Telangana Bjp: తెలంగాణలో రాజకీయాల్లో ఏం జరుగుతోంది? ఏడాదిన్నరగా బీఆర్ఎస్ సైలెంట్ కావడానికి కారణమేంటి? వెంటాడుతున్న కేసులే కారణమా? ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీలు మిగతా పార్టీల వైపు చూస్తున్నారా? కారులో కష్టమని డిసైడ్ అయ్యారా? అవుననే అంటున్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు.
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం పోయిన ఏడాదిన్నర పైగానే గడిచింది. కానీ ఆ పార్టీ నేతలు ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఓ వైపు పార్టీలో అంతర్గత సమస్యలు, ఇంకోవైపు వెంటాడుతున్న కేసులతో సతమతమవుతోంది. కనీసం కేడర్ దగ్గరకు వెళ్లే సాహసం చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో ఆ పార్టీ నేతలు పక్క చూపు చూడడం మొదలుపెట్టారు.
తాజాగా తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలామంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారని మనసులోని మాట బయటపెట్టారు. బీఆర్ఎస్‌తో పాటు కొందరు అధికార పార్టీ నేతలు మా వైపు చూస్తున్నారని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు చేసేందుకు ప్రజలు సిద్ధంగా అవుతున్నట్లు చెప్పుకొచ్చారు.
స్వచ్ఛంధంగా మా పార్టీలోకి వస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ హయంలో ఫామ్‌హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ కేసీఆర్ డైరెక్షన్‌లో జరిగిందన్నారు. ఇవాళ అవన్నీ బయటపడుతున్నాయని అన్నారు. అసలు ఫామ్ హౌస్‌లో ఫోన్ ట్యాపింగ్ ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. కెమెరాలు పెట్టింది ఎవరు? ఇవన్నీ బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ALSO READ: బీసీ రిజర్వేషన్ల అంశం.. హస్తినలో తెలంగాణ కాంగ్రెస్ మహాధర్నా
రామచందర్ రావు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుని కొద్దిరోజులు మాత్రమే అయ్యింది. ఈలోగా తెలంగాణలో రాజకీయ పరిణామాలు క్రమంగా మారుతున్నాయి. కేటీఆర్‌పై ఫార్ములా కేసు, కవితపై లిక్కర్ ముడుపుల కేసు, కాళేశ్వరం రిపోర్టు పెద్దాయన-హరీష్‌రావులను వెంటాడుతోంది. ఈ క్రమంలో నేతలు పక్కచూపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ఏం జరగనుందో చూడాలి.
తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు కీలక వ్యాఖ్యలు
చాలా మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు
బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ నేతలు కూడా మా పార్టీవైపు చూస్తున్నారు
ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ మొత్తం కేసీఆర్ డైరెక్షన్ లో జరిగిన స్క్రిప్ట్
డబుల్ ఇంజిన్… pic.twitter.com/5CO1iquAId
— BIG TV Breaking News (@bigtvtelugu) August 6, 2025