Chandra Mohan : తెలుగు చలనచిత్ర పరిశ్రమ దిగ్గజం చంద్రమోహన్, 1966లో రంగులరాట్నం సినిమాతో సినీ పరిశ్రమంలో అడుగుపెట్టారు. అతను తొమ్మిది వందలకు పైగా చిత్రాలలో నటించారు. సహజమైన నటన తో పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేస్తారు చంద్రమోహన్. ఎక్కువగా సహాయక పాత్రలో నటించి మెప్పించారు. ముఖ్యంగా ఆయన చేసిన సినిమాలలో సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సీతామహాలక్ష్మి,16 ఏళ్ళ వయసు,వంటివి ఆయన కెరియర్ లోనే గోల్డెన్ మూవీస్.అయన సహాయక నటుడిగా చేసిన సినిమాలలో నిన్నేపెళ్లాడతా ,నువ్వు లేక నేను లేను,దేశముదురు,వంటివి ఎన్నో సినిమాలతో మెప్పించారు. తాజాగా ఆయనకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటికి వచ్చింది. అదేంటన్నది ఇప్పుడు చూద్దాం..
అయన భోజన ప్రియుడు ..
టాలీవుడ్ లో సీనియర్ నటులలో చాలామంది హాస్యానికి ప్రాధాన్యత ఇచ్చే పాత్రను ఎంచుకునేవారు. వారిలో చంద్రమోహన్ ఒకరు. మొదట హీరో పాత్రలు చేసిన ఆ తరువాత సహాయక నటుల పాత్రలో నటించి, కామెడీ ప్రాధాన్యత ఇచ్చే సినిమాలలోనే నటించారు. అందుకే ఆయన సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడేవారు. తాజాగా ఆయన గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. చంద్రమోహన్ స్వతహాగా బ్రాహ్మణుడు. అయినా ఆయన నర మాంసం తప్ప మిగిలిన అన్ని మాంసాలు తినేవాడుట, ఆయన భోజనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. మధ్యాహ్నం కౌజు పిట్టల మాంసం తినేవాడు. బ్రాహ్మణుడిగా ఉండి నాన్ వెజ్ తినడం చంద్రమోహన్ కి అలవాటు. భోజనంలో తప్పకుండా నాన్ వెజ్ ఉండి తీరాల్సిందేట షూటింగ్ కి తప్పకుండా భోజనం తీసుకొని వచ్చేవారుట ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న అభిమానులు బ్రాహ్మణుడై ఉండి నాన్ వెజ్ ఎలా తిన్నారా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
ఆ పాత్రలు ఆయన మాత్రమే చేయగలరు ..
ఇక చంద్రమోహన్ తెలుగు ఇండస్ట్రీలోనే దాదాపు ఐదు దశాబ్దాల పాటు ప్రజాదరణ పొందిన నటుడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన ముద్ర వేశాడు. చంద్రమోహన్ వ్యవసాయరంగం లో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు. ఆయన ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్‌కు కు బంధువు. నాటకాలలో అనుభవం ఉన్నప్పటికీ, సినిమా రంగంలోకి రావడానికి ఆయన మొదట్లో ఆసక్తి చూపలేదు. అయితే, బంధువుల ప్రోత్సాహంతో ‘రంగుల రాట్నం’ కోసం ఆడిషన్‌లో పాల్గొని, ఆ సినిమాలో నటించారు. చంద్రమోహన్ సహజమైన నటనకు పెట్టింది పేరు. సీన్ ఏదైనా సమర్థవంతంగా చేయగలిగిన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఆయన డైలాగ్ డెలివరీ ఆయన హావ భావాలు ఆ క్యారెక్టర్ కు ప్రాణం పోస్తాయి. అతను చిన్న పాత్ర అయినా సరే కథ నచ్చితే చేసేవాడు.ఆయన చివరి సినిమాలు దువ్వాడ జగన్నాథం, గౌతమ్ నంద, మిస్టర్, ఆక్సిజన్, హైప,ర్ మనమంతా,రెడీ,ఢీ. వంటి సినిమాలలో ఆ పాత్రలు ఆయన మాత్రమే చేయగలరు అనే విధంగా నటించారు.చంద్రమోహన్ కి ఇద్దరు కుమార్తెలు.ఆయన 2022 నవంబర్ 11న హైదరాబాదులో గుండెపోటుతో మరణించారు. ఆయన మన నుండి దూరమైనా ఆయన సినిమాల రూపంలో మనతోనే ఉన్నారు.
Shiva Jyothi : నువ్వు లేకపోతే నేను… శివజ్యోతి ఎమోషనల్ వర్డ్స్