E-Paper
Advertisement

ఫార్మా కంపెనీలకు బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇకపై ఆ పప్పులు ఉడకవు!

ఫార్మా కంపెనీలకు బిగ్ షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఇకపై ఆ పప్పులు ఉడకవు!
Advertisement

Pharma Companies: స్వేచ్ఛ బ్యూరో: ఫార్మా కంపెనీల అనైతిక మార్కెటింగ్​ పద్దతులపై సుప్రీం కోర్టు సీరియస్​ అయ్యింది. ఇలాంటి ధోరణులను అడ్డుకునేందుకు చట్టపరమైన నిబంధనలు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఇలాంటి అనైతిక మార్కెటింగ్​ కు చెక్​ పెట్టటానికి ఎలాంటి నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందన్న దానిపై కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పలు ఫార్మా సంస్థలు తమ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకోవటానికి అనైతక పద్దతులు పాటిస్తున్నారంటూ సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలైంది.

చట్టబద్ధత కల్పించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా?

Advertisement

వైద్యులను ప్రభావితం చేసేలా ఫార్మా కంపెనీలు డాక్టర్లకు నగదు ప్రయోజనాలు, విదేశీ పర్యటనలు, ఖరీదైన బహుమతులు ఇస్తూ తాము ఉత్పత్తి చేస్తున్న మందులను ఎక్కువగా రోగులకు సిఫార్సు చేసలా ప్రభావితం చేస్తున్నాయని పిటిషనర్​ పేర్కొన్నారు. దీనిపై సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ప్రస్తుతం ఉన్న నిబంధనలపై ప్రభుత్వ నియంత్రణ లేక‌పోతే అవి స్వచ్ఛంధంగా మారిపోయే ప్రమాదం ఆందోళ‌న వ్యక్తం చేసింది. వీటిని అరికట్టడానికి చట్టబద్ధమైన కఠిన నిబంధనలు అవసరమని అభిప్రాయపడింది. దీనికి చట్టబద్ధత కల్పించే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా? అని ప్రశ్నించింది.

వైద్యులపై క్రమశిక్షణా చర్యలు..

Advertisement

దీనిపై సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా స్పందిస్తూ ఫార్మా కంపెనీల నుంచి బహుమతులు, విదేశీ టూర్లు , ఆతిథ్యం, నగదు వంటి లాభాలు పొందే వైద్యులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే నిబంధనలు ఇప్పటికే ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఫార్మా కంపెనీల అనైతిక మార్కెటింగ్​ కు చెక్​ పెట్టే అంశంపై చట్టపరమైన నియంత్రణ అవసరమా?అవసరమైతే అది ఏ రూపంలో ఉండాలి? అన్న దానిపై పరిశీలన జరపటానికి ప్రభుత్వం ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఈ కమిటీ రెండు నెలల్లో తన నివేదికను సమర్పించనుందని పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

జ‌న‌ర‌ల్ వాద‌న‌పై పిటీష‌న‌ర్లు అభ్యంత‌రం..

అప్పటి వరకు ప్రస్తుతమున్న యూసీపీఎంపీ నిబంధనలే అమల్లో ఉంటాయని చెప్పారు. సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ వాద‌న‌పై పిటీష‌న‌ర్లు అభ్యంత‌రం వ్యక్తం చేశారు. 2022లోనే ప్రభుత్వం ఇలాంటి హైపవర్ కమిటీని ఏర్పాటు చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు. ఆ కమిటీ నివేదికపై తదుపరి చర్యలు తీసుకోకుండానే ఇప్పుడు మళ్లీ మరో కొత్త కమిటీ ఎందుకని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఉచితాలు, ఇతర ప్రయోజనాలను స్వీకరించే వైద్యులపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నారన్నారు. తప్పితే ఉచితాల‌ను ఆఫ‌ర్ చేసే ఫార్మా కంపెనీల‌పై ఎలాంటి క‌ఠిన‌మైన చ‌ర్యలు తీసుకోవటం లేదని పిటిషనర్ల తరపు న్యాయవాది సంజయ్‌ పారిఖ్‌ వాదించారు. దాంతో ఫార్మా కంపెనీలు వైద్యుల ప్రిస్క్రిప్షన్లను త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటున్నాయన్నారు.

కేంద్రానికి సుప్రీం కోర్డు ఆదేశాలు..

ఇరుప‌క్షాల వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఫార్మా కంపెనీల అనైతిక మార్కెటింగ్ పద్ధతులకు అడ్డుకట్ట వేసేందుకు, వైద్యులకు ప్రలోభాలు పెట్టకుండా నియంత్రించేందుకు అవసరమైన చట్టబద్ధమైన నిబంధనలను రూపకల్పన చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రానికి ఆదేశించింది. ఈ క‌మిటీ రెండు నెల‌ల్లో త‌న నివేదిక‌ను కేంద్రానికి అందయాలని తెలిపింది. కేంద్రం స‌మ‌ర్పించే అఫిడ‌విట్‌ను ప‌రిశీలిస్తామ‌ని పేర్కొంది. అనంత‌రం త‌దుప‌రి విచార‌ణ‌ను జ‌న‌వ‌రి 29వ తేదీకి వాయిదా వేసింది.

Also Read: మెట్రో పనుల సమీపంలో కుంగిన రోడ్డు.. గుంతలో పడి బోల్తా కొట్టిన కారు

Tags

Related News

ఇంటర్,డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు..హైదరాబాద్‌లో 50 కంపెనీలతో భారీ జాబ్ మేళా

ఏపీ, తెలంగాణలో దసరా సెలవుల షెడ్యూల్ విడుదల!

హైదరాబాద్‌వాసులూ జాగ్రత్త.. రోడ్డుపై చెత్త వేస్తే కెమెరా కన్ను మీపైనే!

రోడ్ డస్ట్‌పై సర్కార్ మాస్టర్ ప్లాన్.. వాయు కాలుష్యానికి చెక్ పెట్టేలా బిగ్ స్టెప్!

రైతులకోసం తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. కొత్త సేవలు ప్రారంభం!

ఆపరేషన్ క్రాక్ డౌన్.. 101 మంది సైబర్ కేటుగాళ్ల అరెస్ట్!

మూసీ పునరుజ్జీవంలో మరో కీలక అడుగు.. ఓంకారేశ్వర ఆలయాభివృద్ధికి రూ.1,108 కోట్లు మంజూరు

Big Stories

Advertisement
×