Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు. మన్మోహన్ సింగ్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేసి, మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
మన్మోహన్ సింగ్ మృతి వార్త తెలుసుకున్న సోనియా గాంధీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేలు దిగ్బ్రాంతికి లోనయ్యారు. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు వారు ఫోన్ చేసి, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశానికి మన్మోహన్ చేసిన సేవలను వారందరూ కొనియాడారు.
మన్మోహన్ మరణంతో గురువు, మార్గదర్శిని కోల్పోయానని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అపారమైన జ్ఞానం, సమగ్రతతో దేశాన్ని ఆయన నడపించారని కొనియాడారు. ఆర్థిక శాస్త్రంలో ఆయనకు ఉన్న లోతైన అవగాహన దేశానికి స్ఫూర్తిగా నిలిచిందని ప్రశంసించారు. మన్మోహన్ సింగ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ ప్రకటించారు.
గొప్ప ఆర్థికవేత్తగానే కాకుండా, గొప్ప మానవతావాదిగా తక్కువ కాలంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన మహానేతగా మన్మోహన్ సింగ్ ప్రపంచ స్థాయి పేరుగాంచారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సద్గుణం, నిష్కలంకమైన సమగ్రత, ఆర్థికపరమైన కీలక నిర్ణయాలు తీసుకోవడంలో మన్మోహన్ సింగ్ చెరగని ముద్రను వేసుకున్నారని సీఎం కొనియాడారు. రాజకీయ ప్రజా జీవితంలో ఒక లెజెండ్ గా మన్మోహన్ సింగ్ తనదైన ముద్రను వేసుకున్నారని, ప్రధానమంత్రిగా దేశ ఖ్యాతిని ప్రపంచం నలువైపులా చాటి చెప్పిన ఘనత మన్మోహన్ కు దక్కుతుందని సీఎం అన్నారు.
Also Read: Manmohan Singh: ఔను.. మన్మోహన్ సింగ్ ప్రేమలో పడ్డారు.. మీకు తెలుసా!
భరతమాత ఒక గొప్ప బిడ్డను కోల్పోయిందన్న భావన దేశ ప్రజలలో మన్మోహన్ సింగ్ మృతి పట్ల కనిపిస్తుందన్నారు. మన్మోహన్ సింగ్ విధానాలు దేశంలో పేదరికాన్ని తగ్గించాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. దేశం గొప్ప ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు, మానవతావాదిని కోల్పోయిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. దేశానికి నిర్విరామ సేవలు అందించారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గుర్తుచేసుకున్నారు.
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు మన్మోహన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి, దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అలాగే మన్మోహన్ సింగ్ మృతి వార్త తెలుసుకున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
One of the greatest economists, leaders, reformer, and above all, a humanitarian of our times Shri #ManmohanSingh ji is no more.
A man of virtue, impeccable integrity, marked above all by a humane touch in decision making, Dr Singh is one of true architects of new India.
He… pic.twitter.com/vPNCHsUc6q
— Revanth Reddy (@revanth_anumula) December 26, 2024