E-Paper
Advertisement

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు కూలీలు దుర్మరణం!

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు కూలీలు దుర్మరణం!
Advertisement

Sangareddy Road Accident: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ నియోజకవర్గ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సత్వార్‌ గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న యూ-టర్న్‌ వద్ద ఒక ట్యాంకర్.. కూలీలతో ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

కర్ణాటక రాష్ట్రంలోని హుమ్నాబాద్‌ వైపు నుంచి జహీరాబాద్‌కు వేగంగా వస్తున్న ఒక ట్యాంకర్, కూలీలతో ప్రయాణిస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరణించిన వారంతా కర్ణాటక రాష్ట్రం రాజగిరి గ్రామానికి చెందిన కూలీలుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

Advertisement

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల పూర్తి వివరాలపై దర్యాప్తు వేగవంతం చేశారు.

Also Read: మెమోలు ఇచ్చాం.. హెచ్చరించాం.. ఇక నెక్స్ట్ సీరియస్ ‘యాక్షనే’!

Tags

Related News

ఆర్‌టీసీ గుర్తింపు ఎన్నికల వేల.. కాంగ్రెస్‌ పార్టీకి షాకిచ్చిన ఎమ్మెల్యే కూనంనేని!

తెలంగాణలో ఉచిత చేప పిల్లల పంపిణీ.. ఏ జిల్లాలకు ఎంత? పూర్తి వివరాలివే!

తెలంగాణలో కొత్త బార్లకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు తేదీలివే?

బేగంబజార్‌లో నకిలీ నోట్ల దందా.. పోలీసులకు చిక్కిన రాజస్థాన్ యువకుడు!

మంత్రి పదవి రూమర్లకు చెక్ పెట్టిన రాజ్‌గోపాల్‌ రెడ్డి.. చివరికి ఎమన్నారంటే?

హెచ్‌సీఏ వర్సెస్ టీసీఏ.. ముదురుతున్న తెలంగాణ క్రికెట్ వివాదం!

అల్లుడి నోట్లో శనిలా రేవంత్, ఉత్తమ్!.. నీటి సంక్షోభంపై జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు!

మీ భూమి 22A జాబితాలో ఉందా? పెండింగ్ యూఎల్సీ దరఖాస్తులపై సర్కార్ కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×