BigTV English

Notice to KTR: కేటీఆర్‌‌కు ఊహించని షాక్.. సుప్రీం నుంచి నోటీసులు, వాట్ నెక్ట్స్?

Notice to KTR: కేటీఆర్‌‌కు ఊహించని షాక్.. సుప్రీం నుంచి నోటీసులు, వాట్ నెక్ట్స్?

Notice to KTR: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ కావడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన చేసిన 25 వేల కోట్ల అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇది కేవలం రాజకీయ విమర్శల పర్యవసానమా? న్యాయస్ధానాల్లోనూ రాజకీయ నేతల మాటలకు బాధ్యత ఉందన్న కొత్త ఆలోచనకు దారితీయనుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి.


కేటీఆర్ ఆరోపణల పుట్టుక ఎలా?
తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో, అధికారాన్ని కోల్పోయిన తరువాత కూడా, కేటీఆర్ తరచూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ వ్యయాల్లో అవినీతి ఉందని, పెద్ద ఎత్తున నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే, కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు రూ. 25,000 కోట్ల అవినీతికి పాల్పడిందని ఒక ప్రసంగంలో పేర్కొన్నారు. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు మీడియాలో, సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి.

పోలీసు కేసు.. హైకోర్టు తీర్పు
కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పోలీస్ స్టేషన్‌లో ఆత్రం సుగుణ అనే సామాజిక కార్యకర్త ఫిర్యాదు చేశారు. ఆమె అభిప్రాయం ప్రకారం, తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ద్వేషాన్ని పెంచేందుకు ప్రయత్నించారని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.


ఈ కేసును సవాల్ చేస్తూ కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఈ కేసులో ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. పబ్లిక్ ఫోరమ్‌లో వ్యక్తిగత అభిప్రాయంగా చెప్పిన మాటలపై కేసు న్యాయసమ్మతం కాదని, న్యాయస్థానం పేర్కొంది.

సుప్రీంకోర్టు పరిణామం
అయితే, హైకోర్టు తీర్పుతో అసంతృప్తికి లోనైన ఆత్రం సుగుణ, దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం న్యాయమూర్తి సంజయ్ కరోల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. పిటిషన్‌ను పరిశీలించిన అనంతరం, కేటీఆర్ స్పందన ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణకు ఆయన తరఫు న్యాయవాదులు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.

రాజకీయాల మీద న్యాయస్థానాల స్పష్టత
ఈ కేసు మరో ముఖ్య విషయాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకొస్తోంది. రాజకీయ నాయకులు తమ ప్రసంగాల్లో చేసే ఆరోపణలు, విమర్శలు నిర్భందంగా ఉంటేనే సరిపోదు. వాటికి న్యాయపరమైన ఆధారాలుంటే తప్పా, పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌ను దుర్వినియోగం చేసినట్లుగా పరిగణించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలు ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉంటే, వాటిపై న్యాయపరంగా విచారణ జరిపే అవకాశం ఏర్పడుతుంది.

Also Read: Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై కారు దగ్దం.. భారీగా ఎగసిపడుతోన్న మంటలు

బీఆర్ఎస్ స్పందన ఎలా ఉండబోతోంది?
ఇప్పుడు రాజకీయంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుత రాజకీయాల నేపథ్యంలో ఇలాంటి నోటీసులు రావడం రాజకీయంగా బిగ్ షాక్ అని వారు భావిస్తున్న పరిస్థితి. అయితే, కేటీఆర్ ఇప్పటికే హైకోర్టు తీర్పుతో న్యాయ విజయం సాధించిన విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. సుప్రీం కోర్టులో కూడా తాము తమ వాదనను సమర్థంగా న్యాయస్థానానికి వివరించబోతున్నామని చెబుతున్నారు.

ఈ కేసు కేవలం కేటీఆర్‌కు సంబంధించిన అంశంగా కాకుండా, భారత్‌ వంటి ప్రజాస్వామిక దేశంలో రాజకీయ నేతలు తమ వ్యాఖ్యలకు ఎంత బాధ్యత వహించాలన్న చర్చకు దారితీసేలా ఉంది. తక్కువ సమాచారం ఆధారంగా రాజకీయ ఆరోపణలు చేయడం ద్వారా ప్రజల మద్దతు సంపాదించాలనుకునే నాయకుల ఆచరణపై న్యాయ వ్యవస్థ తనదైన దృక్పథంతో స్పందిస్తోందని చెప్పవచ్చు. ఈ కేసులో తదుపరి విచారణతో పాటు కేటీఆర్ సమాధానంపై దృష్టి నిలవనుంది. సుప్రీం కోర్టు తీర్పు, తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. కానీ, ఈ పరిణామం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త ఉద్వేగాలకు దారితీస్తోంది.

Related News

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Big Stories

×