E-Paper
Advertisement

Telangana CM: మోదీతో రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌.. ఇంధన భద్రతపై తెలంగాణ ప్రణాళిక ఇదే!

Telangana CM: మోదీతో రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌.. ఇంధన భద్రతపై తెలంగాణ ప్రణాళిక ఇదే!

Telangana CM: స్వేచ్ఛ బ్యూరో: పెట్రోలో, డీజిల్‌, గ్యాస్ సరఫరాకు సంబంధించి స‌మీక్ష‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ ప్రధాన కార్య‌ద‌ర్శి ఆధ్వర్యంలో ఒక క‌మిటీని నియమించి పరిస్థితులను ఎప్ప‌టిక‌ప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ఉద్రిక్త‌త‌ల పరిస్థితుల నేపథ్యంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం నిర్వహించిన వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు అంశాలను ప్రధానమంత్రి తెలియపరిచారు.

హైదరాబాద్‌లో కమాండ్ కంట్రోల్

హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీఎస్ ఆధ్వర్యంలోని క‌మిటీ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని ప్రధానమంత్రి మోదీ దృష్టికి తీసుకెళ్లారు. 33 జిల్లాల్లోనూ గ్యాస్ స‌ర‌ఫ‌రా, పెట్రోల్‌, డీజిల్ విక్రయాలు.. బ్లాక్ మార్కెట్ నిరోధానికి కమిటీలు ఏర్పాటు చేసి నోడల్ అధికారులను నియమించినట్లు సీఎం తెలిపారు. ప్రాధాన్య క్ర‌మంలో ఆసుపత్రులు, పాఠశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు గ్యాస్ సిలిండ‌ర్ల‌ను పంపుతున్నట్లు సీఎం తెలిపారు.

సీఎం తెలిపిన వాస్తవాలు

ప్ర‌తి బంక్‌లో స్టాక్ ఎంత ఉంది.. ఎంత వినియోగిస్తున్నార‌నే దానిపై అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తున్నార‌ని సీఎం తెలిపారు. తెలంగాణలో రోజుకు 36,189 కిలో లీట‌ర్ల పెట్రోల్‌, డీజిల్ వినియోగం జ‌రుగుతుంద‌ని.. ప్ర‌స్తుతం 1,88,210 కిలోలీట‌ర్ల నిల్వ‌లు ఉన్న‌ట్లు సీఎం వెల్లడించారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ కొర‌త‌పై సోష‌ల్ మీడియాలో అపోహ‌లు, భ‌యాందోళ‌న‌లు క‌లిగేలా పోస్టులు పెడుతున్న వారిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నామని సీఎం రేవంత్ తెలిపారు.

తెలంగాణలో ఈవీ ప్రోత్సాహం

తెలంగాణ‌లో శిలాజ ఇంధ‌నాలపై (బొగ్గు, చ‌మురు, గ్యాస్‌) ఆధార‌ప‌డ‌డం త‌గ్గించి ఎల‌క్ట్రిక్ వాహ‌నాల (ఈవీ) వినియోగాన్ని ప్రోత్స‌హిస్తున్నామ‌ని.. పున‌రుత్పాక విద్యుత్ ఉత్ప‌త్తి పెంచుతున్నామ‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా తెలంగాణ‌లో ఈవీలపై వంద శాతం రోడ్డు ప‌న్ను, రిజిస్ట్రేష‌న్ ఫీజు మిన‌హాయించామ‌న్నారు.

మంత్రి, సెక్రటరీలు సమావేశం

హైద‌రాబాద్ న‌గ‌రంలో 1.20 ల‌క్ష‌కుపైగా ఉన్న పెట్రోల్‌, డీజిల్ ఆటోల‌ను రిట్రోఫిట్టింగ్ ద్వారా ఈవీలుగా మార్చే ప్ర‌క్రియ ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపారు. ఆర్టీసీ సేవల్లో ఇక ముందు అన్ని ఈవీ బ‌స్సుల‌నే వినియోగించనున్న‌ట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో స‌మావేశంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, సీఎం ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ వి.శేషాద్రి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Also Read:ఏఐ ముప్పు.. కంపెనీలపై ‘పీపుల్ టాక్స్’.. హార్వర్డ్ సదస్సులో సీఎం కీలక వ్యాఖ్యలు!

Related News

అచ్చంపేటలో వినూత్న నిరసన.. దేశం నుంచి బీజేపీని తరిమికొట్టాలి.. ఉదయ భాను చిబ్!

Promotion Scam: డీహెచ్ ఆఫీస్‌లో ఘోరం.. ప్రమోషన్ల కోసం కులాన్నే మార్చేసిన అధికారులు..?

సీఎం రేవంత్ రెడ్డి విజన్‌కు జర్మనీ ప్రతినిధులు జేజేలు.. ఎందుకో తెలుసా..?

ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని బంద్..?

చెరువులో చెట్ల దందా.. ప్రశ్నించిన మహిళా లీడర్‌పై దాడి.. ఫోన్లు లాక్కొని సర్పంచ్ భర్త రౌడీయిజం!

Stubble Burning: రైతు చేసిన చిన్న తప్పుకి.. లక్షల రూపాయల కష్టం నిమిషాల్లో బుగ్గిపాలు..!

కాంగ్రెస్ సర్కార్‌ పై.. నాగం జనార్దన్ రెడ్డి ఫైర్..?

Palamuru: రెండు రోజుల పాటు పాలమూరులోనే సీఎం రేవంత్!

Big Stories

×