E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Michael Vaughan: గంభీర్ అస‌లు నీకు బుర్ర ఉందా? వైభ‌వ్ కెరీర్ తో ఆడుకోకు

Michael Vaughan: గంభీర్ అస‌లు నీకు బుర్ర ఉందా?  వైభ‌వ్ కెరీర్ తో ఆడుకోకు
Advertisement

Michael Vaughan:  టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ ( Ireland vs India, 1st T20I) మధ్య టి20 సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే ఇవాళ ప్రారంభమైన ఈ టి20 సిరీస్ నేపథ్యంలో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తుది జట్టులో ఉంటాడని అందరూ అనుకున్నారు. వైభవ్ సూర్య‌వంశీ అరంగేట్రం ఇవాళ జరుగుతుందని కూడా అందరూ అంచనా వేసుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో అందరికీ షాక్ ఇస్తూ.. వైభవ్ తుది జట్టు నుంచి తప్పించారు. గౌతమ్ గంభీర్ నిర్ణయం కారణంగానే వైభవ్ అరంగేట్రం ఇవాళ జరగలేదని చర్చ జరుగుతోంది. అయితే దీనిపై ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ ( Michael Vaughan ) సీరియస్ అయ్యారు. గౌతమ్ గంభీర్ చెత్త నిర్ణయం కారణంగానే 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేయలేదని మండిపడ్డారు.

Also Read: Rishabh Pant returns to Delhi Capitals: ఢిల్లీ క్యాపిట‌ల్స్ లోకి రిష‌బ్ పంత్..కొంచెమైనా సిగ్గుండాలంటూ వార్న‌ర్ వివాద‌స్ప‌ద పోస్ట్!

గంభీర్ అస‌లు నీకు బుర్ర ఉందా? వైభ‌వ్ కెరీర్ తో ఆడుకోకు

Advertisement

టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య తొలి టీ20 ( India tour of Ireland, 2026 )  జరగనున్న నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేయడం గ్యారంటీ అని అందరూ అనుకున్నారు. కానీ చివరి క్షణంలో టీమిండియా యాజమాన్యం, గౌతమ్ గంభీర్ ప్లాన్ మార్చి వైభవ్ ను పక్కకు పెట్టారు. దీంతో వైభవ్ కోసం వెళ్లిన అభిమానులకు నిరాశ ఎదురైంది. అటు టీవీలలో మ్యాచ్ చూసే వాళ్ళు కూడా నిరాశ చెందారు. అయితే వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్ తో జరిగిన టీ20 సందర్భంగా అరంగేట్రం చేయకపోవడంపై ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ ( Michael Vaughan ) సీరియస్ అయ్యారు. గౌతమ్ గంభీర్ కు అసలు బుర్రలేదని.. అతడి వల్లే వైభవ్ లాంటి క్రికెటర్ ను ఇవాళ టీవీలో చూడలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. వైభవ్ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రంపై ప్రపంచం మొత్తం వెయ్యి కళ్ళతో చూసిందని.. కానీ చివరి క్షణంలో అతన్ని తప్పించి గంభీర్ పెద్ద తప్పు చేశాడని ఫైర్ అయ్యారు.

టి20 క్రికెట్ లో అరుదైన ఆటగాడు వైభవని… అలాంటోడిని పక్కకు పెట్టడం తాను నమ్మలేకపోతున్నానన్నారు. అసలు గంభీర్ ఏం చేస్తున్నాడో అతడికైనా తెలుసా ? అంటూ ఫైర్ అవుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో వైభ‌వ్ ఆట‌ను మరొకసారి చూసి గంభీర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అంటూ చురకలు అంటించారు. నెక్స్ట్ మ్యాచ్ లోనైనా వైభవ్ ను ఆడించాలని కోరారు. అప్పుడే ఈ టి20 సిరీస్ సక్సెస్ అవుతుందని.. లేకపోతే మ్యాచ్ లు ఎవరు చూడరని కుండబద్దలు కొట్టి చెప్పారు. గంభీర్ కోచ్ గా ఉన్న‌న్ని రోజులు, వైభ‌వ్ అలాంటి కుర్ర క్రికెట‌ర్లకు అన్యాయ‌మే జ‌రుగుతుంద‌ని ఆరోప‌ణ‌లు చేశారు మైఖేల్ వాన్.

Advertisement

Also Read: PCB Set To Send Pakistan Players To USA: సిక్స‌ర్లు కొట్టాలంటూ పాక్ ప్లేయ‌ర్ల‌పై PCB ఒత్తిడి..అమెరికాలో స్పెష‌ల్ ట్రైనింగ్

 

 

Related News

అనుకున్న‌దే జ‌రిగింది..కావ్య కొంప‌ముంచిన ట్రావిస్ హెడ్, పాట్ కమ్మిన్స్

వైభ‌వ్ పై గంభీర్ పాలిటిక్స్ షురూ… 15 ఏళ్ల బుడ్డోడి అరంగేట్రానికి బ్రేకులు ?

Tanveer Ahmed: రొమాన్స్, షికార్లు చేయ‌డానికి మిమ్మ‌ల్ని ఇంగ్లండ్ పంప‌లేదు

Salman Butt: అలాంటి బంతులు వైభ‌వ్ ఎదుర్కొలేడు, 20 ఏళ్ల‌కే కెరీర్ క్లోజ్

Ashwin: 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లో కోహ్లీ, రోహిత్ ఆడకుండా కొంద‌రు కుట్ర‌లు చేస్తున్నారు

నెద‌ర్లాండ్స్ పై దక్షిణాఫ్రికా విజ‌యం…టీమిండియా సెమీస్ ఆశ‌లు గ‌ల్లంతు ?

ఓరి మీ దుంపలు తెగ..ర‌నౌట్ చేసే ఛాన్స్, కావాల‌నే వ‌దిలేసిన నెద‌ర్లాండ్స్‌

Big Stories

×