BigTV English

Snapchat Friendship: స్నాప్ చాట్ లో పరిచయమై.. బాలికపై అత్యాచారం!

Snapchat Friendship: స్నాప్ చాట్ లో పరిచయమై.. బాలికపై అత్యాచారం!


Rape on Minor in SR Nagar PS Limits: సోషల్ మీడియా వచ్చాక.. స్నేహాలు సరిహద్దులు దాటుతున్నాయి. జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు దాటితే ఫర్వాలేదు. కానీ.. ఇక్కడ మనిషికి మనిషికీ మధ్య హద్దులు కూడా దాటుతున్నాయి. మితిమీరిన చాటింగ్, అడగ్గానే ఫొటోలు, వీడియోలు షేర్ చేయడమే వాళ్లు చేస్తున్న నేరం. అవే వారి జీవితాన్ని కబళిస్తున్నాయి. సోషల్ మీడియా పరిచయాలతో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ఎంత హెచ్చరించినా సరే.. యువత పక్కదారిలోనే వెళ్తోంది.

నిందితులను శిక్షించేందుకు ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా సరే.. మృగాళ్ల ఆలోచనల్లో మార్పనేది రావట్లేదు. తాజాగా హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్ పీఎస్ పరిధిలో దారుణ ఘటన జరిగింది. స్నాప్ చాట్ లో పరిచయమైన వ్యక్తి.. మైనర్ ను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అమీర్ పేట – బల్కంపేట రోడ్డులో ఉన్న సోనాబాయి ఆలయానికి సమీపంలో గణేష్ యాదవ్ (20) నివాసం ఉంటున్నాడు. అతను స్నాప్ చాట్ లో అదే ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలికతో పరిచయం పెంచుకున్నాడు.


Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కొత్త కోణం.. ఇజ్రాయెల్ నుంచి ట్యాపింగ్ డివైజ్

నిన్ను చూడాలని ఉంది. ఫొటోలు పంపించు అనగానే పంపడం ఆమె పాలిట శాపమైంది. ఆ ఫొటోలను మార్ఫింగ్ చేసి.. వీడియోలు చూపించి బెదిరించి బలవంతంగా కామవాంఛ తీర్చుకున్నాడు. బాలికపై రెండుసార్లు అత్యాచారానికి తెగబడ్డాడు. దాంతో 9వ తరగతి చదువుతున్న బాలిక.. మనస్తాపంతో ఉన్నట్టుండి స్కూల్ కు వెళ్లడం మానేసింది. అనుమానం కలిగిన తల్లి ఏం జరిగిందని ప్రశ్నించగా.. జరిగిన విషయాన్ని చెప్పింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Tags

Related News

Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. రాష్ట్రంలో మరో మూడు రోజులు కుండపోత వర్షాలు..

Weather News: రాష్ట్రానికి బిగ్ రెయిన్ అలర్ట్.. నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ ప్రాంతవాసులు జాగ్రత్త..!

Panchayat Elections: సర్పంచ్ ఎన్నికలు.. తుది ఓటర్ల జాబితా విడుదలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల

Nalgonda News: ఖరీదైన కార్లలో మేకలు, గొర్రెల దొంగతనం.. 16 మంది అరెస్ట్

Mehdipatnam accident: మెహదీపట్నం బస్టాప్‌లో RTC బస్సుకు మంటలు.. క్షణాల్లో బూడిద!

Hyderabad: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. 50 మంది విద్యార్థులకు డ్రగ్స్ పాజిటివ్

Big Stories

×