E-Paper
Advertisement

Numaish Exhibition : నాంపల్లిలో నుమాయిష్ సందడి.. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..

Numaish Exhibition : నాంపల్లిలో నుమాయిష్ సందడి.. ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి..
Advertisement

Numaish Exhibition : హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో నుమాయిష్‌ ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. నుమాయిష్‌లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వ్యాపార వేత్తలు పాల్గొంటారని సీఎం తెలిపారు.

పదేళ్లుగా పేరుకుపోయిన సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. హైదరాబాద్ అంటే చార్మినార్, ట్యాంక్ బండ్, నాంపల్లి ఎగ్జిబిషన్ గుర్తొస్తాయని పేర్కొన్నారు. నుమాయిష్‌లో ఎన్నో కళలకు సంబంధించిన వస్తువులు సైతం ప్రదర్శించడం ఎంతో అభినందనీయమన్నారు. నుమాయిష్ కమిటీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలకు తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు. పదేళ్లుగా పేరుకుపోయిన సమస్యలు అన్నీ పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.

Advertisement

నుమాయిష్ కమిటీలో మహిళల ప్రాతినిథ్యం అభినందనీయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పారిశ్రామిక రంగంలో మహిళలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని ప్రకటించారు. నునాయిష్‌కు వచ్చే వ్యాపారులకు, ప్రజలకు ఏలాంటి ఇబ్బంది తలెత్తకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లను నుమాయిష్ కమిటీ సన్మానించింది.

రాష్ట్రానికి నుమాయిష్ గర్వకారణంగా నిలుస్తోందని మంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. స్వాతంత్య్రం రాక ముందు నుంచి ఎంతో మంది పారిశ్రామిక వేత్తలు, డాక్టర్లు, ఇంజినీర్లు, పలు సంస్థలు నుమాయిష్‌ను ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిర్వహిస్తున్నారని చెప్పారు. 30 వేల మంది విద్యార్థులు ఎగ్జిబిషన్ సొసైటీకి చెందిన విద్యా సంస్థల్లో చదువుకుంటున్నారని వెల్లడించారు. 8 దశాబ్దాలుగా ఎంతో మంది వ్యాపారవేత్తలను తయారు చేశారని తెలిపారు. ఎగ్జిబిషన్‌ సొసైటీలో దశాబ్ద కాలంగా ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

Related News

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

రణరంగంగా మారిన హైదరాబాద్ జేఎన్టీయూ, విద్యార్థుల మధ్య ఫైటింగ్, అర్ధరాత్రి ఏం జరిగింది?

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

Big Stories

Advertisement
×