BigTV English

Anjani Kumar : మాజీ డీజీపీపై సస్పెన్షన్ ఎత్తివేత.. రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ సమాచారం..

Anjani Kumar : మాజీ డీజీపీపై సస్పెన్షన్ ఎత్తివేత.. రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ సమాచారం..
Anjani kumar latest news

Anjani kumar latest news(Telangana news updates):

తెలంగాణ మాజీ డీజీపీపై కేంద్ర ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటును ఎత్తివేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి రోజున ఎన్నికల కౌంటింగ్ ముగియక ముందే అంజనీకుమార్ టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని కలిశారు. డీజీపీ హోదాలో అంజనీ కుమార్‌తో పాటు ఇతర పోలీస్ అధికారులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.


దీంతో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఎన్నికల సంఘం డీజీపీపై సస్పెన్షన్ వేటు వేసింది. మరో ఇద్దరు పోలీసు అధికారులు మహేశ్ భగవత్, సందీప్ కుమార్ జైన్‌కు నోటీసులు జారీ చేసింది.

దీనిపై ఈసీకి ఐపీఎస్ అధికారి అంజనీకుమార్ వివరణ ఇచ్చుకున్నారు. తాను ఉద్దేశపూర్వకంగా ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించలేదని.. మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం అవ్వవనీ ఈసీకి వివరణ ఇచ్చుకున్నారు. దీంతో ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం.. సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.


Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×