AI Regulation: టెక్నాలజీ పెరుగుతోంది. దానితో పాటు టెన్షన్ కూడా పెరుగుతోంది. AIతో అద్భుతాలు సాధ్యమవుతున్నా అదే టెక్నాలజీతో తయారవుతున్న డీప్‌ఫేక్‌లు ఇప్పుడు పెద్ద సవాల్‌గా మారుతున్నాయి. AI సేఫ్టీ డీప్‌ఫేక్‌లు మానవీయ కోణం అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని AI నియంత్రణకు మార్గదర్శకాలు సిద్ధం చేయాలని కేంద్రం నిర్ణయించింది. నెల రోజుల్లోనే కన్సల్టేషన్ పేపర్ తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. భారత్‌లో AI నియంత్రణకు నిబంధనలు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు.
డీప్‌ఫేక్‌ల నాణ్యత రోజురోజుకూ పెరుగుతోంది. పౌరులు వాటిని నిజమని నమ్మడం మొదలుపెడితే.. తప్పుడు సమాచారాన్ని నమ్మే ప్రమాదం ఉంది. దాని ఆధారంగా తప్పులు చేసే ముప్పు కూడా పెరుగుతుంది. అందుకే డీప్‌ఫేక్‌ల వెనుక ఎవరున్నా విడిచిపెట్టబోమని కఠిన నిబంధనలకు అనుగుణంగా మార్గదర్శకాలు రూపొందిస్తామంటోంది కేంద్రం.
AIకి కళ్లెం వేయడం అంటే టెక్నాలజీని ఆపేయడం కాదని కేంద్రం స్పష్టం చేస్తోంది. చట్టాలతో మాత్రమే AIని నియంత్రించలేమని పరిశ్రమ, టెక్ కంపెనీలు, ఇతర భాగస్వాముల సహకారం కూడా అవసరమని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అంటున్నారు. AI మారాలి కాదు.. AI వాడే విధానం మారాలి. టెక్నాలజీ వేగం పెరగొచ్చు.. కానీ బాధ్యత దానికంటే ముందుండాలని అన్నారు.
Also read: ఒబామాకే ఇచ్చారు.. నాకెందుకివ్వరు.. నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు!