E-Paper
Advertisement

పోలీస్ శాఖలో ‘ఆ నలుగురు’ కథ క్లోజ్?.. డీజీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు!

పోలీస్ శాఖలో ‘ఆ నలుగురు’ కథ క్లోజ్?.. డీజీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు!
Advertisement

DGP CV Anand: స్వేచ్ఛ బ్యూరో: ఆ నలుగురిని పలుమార్లు హెచ్చరించాం.. అయినా, పద్ధతి మార్చుకోవటం లేదు.. ఇది కొనసాగితే చర్యలు తప్పావంటూ డీజీపీ సీ.వీ. ఆనంద్ చేసిన వ్యాఖ్యలు పోలీస్ వర్గాల్లో చర్చనీయంగా మారాయి. వరంగల్ పర్యటనలో ఉన్న డీజీపీ కొందరు అధికారుల వ్యవహారశైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంత చెప్పినా పద్ధతి మార్చుకోకపోతే చర్యలు డీజీపీ హెచ్చరించారు. ముఖ్యంగా ‘ఆ నలుగురు’ అంటూ డీజీపీ చేసిన వ్యాఖ్యలు పోలీస్‌ శాఖలో హాట్‌ టాపిక్‌గా మారాయి.

అధికారులు, సిబ్బంది మధ్య చర్చ..

Advertisement

ప్రస్తుతం ఆ నలుగురు ఎవరనే విషయంపై శాఖలోని అధికారులు, సిబ్బంది మధ్య చర్చ సాగుతోంది. ఇప్పటికే పలుమార్లు సూచనలు, హెచ్చరికలు చేసినా తమ వ్యవహారశైలిలో మార్పు తీసుకురాని వారిపై ఇక కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో డీజీపీ చేసిన వ్యాఖ్యలను ‘ఫైనల్ వార్నింగ్’ గా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.
చర్యలకు అనుమతి లభిస్తుందా..?

వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయి?

Advertisement

అదే సమయంలో డీజీపీ దృష్టికి వచ్చిన అంశాలపై చర్యలు తీసుకునేందుకు ఉన్నతస్థాయిలో అనుమతి లభిస్తుందా? అన్న ప్రశ్న కూడా చర్చనీయాంశంగా మారింది. ‘ఆ నలుగురి’ విషయంలో కీలక నిర్ణయం ఎప్పుడు వెలువడుతుంది? వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయి? అన్నది ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. ఇప్పటివరకు డీజీపీ వ్యాఖ్యల్లో ప్రస్తావించిన ఆ నలుగురు ఎవరనే విషయంపై ఎలాంటి స్పష్టత వెలువడ లేదు. దీంతో పోలీస్‌ శాఖలో జరుగుతున్న ఈ పరిణామాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Also Read: సైబరాబాద్‌లో ట్రాఫిక్ తగ్గించేందుకు అధికారుల బిగ్ ప్లాన్!

Tags

Related News

ఆర్‌టీసీ గుర్తింపు ఎన్నికల వేల.. కాంగ్రెస్‌ పార్టీకి షాకిచ్చిన ఎమ్మెల్యే కూనంనేని!

తెలంగాణలో ఉచిత చేప పిల్లల పంపిణీ.. ఏ జిల్లాలకు ఎంత? పూర్తి వివరాలివే!

తెలంగాణలో కొత్త బార్లకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు తేదీలివే?

బేగంబజార్‌లో నకిలీ నోట్ల దందా.. పోలీసులకు చిక్కిన రాజస్థాన్ యువకుడు!

మంత్రి పదవి రూమర్లకు చెక్ పెట్టిన రాజ్‌గోపాల్‌ రెడ్డి.. చివరికి ఎమన్నారంటే?

హెచ్‌సీఏ వర్సెస్ టీసీఏ.. ముదురుతున్న తెలంగాణ క్రికెట్ వివాదం!

అల్లుడి నోట్లో శనిలా రేవంత్, ఉత్తమ్!.. నీటి సంక్షోభంపై జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు!

మీ భూమి 22A జాబితాలో ఉందా? పెండింగ్ యూఎల్సీ దరఖాస్తులపై సర్కార్ కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×