Telangana Assembly Budget Session-2026: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి అనగా మార్చి 16 నుంచి ప్రారంభం అయ్యాయి. ఉదయం 11. 45 గంటలకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. తెలుగులో ప్రసంగాన్ని మొదలుపెట్టారు గవర్నర్.ఆయన ప్రసంగంలోకి ముఖ్యమైన పాయింట్స్ కొన్నింటికి ఇప్పుడు చూద్దాం. 2047 రైజింగ్ తెలంగాణ దిశగా మనం అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు.
ఏడాది కాలంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చామని, అందరికీ అభివృద్ధి వైపు నడిపించే డోర్ మ్యాప్ సిద్ధం చేసినట్టు పేర్కొన్నారు. 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా లక్ష్యం పెట్టుకున్నట్టు తెలిపారు. ప్రతి పౌరుడ్ని భాగస్వామ్యం చేసేలా బడ్జెట్ అని వివరించారు.జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించామని వివరించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు విభజన చేశామన్నారు. హిల్ట్ పాలసీతో పరిశ్రమల భూముల బదలాయింపు చేశామన్నారు.
ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం, విపక్ష బీఆర్ఎస్ నిరసనలు
ఓఆర్ఆర్ మాదిరిగా రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. అలాగే మూసీని 55 కిలోమీటర్ల మేరా పునరుజ్జీవం చేయాలని డిసైడ్ అయినట్టు తెలిపారు. మూసీలోకి మురికి నీరు కలవకుండా చూస్తామన్నారు. అందుకోసం 39 ఎస్టీపీలు నిర్మాణం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తొలి దశలో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచానికి దిక్సూచిగా తెలంగాణ మారుతోందన్నారు.
కోర్, ప్యూర్, రేర్ గా తెలంగాణను విభజించామన్నారు. ప్రజల భద్రత, రక్షణ కల్పించేలా నాలుగు కమిషనరేట్లు ఏర్పాటు చేశామన్నారు. ఓఆర్ఆర్-ట్రిఫుల్ ఆర్ఆర్ఆర్ కు అనుసంధానంగా రేడియల్ రోడ్లు నిర్మిస్తామన్నారు. ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం జరగనున్నట్లు తెలిపారు.
ALSO READ: వారిని నమ్మారో మీ పని ఐపోయినట్టే.. తేల్చిచెప్పిన పోలీసులు
బుల్లెట్ ట్రైన్లకు శంషాబాద్ కేంద్రంగా మారబోతోందన్నారు. వరంగల్, ఆదిలాబాద్ ల్లో కొత్త ఎయిర్ పోర్టులు రాబోతున్నట్లు తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ తో 5 లక్షల 72 వేల కోట్లు పెట్టుబడులు వచ్చాయన్నారు.విపక్షాల నిరసన మధ్య గవర్నర్ ప్రసంగం సాగింది. పెట్టుబడులపై అబద్దాలు చెబుతున్నారని బీఆర్ఎస్ నినాదాలు చేసింది.
అంతకుముందు అసెంబ్లీ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు గవర్నర్ శివప్రతాప్ శుక్లా. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు, స్పీకర్, మండలి ఛైర్మన్, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అటు విపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గన్ పార్క్ వద్ద నిరసన తెలిపారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నేతలు. ఆరు గ్యారంటీలకు చట్టబద్దత కల్పించాలంటూ ప్లకార్డుల ప్రదర్శన చేపట్టారు.