E-Paper
Advertisement

తెలంగాణలో ‘ఖేలో ఇండియా’ ధమాకా.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు!

తెలంగాణలో ‘ఖేలో ఇండియా’ ధమాకా.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు!
Advertisement

Khelo India Youth Games: తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎంసీఆర్ హెఆర్డీలోని బోధి పెవిలియన్ లో ఖేలో ఇండియా యూత గేమ్స్ ఏర్పాట్లు, నిర్వహణపై మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

అభివృద్ధి చేసేందుకు చర్యలు..

Advertisement

జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొనే ఈ పోటీలకు సంబంధించి మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. డిసెంబరులో పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. హైదరాబాద్ లోని స్టేడియం లలో ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి, క్రీడా పోటీలకు అనుగుణంగా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు అవసరమైన నిధులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

అతిథులకు కావాల్సిన సౌకర్యాల ఏర్పాట్లు..

Advertisement

ప్రారంభోత్సవ, ముగింపు వేడుకలకు సంబంధించిన ముఖ్య అతిథులు, ప్రముఖ క్రీడాకారులు, సినీ ప్రముఖులను కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలన్నారు. మౌలిక వసతులు, క్రీడల నిర్వహణ, అతిథులకు కావాల్సిన సౌకర్యాల ఏర్పాట్లకు సంబంధించి పని విభజన చేసుకుని బాధ్యత తీసుకోవాలని తెలిపారు. తెలంగాణకు చెందిన అర్జున అవార్డు గ్రహీతలు, తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు సభ్యులు, ఒలింపిక్స్ అసోసియేషన్ తో పాటు జాతీయ స్థాయి క్రీడా ప్రతినిధులను కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు.

సమావేశంల పలువురు..

ఇందుకు సంబంధించి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో భాగంగా 20 రకాల స్పోర్ట్స్ కు సంబంధించిన పోటీలు నిర్వహించనున్న నేపథ్యంలో.. క్రీడా విభాగాల వారీగా పోటీ ప్రదేశాలను గుర్తించి ఏర్పాట్లు చేయాలన్నారు. క్రీడా స్ఫూర్తిని చాటేలా నిర్వహణ ఉండాలని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, SATG చైర్మన్ శివసేనా రెడ్డి, క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, SATG ఎండీ సోనీబాల దేవి పాల్గొన్నారు.

Also Read: ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Tags

Related News

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు బిగ్ షాక్.. వచ్చే మంగళవారం కోర్టులో హాజరుకావాల్సిందే!

నాగార్జునతో కలిసి తమ్మిడికుంట చెరువును ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రత్యేకతలు ఇవే!

ప్రపంచానికి దిశానిర్దేశం చేయనున్న హైదరాబాద్.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

‘కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ బుద్ధి చెప్పండి’.. గ్రాడ్యుయేట్లకు కవిత పిలుపు!

మేడ్చల్ కలెక్టర్ మనూ చౌదరిపై హైకోర్టు ఆగ్రహం.. సీపీకి కీలక ఆదేశాలు

తెలంగాణ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు.. 10+2 విధానంపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం!

మహబూబాబాద్‌లో ఘోర ప్రమాదం.. బైక్‌ను ఢీకొట్టిన కారు, దంపతుల మృతి

చనిపోయిన చోట కూడా చౌకబారు రాజకీయాలా..? హరీష్ రావుపై అద్దంకి ఆగ్రహం

Big Stories

Advertisement
×