BigTV English

Sonu Srinivas Gouda Remanded for 14 days: బిగ్ బాస్ ఫేమ్‌ సోను శ్రీనివాస్ గౌడకి 14 రోజుల కస్టడీ.. సెంట్రల్ జైలుకు తరలింపు!

Sonu Srinivas Gouda Remanded for 14 days: బిగ్ బాస్ ఫేమ్‌ సోను శ్రీనివాస్ గౌడకి 14 రోజుల కస్టడీ.. సెంట్రల్ జైలుకు తరలింపు!
BiggBoss Fame Arrest
BiggBoss Fame Arrest

Bigg Boss Fame Sonu Srinivas Gouda Remanded for 14 days: అక్రమ దత్తత కేసులో కన్నడ బిగ్ బాస్ ఫేమ్‌కి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. బాలికను అక్రమంగా దత్తత తీసుకున్నారనే ఆరోపణలు వచ్చిన కేసులో బిగ్ బాస్ ఫేమ్ సోనూ శ్రీనివాస గౌడను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సోను గౌడను కోర్టులో హాజరుపరచగా.. విచారణ జరిపిన న్యాయస్థానం ఆమెకు 14 రోజుల కస్టడీ విధించింది. ఈ మేరకు ఏప్రిల్ 8వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ సీజేఏం కోర్టు జడ్జి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆమెను బెంగుళూరు సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా 8 ఏళ్ల బాలికను అక్రమంగా దత్తత తీసుకున్నారనే కేసులో సోనును బాదరహళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


అసలేం జరిగిందంటే..?

8 ఏళ్ల బాలికను తాను దత్తత తీసుకున్నట్లు సోను శ్రీనివాస గౌడ మార్చి 2న సోషల్ మీడియాలో వెల్లడించింది. ఈ మేరకు ఓ యూబ్యూబ్ వీడియోను షేర్ చేస్తూ అందులో వివరించింది. దత్తత తీసుకునేందుకు బాలిక తల్లిదండ్రులు కూడా అంగీకరించాకే ఈ పని చేసినట్లు తెలిపింది. అంతేకాదు తాను దత్తత ప్రక్రియకు సంబంధించి అన్ని పాటించినట్లు పేర్కొంది. బాలిక కుటుంబం ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని అందువల్లే తాను దత్తత తీసుకుని బాలికకు మంచి జీవితాన్ని ఇవ్వాలని అనుకున్నట్లు పేర్కొంది.


రాయ్‌చూర్‌కు చెందిన బాలికను సోను దత్తత తీసుకుంది. బాలిక తల్లిదండ్రులకు అనేక సౌకర్యాలు కల్పించి దత్తత ప్రక్రియ చేపట్టినట్లు సోనుపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. కేవలం సమాజంలో పేరు, ప్రతిష్టల కోసం, సానుభూతి కోసమే సోను దత్తత తీసుకున్నట్లు రాష్ట్ర బాలికల సంఘం నేత ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాదు దత్తత తీసుకున్న చిన్నారితో కలిసి సోషల్ మీడియాలో రీల్స్, వీడియోస్ చేస్తూ వారి సమాచారాన్ని అలా బహిరంగంగా చెప్పి సానుభూతి కోసం ఈ పనులు చేసినట్లు ఫిర్యాదు చేశారు. స్కూలుకు వెళ్లి చదువుకోవాల్సిన చిన్నారితో ఇలా రీల్స్ చేస్తూ కేవలం తాను ఫేమస్ అయ్యేందుకే ఇలా చేశారని అన్నారు.

Also Read: Kalki 2898 AD: కల్కిలో కమల్ విలన్ కాదంట.. మరి కొత్త విలన్ ఎవరు..?

చిన్నారులను దత్తత తీసుకోవాలంటే చాలా పెద్ద ప్రక్రియ ఉంటుంది. బాలికను దత్తత తీసుకోవాలనుకునే వారికి హిందూ దత్తత చట్టం ప్రకారం బిడ్డకు, దత్తత తీసుకునే వ్యక్తికి మధ్య 25 ఏళ్ల వయస్సు తేడా ఉండాలి. ఇదంతా కేంద్ర, రాష్ట్ర అడాప్షన్ అథారిటీ సమక్షంలోనే జరిగితే చట్టరీత్యా దత్తత తీసుకున్నట్లు సర్టిఫికేట్ వస్తుంది.

Tags

Related News

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

Big Stories

×