NTR Diamond jubilee: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Ramarao) గారు ఒకరు. ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్టీఆర్ మూల స్తంభం లాంటివారు అని చెప్పాలి. ఇలా సినిమా ఇండస్ట్రీకి ఎన్నో గొప్ప సేవలను అందించిన ఎన్టీఆర్ అనంతరం రాజకీయాలలోకి వెళ్లి సినిమాలను కాస్త తగ్గించారు. ఎంతో మంచి గుర్తింపు పొందిన ఎన్టీఆర్ గారిని స్మరించుకుంటూ ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలను నిర్వహించబోతున్నారు.
న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి ప్రధాన నగరాలలో జరగబోయే ఎన్టీఆర్ 75 సంవత్సరాల సినీ వజ్రోత్సవ, చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాల ఉమ్మడి కార్యక్రమాలను నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యులు శ్రీ టి.డి.జనార్ధన్, ప్రత్యేక అతిధిగా ఎన్టీఆర్ కుమారుడు శ్రీ నందమూరి రామకృష్ణలు పయనమై వెళ్లారు. ఎన్నారై టీడీపీ మరియు తెలుగు సంఘాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలను పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు.
ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుక..
ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలలో భాగంగా మొదటి జూన్ 6న న్యూజిలాండ్ రాజధాని అక్‌లాండ్‌లో జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం తెలుగుదేశం శాసనసభ్యులు శ్రీ బోడే ప్రసాద్, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీ అశ్విన్ అట్లూరితో పాటు ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు కూడా పాల్గొనబోతున్నారు. అయితే ఈయన జూమ్ ద్వారా పాల్గొంటున్నారు. జూన్ 7న మెల్బోర్న్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్య అతిధి శ్రీ టి.డి.జనార్ధన్‌తోపాటు శ్రీ నందమూరి రామకృష్ణ, శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి, శ్రీ బోడే ప్రసాద్, శ్రీ అశ్విన్ అట్లూరి పాల్గొంటున్నారు. ఇక డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు జూమ్ ద్వారా
తన సలహాలు సందేశాలను తెలియజేయునన్నారు.
జూన్ 8న అడిలైడ్ నగరంలో జరిగే 75 సంవత్సరాల ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం కార్యక్రమంతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాల జన్మదిన వేడుకలను ఉమ్మడిగా నిర్వహించబోతున్నారు. ఇక ఈ కార్యక్రమానికి అతిధులుగా శ్రీ టి.డి.జనార్ధన్, శ్రీ నందమూరి రామకృష్ణ, శ్రీ బోడే ప్రసాద్, శ్రీ నారా రోహిత్, శ్రీ అశ్విన్ అట్లూరి, శ్రీ నన్నూరి నర్సిరెడ్డి పాల్గొంటున్నారు.
సిబిఎన్ 75 సంవత్సరాల వేడుక…
జూన్ 9న సిడ్నీ నగరంలో జరిగే కార్యక్రమంలోనూ , అదేవిధంగా జూన్ 11వ తేదీ బ్రిస్బేన్ నగరంలో జరిగే మినీమహానాడు, ఎన్టీఆర్ సినీవజ్రోత్సవ కార్యక్రమాల్లో శ్రీ టి.డి. జనార్ధన్, శ్రీ నందమూరి రామకృష్ణ, శ్రీ సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, శ్రీ బోడే ప్రసాద్, శ్రీ అశ్విన్ అట్లూరిలతోపాటు ప్రముఖ సినీ యువనటుడు శ్రీ నారా రోహిత్, తెలుగుదేశం సీనియర్ నేతచ టిటిడి సభ్యుడు శ్రీ నర్సిరెడ్డి పాల్గొంటారు. ఇలా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలలోనూ, సిబిఎన్ 75 సంవత్సరాల వేడుకలను స్థానిక తెలుగువారు తెలుగు సంఘాల ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈ వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నారు.