E-Paper
Advertisement

Yograj Singh: భార్య‌ల‌ టార్చ‌ర్ వ‌ల్లే క్రికెట‌ర్ల జీవితాలు నాశ‌నం, ఎర్లీగా రిటైర్మెంట్ ఇవ్వొద్దు

Yograj Singh: భార్య‌ల‌ టార్చ‌ర్ వ‌ల్లే క్రికెట‌ర్ల జీవితాలు నాశ‌నం, ఎర్లీగా రిటైర్మెంట్ ఇవ్వొద్దు
Advertisement

Yograj Singh: టీమిండియా క్రికెటర్లపై షాకింగ్ కామెంట్స్ చేశారు యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ (Yograj Singh). భార్యల టార్చర్ ( cricketers’ wives) వల్లే క్రికెటర్ల జీవితాలు నాశనం అవుతున్నాయని.. త్వరగా రిటైర్మెంట్లు ఇస్తున్నారని బాంబు పేల్చారు యోగ్‌రాజ్ సింగ్. ఈ మధ్య కాలంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్, లాంటి క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యువ రాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ టీమిండియా క్రికెటర్ల రిటైర్మెంట్ పై స్పందించారు. ఇంట్లో భార్య, పిల్లల టార్చర్ వల్ల టీమిండియా క్రికెటర్లు రిటైర్మెంట్లు ( Cricketers Retirements) త్వరగా ఇస్తున్నారని తెలిపారు. భార్యల సలహాలు తీసుకోవడం వల్ల టీమిండియా క్రికెటర్లు ఇలాంటి తప్పిదాలు చేస్తున్నారని సీరియస్ అయ్యారు. ఇంట్లో వాళ్ళ మాటలు వినకుండా క్రికెట్ ఆడితే బాగుంటుందని కోరారు.

Also Read: Shahid Afridi On PSL: ఛీ..ఛీ పింక్ బంతులు వాడ‌టం ఏంట్రా…PSL కంటే గ‌ల్లీ క్రికెట్ న‌యం, కేబుల్ టీవీ ప్ర‌సారాల కంటే దారుణం

టీమిండియా క్రికెటర్ల రిటైర్మెంట్ కు భార్యలే కారణం.. యోగరాజ్ సంచలనం

Advertisement

టీమిండియా స్టార్ క్రికెటర్లు త్వరగా రిటైర్మెంట్ ప్రకటించిన అంశంపై తాజాగా యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ (Yograj Singh) స్పందించారు. టీమిండియా ప్లేయర్లు త్వరగా రిటైర్మెంట్ ప్రకటించడానికి కారణం వల్ల భార్యలే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పిల్లలు, కుటుంబం అంటూ టీమిండియా క్రికెటర్ల మనసులు వాళ్ల భార్యలే మార్చుతారని సీరియస్ అయ్యారు. 30 ఏళ్లు దాటగానే మహిళల ఆకృతి మారిపోతుంది.. దీంతో సహనం కోల్పోయి, ఇంట్లో ఉన్న భర్తలపై సీరియస్ అవుతూ ఉంటారని పేర్కొన్నారు యోగ్‌రాజ్ సింగ్. ఇక భార్యల టార్చర్ తట్టుకోలేక చాలామంది క్రికెటర్లు త్వరగానే రిటైర్మెంట్ ఇస్తున్నారని వివరించారు.

క్రికెటర్ల వయసు 35 సంవత్సరాలు దాటగానే, తమ భర్తలకు భార్యలు కోచింగ్ ఇవ్వడం మొదలు పెడతారని తెలిపారు. రిటైర్మెంట్ ఇవ్వాలని, కుటుంబం అలాగే పిల్లలను చూసుకోవాలని ఇంట్లో రోజు కూడా గొడవ పెట్టుకుంటారని యోగ రాజసింగ్ అభిప్రాయపడ్డారు. ఇక ఈ బాధలు తట్టుకోలేక టీమిండియా క్రికెటర్లు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు యోగరాజు సింగ్. అయితే ప్రస్తుతం ఉన్న క్రికెటర్లు తమ భార్యల మాటలు వినకుండా క్రికెట్ పైన దృష్టి పెట్టడం చాలా అవసరం అన్నారు. అలా అయితేనే వాళ్ల కెరియర్ బాగుంటుందని.. లేకపోతే కష్టమేగాని తెలిపారు. ఇక అటు ఎప్పుడూ ధోనిని విల‌న్ చేసి వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేసే యోగ్ రాజ్ సింగ్…తొలిసారి మెచ్చుకున్నారు. మ‌రో ప‌దేళ్లు ధోని ఐపీఎల్ ఆడాల‌ని కోరారు. కాగా రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీ లాంటి క్రికెట‌ర్లు త్వ‌ర‌గానే రిటైర్మెంట్ ఇచ్చార‌నే ఆవేద‌నలో యోగ్‌రాజ్ సింగ్ ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు స‌మాచారం.

Advertisement

Also Read: DK Shivakumar On IPL Tickets: ఐపీఎల్ లో కొత్త పంచాయ‌తీ, ప్ర‌తి ఎమ్మెల్యేకు 4 VIP టికెట్లు..? డీకే శివ కుమార్ వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు

 

 

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×