Big Stories

TS SSC Results Re-Verification : తెలంగాణ టెన్త్ ఫలితాల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ ఫీజు, లాస్ట్ డేట్ వివరాలు

TS SSC recounting date and fee details : ఏప్రిల్ 30న తెలంగాణ టెన్త్ ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో బాలికలే అధిక శాతం ఉత్తీర్ణులయ్యారు. 6 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదని, అవన్నీ ప్రైవేట్ స్కూళ్లేనని విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం చెప్పారు. అలాగే జూన్ 3వ తేదీ నుంచి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని, ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు.

- Advertisement -

కాగా.. మార్కులు తక్కువ వచ్చిన విద్యార్థులు, ఫెయిలైన విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు ఆయన వెల్లడించారు. రీ కౌంటింగ్ కు రూ.500, రీ వెరిఫికేషన్ కు ఒక్కో సబ్జెక్టుకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు మే 15లోగా ఫీజు చెల్లించాలని తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్లు, వారు చదువిన స్కూల్ ప్రిన్సిపల్ సంతకంతో కూడిన దరఖాస్తును డీఈో కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లో ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. కొరియర్లు, పోస్టులలో దరఖాస్తులను స్వీకరించబోమని స్పష్టం చేశారు.

- Advertisement -

Also Read : తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఆ సబ్జెక్టుల్లో ఎక్కువమంది ఫెయిల్

టెన్త్ పరీక్షల్లో పాసైన విద్యార్థులు అఫీషియల్ వెబ్ సైట్ నుంచి మెమోలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఒరిజినల్ మార్క్స్ లిస్ట్ మెమోలను త్వరలోనే విద్యాశాఖ సంబంధిత పాఠశాలలకు పంపనుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News