Akhil Zainab Wedding : సినీ నటుడు నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ (Akhil)వివాహ వేడుకలు నేడు (శుక్రవారం) ఉదయం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఎంతో ఘనంగా జరిగాయి. కేవలం అత్యంత సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరిగింది. ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చాలా సింపుల్ గా సాంప్రదాయ పద్ధతిలో, అఖిల్ జైనాబ్ (Zainab)మెడలో మూడు ముళ్ళు వేశారని తెలుస్తోంది. ఇక వీరి వివాహం(Wedding) హిందూ సంప్రదాయ పద్ధతిలోనే జరిగింది. ప్రస్తుతం వీరు పెళ్లికి సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా అఖిల్ జైనాబ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అఖిల్, జైనాబ్ వివాహపు వేడుక…
ఇకపోతే నాగార్జున (Nagarjuna)అఖిల్ వివాహాన్ని చాలా సింపుల్ గా జరిపించినా, జులై 8వ తేదీ అన్నపూర్ణ స్టూడియోలో చాలా ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ వివాహ రిసెప్షన్(Wedding Reception) వేడుకకు పెద్ద ఎత్తున సినిమా ఇండస్ట్రీకి చెందినవారు అలాగే రాజకీయ నాయకులు కూడా హాజరు కాబోతున్నారని తెలుస్తుంది. ఇక నాగార్జున స్వయంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు రాజకీయ నాయకులను కూడా ఈ వివాహ వేడుకకు ఆహ్వానించిన విషయం మనకు తెలిసిందే.
అఖిల్ పెళ్లిలో కనిపించని దగ్గుబాటి ఫ్యామిలీ…
ఇలా ఈ వివాహపు వేడుకలలో చిరంజీవి దంపతులతో పాటు ఉపాసన దంపతులు, డైరెక్టర్ ప్రశాంత్ నీల్, శర్వానంద్ వంటి పలువురు సినిమా సెలబ్రిటీలు పాల్గొని సందడి చేశారు. అయితే ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నప్పటికీ ఎక్కడ కూడా దగ్గుబాటి కుటుంబ (Daggubati Family)సభ్యులు అఖిల్ వివాహ వేడుకలలో కనిపించకపోవడం గమనార్హం. దగ్గుబాటి కుటుంబానికి అక్కినేని కుటుంబానికి మధ్య బంధుత్వం ఉన్న విషయం మనకు తెలిసిందే. దగ్గుబాటి వెంకటేష్ సురేష్ బాబులకు అఖిల్ స్వయంగా అల్లుడు వరుస అవుతారు. అలాంటిది తన అల్లుడు పెళ్లికి రాలేదని తెలుస్తోంది.
ప్రస్తుతం అఖిల్ పెళ్లి వేడుకలలో దగ్గుబాటి కుటుంబ సభ్యులు కనిపించకపోవడంతో ఈ పెళ్లి వేడుకలకు దగ్గుబాటి ఫ్యామిలీ దూరంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే ఇలా ఈ కుటుంబం అఖిల్ పెళ్లి వేడుకలకు దూరంగా ఉండడానికి కారణం అందరికీ తెలిసిందే. నాగార్జున మొదట వెంకటేష్ చెల్లెలు లక్ష్మీని వివాహం చేసుకొని నాగచైతన్య పుట్టిన తర్వాత విడాకులు తీసుకొని విడిపోయారు. అప్పటినుంచి నాగార్జున కుటుంబంతో దగ్గుబాటి కుటుంబం అంటీ ముట్టనట్టు ఉన్నారు. అయితే ఇటీవల నాగచైతన్యకు సంబంధించిన వేడుకలకు మాత్రం హాజరవుతూ ఉంటారు. ఇక చైతూ రెండో పెళ్లి చేసుకున్న నేపథ్యంలో ఈ పెళ్లి వేడుకలలో సురేష్ బాబు వెంకటేష్ ఇద్దరు కూడా పాల్గొని సందడి చేశారు కానీ, అఖిల్ పెళ్లి వేడుకలకు దగ్గుబాటి ఫ్యామిలీ దూరంగా ఉన్నారని తెలుస్తోంది. మరి పెళ్లికి దూరంగా ఉన్న ఈ ఫ్యామిలీ రిసెప్షన్ కైనా హాజరవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.