BigTV English

Manmohan as PM : ప్రధానిగా ప్రగతి పథంలో భారత్ ను నడిపించిన వివేకవంతుడు… మన్మోహన్ సింగ్

Manmohan as PM : ప్రధానిగా ప్రగతి పథంలో భారత్ ను నడిపించిన వివేకవంతుడు… మన్మోహన్ సింగ్

Manmohan as PM : విభిన్న వైవిధ్యాలు,విశాల వనరులున్న భారత్ ను అంతర్జాతీయంగా ఆర్థిక శక్తిగా నిలపాలని కలలు కన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్… దేశ ఆర్థికాభివృద్ధిలో ప్రధానిగా విశేష కృషి చేశారు. ఆయన హయంలో తీసుకున్న అనేక నిర్ణయాలు నేడు సంపూర్ణ ఫలితాల్ని ఇస్తుండగా.. వాటి ఫలాలు దేశ వాసులకు నిండుగా అందుతున్నాయి. ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన తీరు, ప్రధానిగా ఆయన నిర్ణయాలు దేశానికి ఎంతో సేవ చేశాయని.. స్వపక్షమే కాదు వైరి పక్షం సభ్యులు కూడా మన్మోహన్ సింగ్ ను కొనియాడతారంటే.. ఆయనపై ఎంతటి గౌరవ, మర్యాదలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలు…


GDP వృద్ధికి కీలక నిర్ణయాలు

ప్రధానిగా మన్మోహన్ సింగ్ హయంలోనే దేశ ఆర్థిక రంగం కొత్త పుంతలు తొక్కింది. ఆయన గతంలో ఆర్థిక మంత్రిగా అనుసరించిన, తర్వాత ప్రధానిగా ఉన్నప్పుడు చేపట్టిన చర్యలతో… 2007 నాటికి భారత్ అత్యధిక జీడీపీ వృద్ధి రేటు 9 శాతాన్ని సాధించింది. ప్రపంచంలో రెండో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. మన్మోహన్ సింగ్ హయాంలోనే
భారత ఆర్థిక వ్యవస్థ 8–9% ఆర్థిక వృద్ధి రేటుతో వృద్ధి చెందింది.


ప్రత్యేక ఆర్థిక మండలాల (SEZ) చట్టం 2005

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ హయాంలో.. ప్రత్యేక ఆర్థిక మండలి (SEZ) చట్టం 2005 ను అమల్లోకి తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రత్యేక ఆర్థిక మండలాల (SEZ) రూల్స్ 2006 నుంచి అమలు ప్రారంభం కాగా.. దేశంలోకి పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకంగా పనిచేసింది. పెట్టుబడిదారులకు ప్రభుత్వం తరఫున వసతుల కల్పన, ఇతర ప్రయోజనాలు అందించేలా రూపొందించిన ఈ చట్టం కారణంగా.. అనేక మంది దేశంలోని సెజ్ లలో పరిశ్రమల్ని నెలకొల్పారు. దీంతో..లక్షలాది ఉద్యోగాలతో పాటుగా వేలాది కోట్ల పన్నులు ప్రభుత్వాలకు సమకూరాయి. పరిశ్రమ వర్గాలు ఆ మేరకు ప్రయోజనాల్ని పొందారు.

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం

దేశంలోని పేద, వెనుకబడిన వర్గాల వారికి ఆర్థిక చేయూత అందించే ఉద్దేశ్యంతో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రూపొందించిన అద్భుత కార్యక్రమం జాతీయ గ్రామీణ ఉపాధీ హామి పథకం. దీని ద్వారా ఇప్పటికీ..కోట్ల మంది పేదలు ఉపాధికి ఇబ్బంది లేకుండా జీవనాన్ని సాగిస్తున్నారు. 2005లో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు. NREGA ద్వారా ఏడాదిలో కనీసం 100 రోజుల ఖచ్చితమైన వేతన ఉపాధిని అందించడం ద్వారా గ్రామీణ కుటుంబాలకు ఆదాయ భద్రతను అందించగలుగుతుంది.

జీవితకాల గరిష్ఠానికి జీడీపీ.. 10.08% వృద్ధి

నేషనల్ స్టాటిస్టిక్స్ కమిషన్ ఏర్పాటు చేసిన రియల్ సెక్టార్ స్టాటిస్టిక్స్ కమిటీ నివేదిక ప్రకారం.. 2006-2007లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో భారత్ 10.08% వృద్ధి రేటును సాధించింది. 1991లో ఆర్థిక వ్యవస్థ సరళీకరణ తర్వాత భారత్ నమోదు చేసిన అత్యధిక జీడీపీ గా ఆర్థిక నిపుణులు చెబుతారు. అంతకు క్రితం 1988-1989లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 10.2%గా నమోదైంది. ఆ రికార్డును అధిగమించి.. 10.08% సాధించింది.

ఇండో-యూఎస్ అణు ఒప్పందం

ప్రధానిగా మన్మోహన్ సింగ్ సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇండో-యూఎస్ అణు ఒప్పందం ఒకటి. అంతర్జాతీయంగా ఎంత ఒత్తిడి వస్తున్నా, దేశంలోనూ వ్యతిరేక శక్తులు ఇబ్బందులు పెడుతున్నా.. మన్మోహన్ సింగ్ చాలా నిబద్ధతతో, తెలివిగా ఈ ఒప్పందాన్ని ఫైనల్ చేయగలిగారు.

ఈ ఒప్పందానికి సంబంధించిన కార్యాచరణ భారత ప్రధాని మన్మోహన్, అప్పటి యూఎస్ ప్రెసిడెంట్ జార్జ్ డబ్ల్యూ బుష్.. కార్యవర్గాల మధ్య జరిగింది. దీని ప్రకారం.. భారత్ తన పౌర, సైనిక అణు కేంద్రాలను విడివిడిగా నిర్వహించేందుకు అంగీకరించింది. అలాగే.. అన్ని పౌర అణు కేంద్రాలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) పర్యవేక్షణలో ఉంచేందుకు ఒప్పందం కుదిరింది.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×