BigTV English

Weather Alert: బీ అలర్ట్..! తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కుండపోత వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు..

Weather Alert: బీ అలర్ట్..! తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కుండపోత వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు..

Weather Alert: రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా చిరుజల్లుల నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మధ్యహ్న సమయంలో ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయి వర్షాలు బయటకు వెళ్లకుండా దంచికోడుతున్నాయి. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడుతున్నాయి. నిన్న హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిశాయి.


తెలంగాణలో ఈ జిల్లాల్లో భారీ వర్షం..
తెలంగాణలో బుధ, గురువారాల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శా వెల్లడించింది. మరో మూడు, నాలుగు రోజుల వరకు.. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్న రాత్రి అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లిలో 9.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తూప్రాన్‌పేటలో 9.53, భువనగిరి నందనంలో 7.1 సెంటీమిటర్ల వర్షపాతం నమోదైంది. ఇక నాగర్ కర్నూల్ జిల్లాలో 6.65, హైదరాబాద్‌లో 3.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

గంటకు 30-40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు


ఇవాళ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో.. గంటకు 30-40వేగంగల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో పలు ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, సూర్యపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్, యాదాద్రి భువనగిరి, జనగాం, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఏపీకి రాబోయే నాలుగు రోజులు వర్ష సూచన
ఏపీలో రాబోయే నాలుగు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు తీరంతో పాటు రాయలసీమ పరిసర ప్రాంతాల్లో వేర్వేరు ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. వీటి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశముందని పేర్కొన్నారు.

Also Read: జగన్‌ను ఇరికించిన చెవిరెడ్డి?

హైదరాబాదీలను భయపెడుతున్న భారీ వర్షాలు
హైదరాబాద్‌లో రెండు రోజులుగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కూడా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జూబ్లీ హిల్స్‌, యూసఫ్‌ గూడ్, కూకట్‌పల్లి, అల్వాల్‌, సికింద్రబాద్‌, అంబర్‌పేట్‌, ఉప్పల్, ఎల్బీనగర్ వంటి ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Related News

Congress: బీసీ రిజర్వేషన్ల కోసం.. హస్తినలో తెలంగాణ కాంగ్రెస్ మహాధర్నా

KTR In Delhi: కేటీఆర్ ఢిల్లీ ముచ్చట్లు.. ఆ భేటీ ఉద్దేశమేంటి?

KCR Big Sketch: గువ్వల రిజైన్ వెనుక కేసీఆర్ కొత్త స్కెచ్ ?

Farmers: సొంత భూమి ఉంటే చాలన్నా.. సింపుల్‌గా రూ.50వేలు పొందండిలా..?

Chiranjeevi: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో చిరంజీవి? కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కేటీఆర్

Big Stories

×