E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యం.. డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు!

డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యం.. డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు!
Advertisement

Bhatti Vikramarka: స్వేచ్ఛ బ్యూరో: జీవితం ఎంతో విలువైందని..డ్రగ్స్​ కు అలవాటు పడి నాశనం చేసుకోవద్దని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. ఆరోగ్యవంతమైన యువతే తెలంగాణ భవిష్యత్తు అన్నారు. మాదకద్రవ్యాలకు తెలంగాణలో ఎలాంటి స్థానం ఉండదని స్పష్టం చేశారు. ఇంటర్నేషనల్​ యాంటీ డ్రగ్ డే సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఈగల్​ ఫోర్స్​, సామాజిక న్యాయం సాధికారిత శాఖ మాదక దవ్రాల వ్యతిరేక అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించాయి.

భట్టి విక్రమార్క మాట్లాడుతూ..

Advertisement

దీనికి ముఖ్య అతిధిగా వచ్చిన భట్టి విక్రమార్క మాట్లాడుతూ  డ్రగ్స్ నిర్మూలనలో ప్రభుత్వం కేవలం చట్టపరమైన చర్యలకే పరిమితం కాకుండా వాటి వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని తెలిపారు. ఇందుకోసం ఈగల్ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి అత్యాధునిక సాంకేతిక వనరులు, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామని చెప్పారు. ప్రతి యువకుడు జీవితాన్ని విలువైనదిగా భావించి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, తల్లిదండ్రుల ఆశలను నెరవేర్చేలా ఎదగాలని సూచించారు.

అవగాహన కార్యక్రమాలు

Advertisement

డ్రగ్స్ నియంత్రణకు చట్టాలు మాత్రమే సరిపోవని, సమాజంలో అవగాహన, బాధ్యత, విలువలు పెరిగినప్పుడే నిజమైన మార్పు వస్తుందన్నారు. దేశంలో వరకట్న నిషేధ చట్టం ఉన్నాసమాజంలో పరివర్తన రాకపోవడం వల్లనే అది సరిగ్గా  అమలు జరగటం లేదన్నారు. విద్యాసంస్థలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు అందరూ కలిసి యువతను డ్రగ్స్​ బారిన పడకుండా ప్రభావితం చేయాలన్నారు. సినీ నటీనటులు డ్రగ్స్ వ్యతిరేకంగా చిన్న వీడియో సందేశాలు ఇచ్చినా సమాజంపై ఎంతో సానుకూల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు. పోలీసు శాఖ, విద్యాశాఖ, మహిళా సంక్షేమ శాఖ, ఈగల్ విభాగం చేపట్టే ప్రతి అవగాహన కార్యక్రమానికి ప్రభుత్వం సంపూర్ణ మద్దతు అందిస్తుందని తెలిపారు.

ప్రతి యువకుడు డ్రగ్స్‌కు ‘నో’ చెప్పాలి

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ డ్రగ్స్ అనేది యువత భవిష్యత్తును నాశనం చేసే సామాజిక శాపమని అన్నారు. డ్రగ్స్ నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈగల్ విభాగాన్ని ఏర్పాటు చేసి కఠిన చర్యలు చేపడుతోందన్నారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు. డ్రగ్స్‌కు బానిసైన వారిని సమాజం దూరం పెట్టకుండా వారికి సరైన మార్గం చూపాలన్నారు. మిత్రుల్లో ఎవరైనా డ్రగ్స్‌కు అలవాటు పడితే వారిని ఆ ప్రమాదం నుంచి బయటపడేలా సహకరించాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ నియంత్రణ అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని చెప్పారు. సమాజమంతా కలిసి పోరాడాల్సిన యుద్ధమని పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న డ్రగ్స్ వ్యతిరేక పోరాటంలో ప్రతి ఒక్కరూ సైనికులుగా మారాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోంది..

డ్రగ్స్ నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈగల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి దేశంలోనే అత్యుత్తమ డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థగా తీర్చిదిద్దిందని ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు. డ్రగ్స్ నియంత్రణ అత్యంత సవాళ్లతో కూడుకున్న బాధ్యత అని చెప్పారు. ఈ పోరాటంలో ఈగల్ బృందానికి అవసరమైన ప్రత్యేక వాహనాలు, డ్రగ్ డిటెక్షన్ పరికరాలు, ఆధునిక సాంకేతిక వనరులను తెలంగాణ ప్రభుత్వం అందించిందని తెలిపారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. 2024లో నిర్వహించిన చర్యల్లో 822 మంది విద్యార్థులు డ్రగ్స్‌కు సంబంధించిన కేసుల్లో గుర్తించబడ్డారని, అలాగే సుమారు 600 మంది డ్రగ్స్ వినియోగదారులను గుర్తించి కౌన్సెలింగ్‌కు పంపించామని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనలో చట్టపరమైన చర్యలతో పాటు అవగాహన, కౌన్సెలింగ్, పునరావాసం కూడా కీలకమని పేర్కొన్నారు.

సినీ ప్రముఖుల పిలుపు..

సినీ హీరో రామ్ పోతినేని, నటి మీనాక్షి చౌదరి యువత డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని చెప్పారు. జీవితంలో లక్ష్యాలను సాధించడమే నిజమైన విజయమన్నారు. క్రీడాకారిణి అరుణ బుద్ధా రెడ్డి కూడా క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారానే యువత ఉన్నత శిఖరాలను చేరుకోగలరని పేర్కొన్నారు.

విజేతలకు బహుమతుల ప్రదానం ..

డ్రగ్స్ వ్యతిరేక అవగాహనలో భాగంగా నిర్వహించిన డ్రాయింగ్, వ్యాసరచన, ఇతర పోటీల్లో విజేతలుగా నిలిచిన  విద్యార్థులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ సీ.వీ.ఆనంద్ తదితరులు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న అందరూ “డ్రగ్స్‌కు నో చెప్పండి – ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మిద్దాం” అని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనిత రామచంద్రన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్​ ఎం.రమేశ్​ ఈగల్ విభాగం అధికారులు, విద్యార్థులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related News

పాస్‌పోర్ట్ ఉంటే భారతీయుడైనట్లేనా?.. ఒవైసీకి కిషన్ రెడ్డి దిమ్మతిరిగే కౌంటర్!

ఆర్‌ఎస్‌పీ ప్రాణాలకే ప్రమాదమా? కాంగ్రెస్ ప్రభుత్వంపై శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు!

తుంగభద్ర నీటిపై రేవంత్ రెడ్డికి బీజేపీ షాక్.. ఆ 15.9 టీఎంసీల కథేంటి?

ఆధారాలు లేకుండా మాట్లాడొద్దు.. హరీష్ రావు వ్యాఖ్యలపై కూనంనేని సాంబశివరావు ఫైర్!

ఎస్సీఈఆర్టీ కీలక ఉత్తర్వులు.. టీచర్లకు స్పెషల్ వర్క్‌షాప్.. ఎందుకంటే?

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉద్రిక్తత.. 12 గ్రామాల్లో ‘SIR’ ప్రక్రియ బహిష్కరణ!

మెగా డీఎస్సీ ఏమైంది? కాంగ్రెస్ ప్రభుత్వంపై జీవన్ రెడ్డి ఫైర్!

Big Stories

×