనే’.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పై వివాదం

Bengaluru North Indians Instagram| ఇటీవల ఒక ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన రీల్స్ వివాదాస్పందగా మారాయి. ఆ రీల్స్ లో ఆ మహిళా బెంగుళూరు ఇన్‌ఫ్లుయెన్సర్ నగరం ఇంతగా విజయవంతంగా కావడానికి ఉత్తర భారతీయులే కారణమని చెప్పింది. ఒకవే వేళ నార్త్ ఇండియన్స్ బెంగుళూరు వదిలి వెళ్లిపోతే నగరమంతా ఖాళీ అయిపోతుందని.. కనీసం పీజీల్లో (హాస్టల్స్) కూడా ఎవరూ కనిపించరని వ్యాఖ్యలు చేసింది.


ఈ రీల్స్ సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి. ఆమె చేసిన వీడియో వివాదాస్పదంగా మారింది. ఆ రీల్స్ చూసిన బెంగుళూరు నెజిజెన్లు ఆమె పై మండిపడుతున్నారు.

Also Read: 1951లో పిల్లాడు కిడ్నాప్.. 70 ఏళ్ల తరువాత గుర్తుపట్టిన ఫ్యామిలీ..


వివరాల్లోకి వెళితే.. ఇన్‌స్టాగ్రామ్ లో తరుచూ రీల్స్ చేసే ఇన్‌ఫ్లుయెన్సర్ సుగంధ శర్మ.. ఇటీవల బెంగుళూరులోని కోరమంగళ ప్రాంతంలో ఒక వీడియో షూట్ చేసింది. ఆ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. బెంగుళూరు నగరంలో ఉత్తర భారతీయులు నిండిపోయి ఉన్నారని చెప్పింది. ఎక్కడ చూసినా ఉత్తర భారతీయులే కనిపిస్తున్నారు. ఒకవేళ నార్త్ ఇండియన్స్ నగరం వదిలి వెళ్లిపోతే.. బెంగుళూరు నగరం ఖాళీ అయిపోతుంది. ఇక్కడ పీజీల్లో కూడా అంతా ఉత్తరాది వారే ఉంటున్నారు. కనీసం పీజీల్లో కూడా ఎవరూ కనిపించరు. అని చెప్పింది.

అమె చేసిన రీల్స్ వైరల్ కావడంతో చూసిన నెటిజన్లంతా ఆమెను తప్పుబడుతున్నారు. సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు అందరూ ఆమెపై మండిపడుతన్నారు. తెలుగు నటి వర్ష బొల్లమ్మ, యాక్టర్ ర్యాపర్ చందన్ శెట్టి, కన్నడ నటి చైత్ర అచార్, అనుపమ గౌడ, బిగ్ బాస్ ఫేమ్ రాజేష్ రాజన్న, ధనరాజ్ లాంటి పబ్లిక్ ఫిగర్లుకూడా సుగంధ శర్మపై విమర్శలు చేశారు.

Also Read: పండుగ రోజు విషాదం.. ఇడ్లీ తిని వ్యక్తి మృతి.. అత్యాశకు పోయి

ర్యాపర్ చందన్ శెట్టి అయితే.. సుగంధ కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేసిందని చెప్పగా.. నటి అనుపమ గౌడ అయితే బెంగుళూరు నగరంలో సమైక్య భావం, బహుళజాతి సంస్కృతి ఉందని దాన్ని కాపాడాలే గానీ ఇలాంటి వ్యాఖ్యాలు చేయడం సరికాదని అభిప్రాయపడింది. ”మీరు చేసిన వ్యాఖ్యలు కూల్ అని మీకు అనిపించొచ్చు. కానీ అవి కూల్ గా లేవు. మీకు బెంగుళూరు నగరం అవసరముంది. కానీ బెంగుళూరు నగరానికి మీ అవసరం లేదు. మీరు ఒకవేళ వెళ్లిపోయినా.. మా ఊరికి ఏ మార్పు జరగదు. మేమంతా మీరు బెంగుళూరు వదిలి వెళ్లిపోవాలనే కోరుకుంటున్నాం. మీకిది అర్థమైతే మంచిది” అని గౌడ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా రిప్లై ఇచ్చింది.

తెలుగు నటి వర్ష బొల్లమ్మ అయితే.. ”చాలా మంచిది.. ముందు బయలుదేరండి.. వీలైనంత త్వరగా ఆ పని చేయండి” అని కామెంట్ చేసింది.

కన్నడ నటి చైత్ర అచార్ కామెంట్ చేస్తూ.. ”మీరు ఒకవేళ బెంగుళూరు వదిలి వెళ్లిపోతే నగరం ఖాళీ అయిపోతుందనుకుంటే.. ఆ ఖాళీతనంలోనే మేము జీవిస్తాం. బెంగుళూరు నగరంలోని పబ్బుల్లో డ్యాన్సర్లుగా నార్త్ ఇండియన్స్ ఉన్నారు. వారు వెళ్లిపోయినా మేము పబ్బులకు వెళ్తాం. మిగతా నార్త్ ఇండియన్స్ సంగతి పక్కన బెట్టి.. ముందు మీరు దయచేయండి మేడమ్” అని రాసింది.

Also Read:  జూపార్క్ లో పాండాలను చూడడానికి ఎగబడిన జనం.. నకిలీ పాండాలని తెలియడంతో హంగామా!

Related News

Hyderabad News: మిడ్ నైట్ రోడ్లపై హంగామా.. ఓ చేతిలో బాటిల్.. మరో చేతిలో, కెమెరాకి చిక్కాడు

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Big Stories

×